సబ్ ఫీచర్

నిజాల నిలువుటద్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని కళ్లముందు ఉంచే ప్రసార సాధనం టెలివిజన్. 20వ శతాబ్దంలో టివి అశేష ప్రజలను ప్రభావితం చేసింది. భూగోళంపై ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన ఇంటిలోని బుల్లితెరపై ఆ దృశ్యాలను చూపిస్తోంది. సామాజిక మాధ్యమాలకన్నా దృశ్యశ్రవణ మాధ్యమానికి చుక్కానిలాంటి టివి నిజాలకు నిలువుటద్దంగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో చూసేవన్నీ నిజాలని కాదు. వాస్తవ సంఘటనలు, చర్చలు, కొన్ని అతిశయోక్తులు ఉండొచ్చు. టీవీల్లో వచ్చే కార్యక్రమాలు ప్రజల నిర్ణయంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కేవలం వార్తలకే ఇది పరిమితం కావడం లేదు. వినోదరంగానికి టివి ఒక ఆయుధంగా మారిపోయింది. ఆర్థిక, సామాజిక, విద్య, మానసిక పురోగతికి ఇది దోహదం చేస్తోంది. వ్యాపారమే పరమావధిగా కార్యక్రమాలను రూపొందించడం నిర్వాహకుల లోపం. ఈ తప్పు ప్రసారసాధనమైన టీవీది కాదు. ప్రపంచంలో అనేక సంక్షోభాలు, యుద్ధాలు, భయాలు, విద్రోహాలు, ఆనందాలకు అద్దంపట్టిన టీవీ ప్రజలను ఆకర్షించాయి. నిర్ణయాలు తీసుకునేటంత ప్రభావం చూపకపోయినా ఆసక్తిని కలిగించడంలో టీవీ విజయం సాధించింది. అందుకు గుర్తుగా ఏటా 21 నవంబర్‌ను ప్రపంచ టీవీ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 1996లో గుర్తించింది. ఇదేమీ వేడుక కాదు. కానీ ఈ సందర్భంగా ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి సారథ్యంలో వివిధ దేశాలు చేపట్టిన మానవత, సామాజిక, శాంతిస్థాపన కార్యక్రమాలపై రూపొందించిన డాక్యుమెంటరీలు, పర్యావరణం, ప్రకృతిలో వస్తున్న మార్పులపై ఆసక్తి రేపే దృశ్యకథనాలను ఈ సందర్భంగా విడుదల చేస్తారు. అన్ని మాధ్యమాల మాదిరిగానే టీవీ మాధ్యమాన్ని దుర్వినియోగం చేస్తున్నవారు ఉన్నారు. టీవీ ప్రభావంపై 33 దేశాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ప్రజలు 70 శాతం వరకు నమ్మకమైన ప్రసార సాధనంగా టీవీకి జైకొట్టారు. ప్రింట్ మీడియా తరువాత రెండో నమ్మకమైన సమాచార సాధనంగా వీరు టీవీని పేర్కొన్నారు. ఇవే విషయాలు ‘‘డిజిటల్ న్యూస్ రిపోర్ట్ - 2017’’లో కూడా తెలిపారు. ‘ట్రస్ట్ ఇన్ మీడియా -2017 రిపోర్ట్’ కూడా సామాజిక మాధ్యమాలలో టీవీ విశ్వసనీయమైనదని పేర్కొన్నది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కన్నా టీవీ, ప్రింట్ మీడియా సమాచారంపై ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉందని ఈ నివేదిక పేర్కొంది. దేనికైనా ఓ పరిమితి ఉంటుంది. టీవీని అదేపనిగా చూడటం అనర్థదాయకం. ముఖ్యంగా పిల్లలపై ఇది తిరోగమన ప్రభావం చూపిస్తుంది. భారత్‌లో టీవీ యుగం ఇందిరమ్మ హయాంలో మొదలైనా రాజీవ్ పాలనలో విస్తృతమైంది. ఆ తరువాత సమాచార విప్లవం ప్రజల అభివృద్ధికి దోహదం చేసింది. ఎడతెగని వినోద కార్యక్రమాలు అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇంటిల్లిపాదినీ కట్టిపడేసి మరో పనిపై శ్రద్ధ లేకుండా చేస్తున్న టీవీని చాలామంది ఇడియట్ బాక్స్ అంటారు. కానీ అనాల్సింది దానిని కాదు. దానిని ఎక్కువసమయం చూస్తున్నవారిని, వారిని నియంత్రించలేనివారిని నిందించాలి. ఇప్పటికైనా మనం మేల్కొని అద్భుత సమాచార సాధనమైన టీవీని సద్వినియోగం చేసుకోవడం విజ్ఞత అనిపించుకుంటుంది.

-డా. పోటు భగత్‌కుమార్