సబ్ ఫీచర్

ఏడు పదుల తలపోత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను అప్పట్లో ఉన్నట్లు ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాను.
ఇది ప్రశ్న కాదు కానీ ఏడు పదులు దాటిన తర్వాత పుట్టుకొచ్చే తలపోతా.
అవును, మూడు పదులలో ఉన్నట్లు ఆరు పదులలో ఉండటానికి ప్రయత్నించా. కొంతవరకు సాధ్యమవుతుందేమో కానీ ఏడు పదులు దాటిన తర్వాత ఎంతలా ప్రయత్నించినా అది నటన అనిపిస్తుంది.. అయినా రక్తికట్టదు.
ఇంతటి రాద్ధాంతానికి జవాబు ఒక్కటే.. వయసుకు తగ్గట్టు వ్యక్తిత్వం వికసించాలి, వర్తనమూ వయసుతో పోటీపడాలి. నిజానికి ఆ వ్యక్తిత్వ వర్తనమే అందమూ, ఆనందమూను.
అన్నట్టు, పెద్ద వయసులో ఇట్టే అందే గుర్తింపు వయసులో ఉన్నపుడు అంత సులభంగా అందిరాదు. వయసులోని అందం వేరు. వయసు మరలిన తర్వాత చేకూరే అందం వేరు.
నెరసిన తలకు నల్లరంగు పులుముకుంటేనే అందం అనుకోవటం ఎంతవరకు అబద్ధం కాదు?! ... ఎప్పటికైనా తెలుపు వెలుగే.. రంగు తరగని వెలుగు తెలుపుది.
అవును, జీవితకాలమంతా వ్యక్తిత్వంలో ఏదో ఒక మార్పు ఉంటూనే వుంటుంది. అయితే ఆ మార్పులు త్వరితగతిన జరిగేవి కాదు. వయసు పైబడ్డ తర్వాత కలిసొచ్చే మార్పులు మాత్రం త్వరత్వరగా లెక్కకు అందుతుంటాయి.
వయసులో ఉన్నపుడు ఆత్మవిశ్వాసానికి కొదవ లేదు.. నిజానికి, వయసు ఉడిగిన తర్వాత కూడా ఆత్మవిశ్వాసం వలసినంత ఉంటుంది కానీ ‘అయినవారి’ ఆదరణ కరువవుతుండటంతో ఆ ఆత్మవిశ్వాసం క్రమేణా తన అస్తిత్వాన్ని కోల్పోతుంటుంది.
చిన్ననాటి వ్యక్తిత్వ పాఠాలు వేరు.. వయసులోని వ్యక్తిత్వ ముచ్చట్లు వేరు.. వయసు మీరిన తర్వాత వ్యక్తిత్వ వెలుగులు వేరు.
***
పసితనంలో అలిగినట్లుగా పండిన వయసులను అలగటం చాలా సామాన్య విషయం. ఇలా అలిగితే ‘మూడీ’ అని పేరుబడడమూ ఖాయమే!
మూడ్స్ త్వరితగతిన మారిపోతుంటాయి.. మేఘాల్లా కదిలిపోతుంటాయి.. కారుమబ్బులు కరిగిపోవటానికి ఎంతో సమయం పట్టదు. అలాగే పండినతనంలోని మూడ్స్ కూడా ఇంటెన్సిటీని కోల్పోతుంటాయి.
అన్నట్టు మనలోని కణాలు ప్రతి ఏడేళ్ళ కొకమారు సమూల మార్పులు చెందుతుంటాయట.. అలాగే మూడ్స్ సైతం ప్రతి ఏడేళ్ళకు ఒకసారి కొత్త రంగును సంతరించుకుంటాయి.. అయితే, పసిడితనంతో ఆ పసిమి కాకిబంగారం కాకుండా చూసుకోవాలి! అదే ఏడుపదుల వ్యక్తిత్వ అస్తిత్వం.

ముదిమికి దగ్గర చేసేది వార్థక్యపు ఆలోచనలే!

వృద్ధాప్యం వరమా! శాపమా! ఈ ప్రశ్న మనమెందుకు వేసుకోవాలి. జీవిత చరమాంకంలో ముదిమి మీదపడినా ఏం కంగారు పడనక్కర్లేదు. ఎవరి సత్తా వారిది. దానికోసం ఆలోచిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. నడకొస్తుందో రాదో! మంచి ఆలోచనలతో శరీరాన్ని మనసుని అదుపులో పెట్టుకుంటే.. ఎంచక్కా మీరు అరవైలో ఇరవై కింద లెక్కే. కొత్తగా వృద్ధాప్యానికి నిర్వచనాలు మారిపోయాయని మీకు తెలుసా. అయితే ఒకసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులను గమనించండి. 80 వయస్సు ఉంటేనే వృద్ధాప్యంలోకి అడుగిడినట్లు. 18-65 ఏళ్ళవారు యువత కింద, 66-70 ఏళ్ళవారు మధ్యవయస్సువారని ఐరాస ప్రకటించింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఇంతలోనే తనకేదో జరిగిపోతుందనే భావనతో కుంగుబాటుకు లోనవుతాం. అంతే తప్ప 60 అంటే వార్థక్యం కాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు కరెక్టే అయివుంటుందన్న ఊహే రాదు. అదేమి పాపమోగానీ ఎంతసేపూ ఆలోచనలు తిరోగమనంలోకే దారితీస్తుంటాయి.
పొద్దునే్న లేచి సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేసేవారిని ఏమనుకోవాలి. నిజానికి అదీ ఒక వ్యాయామమే కదా! అలాంటివాటికి అలవాటుపడినా ముదిమి దగ్గరకి రాదు. వస్తే గిస్తే వార్థక్యపు ఆలోచనలే మనల్ని ముసలాళ్లను చేస్తాయి. అందుకే అలాంటి భావనలను విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టిననాడే వృద్ధాప్యం అసలు సమస్య కాబోదు.
కొందరైతే అంటుంటారు, ఇపుడు భవిష్యత్తంతా యువతదే. అంటే ప్రపంచంలో ఇక వృద్ధులు ఉండరనా? లేక వృద్ధాప్యమే ఈ సృష్టిలో కనబడదనా? ఏదో వాళ్ల చాదస్తం కానీ, ‘కొత్తనీరు పాత నీరు’ అనేది ఒక నిరంతర సృష్టి ప్రక్రియ. ఆ చక్రం అలా తిరగవలసిందే.
‘ఆరోగ్యమే మహభాగ్యమని’ చెప్పే డాక్టర్లు కూడా వ్యాయామం కోసం పాటుపడరు. ఏదో వార్థక్యం భయంతోనే జిమ్‌లు, వెయిట్ లిఫ్టింగ్ పరికరాలు, సైకిళ్లు కొనేస్తుంటారు. కానీ వాటిని ఒక్క రోజు కూడా వాడిన పాపాన పోరు. అలాంటివన్నీ ఎదురుగా వుంటే ‘వ్యాయామస్ఫూర్తి’ కలిగిస్తుందని అనుకోవాలి. రిటైర్ అయిన రోజునే పింఛన్ పేపర్లు చేతికందుతాయి కనుక ఇంటికెళ్లి పడక్కుర్చీలో కూలబడి ‘ఇక నాపనైపోయిందంటే’ ఏముంది! ‘వార్థక్య రాక్షసి’ మీద పడి రక్కేయదూ! అందుకే కాలక్షేపానికైనా ఏదో వ్యాపకం అలవాటు చేసుకోండి. అపుడే మనసు శరీరం మన అదుపులో ఉంటుంది.
-వరిగొండ కాశీ విశే్వశ్వరరావు

-వాసిలి వసంతకుమార్