సబ్ ఫీచర్

ఇక సమయము లేదు మిత్రమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ అనే ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 14 వేల ఓట్ల తేడాతో బిజెపి ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం సాధించాడు. 12 నవంబర్ 2017 నాడు ఈ ఫలితాలు వెలువడ్డాయి. అక్కడ ప్రేమసింగ్ అనే కాంగ్రెస్ అభ్యర్థి గత నాలుగు పర్యాయాల ఎన్నికలలోను విజయాన్ని సాధించాడు. ఆయన మృతి వలన ఏర్పడిన ఖాళీని తిరిగి కాంగ్రెస్ నిలబెట్టుకుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణజిత్ సుర్జీవాలా మాట్లాడుతూ దేశంలో పరివర్తనా పవనాలు వీస్తున్నాయి అని ఆనందంగా వ్యాఖ్యానించాడు. ఇక్కడ 2వేల ఓట్లు నోటాకు పడటం విశేషం. ఈ ఫలితాన్ని కొంచెం జాగ్రత్తగా విశే్లషిస్తే బిజెపి అభ్యర్థి త్రిపాఠి అగ్ర కులానికి చెందినవాడు. ఆయనను ఓడించడం కోసం కాంగ్రెసుకు బిఎస్‌పి, ఎస్.పి. వంటి వర్గాలు మద్దతునిచ్చాయి. ఏమైనాకూడా బిజెపి ఓడిపోవలసిందేనని కాంగ్రెస్ కంకణం కట్టుకున్నది. ఈ ఒక్క ఓటమివల్ల యుపి అసెంబ్లీలో బలాబలాలు ఏమీ మారిపోవు. పైగా చనిపోయిన కాంగ్రెసు అభ్యర్థిపట్ల సానుకూల పవనాలు ఉంటాయి. అక్కడ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ గమనించవలసిన ప్రధానాంశాలు రెండు ఉన్నాయి.
ఈ బిజెపి అపజయాన్ని ‘కాంగ్రెసు ఎందుకు భూతద్దంలో చూపుతున్నది? మొత్తం దేశంలోనూ కాంగ్రెసు పవనాలు వీస్తున్నట్లు ఎందుకు భ్రమింప చేస్తున్నది?
అసలు బిజెపి ఎందుకు ఓడిపోయింది? నరేంద్రమోదీ యోగి ఆదిత్యనాథ్‌ల గ్లామర్ తగ్గిందని పొలిటికల్ గ్రామర్ చెబుతున్నదా?
2014 ఎన్నికలలో బిజెపి 300 పార్లమెంటు స్థానాలు మిత్రులతో కలసి గెలుచుకుని రికార్డు సృష్టించింది. యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయం సాధించి ములాయం సింగ్ పార్టీని మట్టి కరిపించాడు. మరి ఇంతలో ఏమయింది? బిజెపిని ఎక్కడ అవకాశం దొరికినా ఓడించాలని దేశంలో ఎందరో ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రాత్రింబవళ్లు ఇదే పనిమీద ఉన్నారు. చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు సాయుధపోరాటం సాగిస్తున్నారు. రెండుకోట్ల మంది రోహింగ్యాలు మయన్మార్ నుండి ఇండియాలోకి ప్రవేశిస్తే వారికి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్‌కార్డులు కూడా ఇస్తున్నాయి. బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో బంగ్లాదేశ్ పౌరులు లక్షల సంఖ్యలో స్థిర నివాసాలు ఏర్పరచుకుంటే లోగడ జ్యోతిబసు ఇవ్వాళ మమతాబెనర్జీ వాళ్ల ఓట్లమీద తమ అస్తిత్వం కాపాడుకున్నారు. 1990 తర్వాత 6 లక్షల మంది కశ్మీరీ పండిట్లు తరిమివేయబడ్డారు. ఫలితంగా కశ్మీరు డెమోగ్రఫీ మారిపోయింది. తెలంగాణలో ఇత్తెహాదుల్ మజ్లీస్ లక్షలమంది స్థానిక హిందూ పౌరులను 1948లో చంపడమో, తరిమివేయడమో చేసింది. అలాంటి మజ్లీస్‌తో 2017లో స్థానిక ప్రభుత్వం బహిరంగంగా ఎన్నికల ఒప్పందం చేసుకున్నది. కేరళలో 12 నవంబర్ 2017నాడు త్రిశూర్ జిల్లాలో ఆనంద్ అనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను సిపిఎం కార్యకర్తలు హత్య చేశారు. ఇది కేరళలో జరిగిన 281వ హత్య. బ్రతుకంతా విలాస జీవితానికి అలవడి ఎయిర్ కండిషన్ గదులల్లో విస్కీ చప్పరిస్తూ కమలహాసన్ అనే ఒక సినీనటుడు చెన్నైలో హిందూ ఉగ్రవాదం నశించాలి అంటూ పత్రికా ప్రకటన విడుదల చేశాడు. కేరళలో బహిరంగంగా చేతులు కలిపాడు. నిర్లజ్జగా కర్నాటకలో కాంగ్రెసు సిద్దరామయ్య ప్రభుత్వం టిప్పు సుల్తాను జయంతి ఉత్సవాలను జరుపుతున్నది. నాలుగు లక్షల కోట్లు ఇవ్వండి భారతదేశంలో అందరి చేతిలోనూ బైబిలు ఉండేటట్టు చూస్తాను అని హైదరాబాద్‌లో కంచ ఐలయ్య నిర్భయంగా ప్రకటించాడు. మరి ఇంత జరుగుతున్నా బిజెపి ఏం చేస్తున్నట్లు? పూర్తి మెజారిటీలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ దేశ రక్షణ విషయంలో ఎందుకు రాజీపడుతున్నది? లభించిన సువర్ణ అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకుంటున్నది? అప్పుడే మూడున్నర సంత్సరాల పాలనాకాలం హారతికర్పూరంలా హరించుకొనిపోయింది. ఇక మిగిలింది ఒక్క సంవత్సరం. భవిష్యత్‌లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఏకకాలంలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి.
బిజెపి ఇప్పుడు ఒక సాకు చూపుతున్నది. ఎరినైనా శిక్షించే అధికారం కోర్టులకే ఉంటుంది. మేము కేవలం కేసులు పెట్టి విచారణ మాత్రమే జరుపుతాము అని. మరి కేరళలో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆనంద్‌ను సిపిఎం కార్యకర్తలు చంపినప్పుడు ఈ భారత రాజ్యాంగం ఎలా అనుమతించింది? నిషేధించవలసిన మజ్లిస్ పార్టీతో తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న టిఆర్‌ఎస్ ఎలా ఎన్నికల పొత్తు పెట్టుకున్నది. హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ స్థావరం ఉంది. ఇక్కడి అమ్మాయిలను ముసలి షేకులు నికా చేసుకొని సౌదీ అరేబియా తీసుకుపోయి తలాక్ చెప్పి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. ఇవేవీ ప్రభుత్వాలకు కన్పడవా? సునందా పుష్కర్ హత్య కేసు ఏమయింది? అందులో కాంగ్రెస్ ఎంపి శశిధరూర్ మొదటి ముద్దాయి. ఇతడి రెండవ భార్య ఒక పాకిస్తానీ గూఢచారిణి. ‘నేను నోరు విప్పితే నీ బతుకు నీ స్నేహితుడి బతుకు బజారుకెక్కుతుంది’ అని శశిథరూర్‌ను సనుంద బెదిరించింది. అందుకని ఆమె నోటిని మూసివేశారు. మరి బిజెపి ఏం చేస్తున్నట్లు??
చిత్రకూట్‌లో బిజెపి ఓటమి స్వయంకృతాపరాథం. అభిషేక్ సింగ్ సంఘ్వి లాంటి లైంగిక నేరస్థులు కూడా టివీలలో బిజెపికి వ్యతిరేకంగా భయంకరంగా అరుస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ రాహుల్ గాంధీ మోతీలాల్ వోరా పీకలలోతు కూరుకుపోయారు. ఐనావారు పెద్దమనుషుల్లా బెయిల్‌పై వీధుల్లో తిరుగుతున్నారు. నరేంద్రమోదీని గద్దె దిగాలని శాసిస్తున్నారు. నిజమే- పిల్లి గుడ్డిదైతే ఎలుక పిల్లిపైకెక్కి స్వారీ చేసిందని ఓ తెలుగు సామెత.
నిన్న 35 మంది ఇండియన్ జాలర్లను పాకిస్తాన్ అపహరింకొనిపోయింది. పాక్ చెరలో ఉన్న కులభూషణ యాదవ్ బ్రతుకు ఏమయినట్లు? అప్రజాస్వామిక దేశం పాకిస్తాన్‌లో ఆ దేశ ప్రధానిని నిన్న సుప్రీంకోర్టు అభిశంసించింది. మరి మన దేశంలో వికీలీక్స్ పేపర్లు, పనామా, పారడైజ్ పేపర్ల ద్వారా బయటపడ్డ పన్ను ఎగవేతదారులను ఆర్థిక నేరస్థులను కనీసం ఒక్కడిని కూడా ఈ ప్రభుత్వం ఎందుకు జైలుకు పంపలేకపోయింది?
కేంద్ర మంత్రివర్గం నుండి జయంత్ సిన్హాను ఎందుకు తొలగించలేదు? ఈయన పేరు పారడైజ్ పత్రాలలో ఉంది. రమణసింగ్ కొడుకు అభిషేక్‌సింగ్ పేరు పనామా పత్రాలల్లో ఉంది. ఒకవ్యక్తి బిజెపిలో ఉన్నంత మాత్రాన దేవుడైపోడు. ఆ పత్రాల్లో పేర్లు ఉన్నవారిపై ఏం చర్యలు తీసుకున్నారు?
డోక్లాలో చైనా భారత్ భూటాన్ భూభాగాలను ఆక్రమించుకుంటున్న ‘శుభ’ ముహూర్తంలో రాహుల్‌గాంధీ చైనా రాయబార కార్యాలయానికి వెళ్లి రహస్యంగా ఏమి మాట్లాడి వచ్చారో నిఘా విభాగానికే తెలియదా? మణిశంకర్ అయ్యర్ కరాచీ వెళ్లి ‘మీరూ మేమూ కలసి నరేంద్ర మోదీని గద్దె దింపాలి’ అని దునియా టీవీలో బహిరంగంగా ప్రకటించి వచ్చాడు కదా. ఇది రాజ్యాంగ విరుద్ధమైన దేశద్రోహ చర్య- అని తెలిసి కూడా అతడిని ఎందుకు అరెస్టు చేయలేదు? ఉత్తర ప్రదేశ్‌లోని సరయూ తీరంలో రాముడి విగ్రహం పెడుతుంటే సిపిఎం ప్రవక్త సునిల్ చోప్రా ఈ విగ్రహాలెందుకు? ఉపాథి కావాలి అంటున్నాడు. నిజమే-మరి నలభై ఏళ్ల సిపిఎం పాలనలో బెంగాల్‌లో ఉపాథి లేక ప్రజలు ఎందుకు నిరుద్యోగులు, నిరుపేదలు అయినారు? కనీసం పాఠ్యపుస్తకాలను మార్చలేకపోయారు. సంగీత సాహిత్య అకాడమీలను ఎర్రకళ్లద్దాల నుండి విముక్తం చేయలేకపోయారు. బిజెపి తనకు లభించిన సువర్ణావకాశాన్ని ఉపయోగించుకొనలేకపోతున్నది. 2 సీట్లలో ఉన్న బిజెపి ప్రస్థానం అద్వానీ రథయాత్రతో 200కు పెరిగింది. ఇప్పుడు మరో ఏడాది ఇలాగే కాలక్షేపం చేస్తే మళ్లీ 2 సీట్లకు పరిమితమవుతుంది. నరేంద్ర మోదీ విశ్వరూపం చూపించవలసిన సమయం సమాసన్నమయింది. ఇక సమయం లేదు మిత్రమా? శరణమా? రణమా?
కశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దుచేయండి. కేరళలో ఆర్టికల్ 356 ప్రయోగించండి విదేశాలల్లో ఉన్న మన సంపదను వెనుకకు తెప్పించండి యుపిలో సిమి, తెలంగాణలో మజ్లీస్, కేరళలో ఐసిస్, కశ్మీర్‌లో హురియత్‌లపై నిషేధం విధించండి. నౌ ఆర్ నెవర్!

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్