సబ్ ఫీచర్

విశ్వ సుందరి విశేషాలివి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు దశాబ్దాల తరువాత దక్షిణాఫ్రికాకు చెందిన డెమి-లేహ్ నెల్ పీటర్స్ విశ్వ సుందరిగా ఎన్నికయ్యారు. 21 సంవత్సరాల ఫైనలియర్ బి.కామ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థిని అయన పీటర్స్ ఈ ఏడాది ఆరంభంలోనే మిస్స్ దక్షిణాఫ్రికగా ఎన్నికైంది. నలుగురు సవతి తండ్రులు ఉండటం గర్వంగా భావిస్తున్నాని నిర్భయంగా ప్రకటించిన ఈ విశ్వ సుందరి గురించి మరికొన్ని విశేషాలు..
నెల్ పీటర్స్ 28, జూన్ 1995లో వెస్ట్రన్‌కేప్‌లో జన్మించారు. తల్లిదండ్రలు బెన్నీ పీటర్స్, అనె్న మేరి స్టీన్‌కాంప్. ఆమె సోదరి ఫ్రానే్జ శారీరక మానసిక వికలాంగురాలు. తనకు తన సోదరే నిరంతరం స్ఫూర్తినిస్తుందని నెల్ పీటర్స్ చెబుతుంది.
స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఆమెలో నాయకత్వ లక్షణాలు ఉండేవి. ఆ స్కూల్లోనూ, హాస్టల్‌లోనూ విద్యార్థినులకు నాయకురాలు అయింది.
నెల్ పీటర్స్ చేతి కార్డులు తయారుచేయటంలో నేర్పరి. స్క్రాప్ బుకింగ్ అంటే కూడా మక్కువ.
నడక, రోడ్ రెస్‌లు అంటే ఇష్టపడుతోంది.
జార్జి సిటీకి డిప్యూటీ జూనియర్ మేయర్‌గా 11వ తరగతి చదివేటపుడే ఎంపికైంది.
ఏమీ చేయకుండా కూర్చుంటే అద్భుతాలు సృష్టించలేవని, ఇతరులతో ఏలా నడుచుకుంటే వారు కూడా అలాగే నీతో ఉంటారని తన తండ్రులు ఎపుడూ చెబుతుంటారని పీటర్స్ చెబుతుంది.
మహిళలు ఒంటరిగానే వెళితేనే ఇంతకు ముందు చూడని ఎన్నో ప్రదేశాలను చూడవచ్చు. కొత్త అనుభవాలు సంపాదించే అవకాశం ఉంది.
మహిళలు నిర్భయంగా ఉంటేనే జీవితంలో రాణిస్తారని అభిప్రాయపడుతోంది. అందంగా, స్వతంత్రంగా, ఏదైనా నేర్చుకోవాలనే శ్రద్ధాసక్తితో ముందుకు వెళ్లాలని ఆమె అభిప్రాయం.
డెమీ పీటర్స్ మీద విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ఆమె ఓ చారిటీ సంస్థకు సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పిల్లల వద్దకు వెళ్లింది. అనాథ పిల్లలకు తినిపించే సమయంలో ఆమె చేతులకు గ్లౌస్ ధరించటం విమర్శలకు తావిచ్చింది. నల్లటి పిల్లలు కాబట్టి పీటర్స్ గ్లౌస్ ధరించిందని సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా పోస్ట్ చేశారు. దీనిపై పీటర్స్ వివరణ ఇస్తూ.. నాతో పాటు మిగిలిన వలంటీర్లు కూడా చేతులకు గ్లౌస్ ధరించారు. అలా ధరించి వారికి తినిపించటమే మంచిది అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకానీ రంగు గురించి ఎలాంటి వివక్షత తాను ప్రదర్శించలేదని పోస్ట్ చేసింది.
మిస్ దక్షిణాఫ్రికాగా ఎన్నికైనపుడు..‘‘ రాబోయే కాలంలో దక్షిణాప్రికా ప్రజలకు సేవ చేయటానికి అంకితమవుతున్నాను. మా అందమైన దేశానికి ప్రాతినిథ్యం వహించటం గర్వంగా భావిస్తున్నానని’’ వెల్లడించింది. ఆమె అనుకున్నట్లే ఆ దేశ ప్రజలు సహకారంతో ఆరు నెలల్లోనే విశ్వ సుందరిగా ఎన్నికైంది.