సబ్ ఫీచర్

‘రమణీ’యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళలు మన సంస్కృతిలో భాగం. మనుకున్న అరవై నాలుగు కళల్లో చిత్ర కళ ఒకటి. కాసుల కోసం కుంచెను చేతబట్టేవారు ఎందరో ఉన్నారు. కాని ఈ చిత్ర కళతో సామాజిక చైతన్యానికి ముఖ్యంగా మహిళల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు మైలవరపు రమణి. సామాజిక అంశాలే ఆమె చిత్రాలలో ప్రతిబింబిస్తాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఆమె కుంచెలో నాట్యం చేస్తుంటాయి. ఆమె మదిలో మెదిలే ఎన్నో ఆలోచనలను కాన్వాసుపై గీసే చిత్రాలు వారెవ్వా అనిపించుకుంటూ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. నిత్య జీవితం నుంచి ప్రేరణ పొందిన వాటితోనే అందమైన చిత్రాలు గీచేందుకు నడుం బిగించారు మైలవరపు రమణి. హైదరాబాద్‌కు చెందిన ఈ కళాకారిణి చేతిలో అందమైన జీవిత చిత్రాలలో
సామాజిక లోపాలు, లొసుగులు మిళితమై ఉంటాయి.
సామాజిక అంశాలనే ఎలుగెత్తి చాటే ఈ చిత్రాలను పిచ్చిగీతలు కింద జమకట్టకుండా తల్లిదండ్రులు, భర్త సైతం ఆమెకు వెన్నుదన్నుగా నిలబడటంతో ఆర్ట్స్ రంగంలో తనదైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతోంది రమణి. ఫ్యాషన్ డిజైనర్ అయిన రమణి ఫైన్ ఆర్ట్స్‌లో పోస్టుగ్రాడ్యూయేషన్ చేశారు. ఇటీవలనే ఆమె చేతిలో మెరుగులు దిద్దుకున్న మూడు చిత్రాలు నెహ్రు ఆర్ట్ గ్యాలరీలో సందడి చేస్తున్నాయి. రంగుల ఎంపికలోనూ వైవిధ్యం, సృజనాత్మకత ఆమె చిత్రాలకు అద్దంపట్టేలా ఉంటాయి. పారదర్శకత కొట్టచ్చినట్లు కనబడుతోంది. ప్రకృతిలో భాగం స్ర్తి. అందుకే స్ర్తీని వనదేవతతోనూ పోల్చుతుంటారు. ప్రకృతికి, స్ర్తికి మధ్య ఉండే అవినావభావ సంబంధాన్ని తన చిత్రాలలో ఆమె చక్కగా చూపిస్తారు.
వైవిధ్యమైన జీవన చిత్రాలు
ఆమె చిత్రాలలో రైతుల ఆత్మహత్యలు, అత్యాచారాలు, చర్మ రంగుతో అందచందాలను పరిగణించే అంశాలు సైతం ఎక్కువగా ఉంటాయి. ఓ మహిళ విజయం వైపు పయనించే సందర్భంలో ఆమె ఎదుర్కొనే కష్టాలు, ప్రాధాన్యతలను కూడా రమణి తన చిత్రాలలో చూపిస్తారు.
వేధింపులు, ఆర్థిక దోపిడి తదితర అంశాలను ‘బ్యాండేజీలతో చుట్టిన మహిళ’ చిత్రం ద్వారా చూపించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై రమణీ కుంచె కదులుతుంది. వాస్తవానికి మహిళలు ఆంతరంగికం శక్తివంతమైందంటారు. ఆ శక్తిని తట్టిలేపేందుకు తన చిత్రాలు దోహదం చేసేలా రమణి నిత్యం కృషిచేస్తుంటారు.

‘నా చిత్రాలు మహిళలను శక్తిమంతులను చేసేందుకు దోహదం చేస్తాయి. వారిలో ఉన్న అభద్రత భావాలను తొలగించేందుకు, అంతర్గతంగా శక్తిని ప్రకాశింపజేసేందుకు తోడ్పడతాయి.’
-మైలవరపు రమణి