సబ్ ఫీచర్

అవగాహనే అసలు మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అతివేగంగా విస్తరిస్తూ కబళిస్తున్న వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి. వ్యాధి ఎలా విస్తరిస్తున్నదో, దానిని నిరోధించడం ఎలాగో, ప్రజల్లో చైతన్యం ఎంత అవసరమో ఈ ఏడాది జులైలో పారిస్‌లో విడుదలైన యుఎన్‌ఎయిడ్స్ - ఎండింగ్ ఎయిడ్స్ నివేదిక పరిశీలిస్తే అర్థమవుతుంది. ప్రపంచ జనాభాలో 2016 నాటికి 3.6 కోట్ల మంది హెచ్‌ఐవితో జీవిస్తున్నారు. వీరిలో పదిలక్షలమందికి ఆ వ్యాధిపై అవగాహన లేక చికిత్సపై శ్రద్ధచూపకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆధునిక వైద్యం అందుబాలోకి వచ్చి, యాంటీ రిట్రెవైరల్ థెరపీ సహకారంతో 1.95 కోట్ల మంధి హెచ్‌ఐవి బాధితులు వ్యాధిని అదుపులో ఉంచుకోగలిగారని అంచనా. అదే ఏడాది ప్రపంచంలో కొత్తగా 18 లక్షల హెచ్‌ఐవి కేసులు వెలుగులోకి వచ్చాయి. రక్షణలేని శృంగారం, మత్తుమందుల వాడకం, స్వలింగ సంపర్కం కారణంగా ఎయిడ్స్ విస్తరిస్తోంది. మనదేశంలో ఎయిడ్స్ తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే విస్తృత చైతన్య కార్యక్రమాలు చేపట్టిన ఫలితంగా గడచిన పదేళ్లలో కొత్త కేసుల సంఖ్య సగానికి తగ్గాయి. 2030 సంవత్సరం నాటికి ఎయిడ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలన్నది లక్ష్యం. 2016 నాటికి 21 లక్షల మంది హెచ్‌ఐవి సోకినవారు మన దేశంలో ఉన్నారు. 2005లో 1.5 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన ఏడాది కొత్త కేసుల సంఖ్య దాదాపు 80 వేలు. ఏటా 20 శాతం చొప్పున కేసులు తగ్గుతున్నాయి. ఇది శుభసూచకం. అయితే జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం కింద ఉచిత వైద్యాన్ని అందిస్తున్నప్పటికీ బాధితులు ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు. టెస్ట్ అండ్ ట్రీట్ విధానం ద్వారా ఇతర వ్యాధులు కమ్ముకోకుండా చికిత్స అందించే అవకాశం ఉన్నప్పటికీ అవగాహన లేక ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు. ఉన్నంత ఉపయోగించుకుంటున్నవారు మాత్రం లాభపడుతున్నారు. అందువల్లే పిల్లల్లో ఎయిడ్స్ సంబంధిత వ్యాధులు సగానికి సగం తగ్గాయి. 2005-16 మధ్య ఇలాంటి కారణాలవల్ల సంభవించే మరణాలు 48 శాతం తగ్గాయి. సమాజంలో వివక్ష నుండి ఎయిడ్స్ బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. దక్షిణాసియాలో ఇలాంటి చట్టం చేసిన దేశాల్లో భారత్ మొదటిది. ఐరాస పిలుపునిచ్చినట్లుగా మన ఆరోగ్యం మన హక్కు అన్నది ఇలాంటి చట్టాల ద్వారా సాధ్యం. 2015 గణాంకాల ప్రకారం భారత్‌లో హెచ్‌ఐవి బాధితుల్లో 15-49 ఏళ్ల మధ్యవారిలో 0.26, మగవారిలో 0.30, మహిళల్లో 0,22 శాతం ఉన్నారు. రాష్ట్రాల వారీగా ఊస్తే మణిపూర్‌లో 1.15 శాతం, తెలుగురాష్ట్రాల్లో 0.66 శాతం ఉన్నారు. హెచ్‌ఐవి సోకిన వారి సంఖ్య తెలుగురాష్ట్రాల్లో 3.95 లక్షలమంది ఉన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. హెచ్‌ఐవి బాధితుల పట్ల బాధ్యతగా వ్యవహరించడం, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాలల్లో ప్రజలు భాగస్వాములవడం, ఎయిడ్స్ బారిన పడకుండా ఉండే మార్గాలను, ఆధునిక చికిత్స సౌకర్యాలను, చట్టాలను విస్తృతంగా ప్రచారం చేయడం వంటి చర్యలు తీసుకుంటేనే లక్ష్యం నెరవేరుతుంది.

-డాక్టర్ పోటు భగత్