సబ్ ఫీచర్

యూపీ ఫలితాలు దేనికి సంకేతం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న ఒకాయన చమత్కారంగా ఇలా అన్నాడు. ‘‘మన ఎన్నికలు అభివృద్ధి మంత్రంతో మొదలై అయోధ్యతో ముగుస్తాయి’’...అంటే ఏమిటి? డెవలప్‌మెంట్ అనే మాటతో ప్రచారం మొదలుపెట్టి కులం-మతం వంటి అంశాలను తెరపైకి తెస్తారని తాత్పర్యం. రాహుల్‌గాంధీ హిందువుకాదు - అని వాదించేసరికి ‘‘అమిత్ షా హిందువు కాదు - అంటూ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఇంతకూ ఈ దేశంలో ఎవడు హిందువో ఎవడు కాదో తేల్చుకోవలసిన సమయం వచ్చింది. ‘‘గంగ - గోవు - గాయత్రి - మీద గౌవరం లేనివాడు హిందువు కాదు’’ అన్నాడు అశోక్ సింఘాల్ (విశ్వహిందూ పరిషత్ నాయకుడు). మొన్న ఉత్తర ప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. 22 కోట్లమంది ప్రజలు గల రాష్టమ్రిది. ఇక్కడ కులం మతం ప్రాంతం భాష - వంటివన్నీ ఎన్నికలలో ప్రభావితం చూపుతూంటాయి. డిసెంబర్ 1వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. 347 స్థానాలు బిజెపి గెలుచుకొని ప్రథమ స్థానంలో ఉంది. 116 స్థానాలు గెలిచి మాయావతి పార్టీ బిఎస్‌పి ద్వితీయ స్థానంలో ఉంది. 81 స్థానాలు గెలిచి ములాయంసింగ్ యాదవ్ గారి సమాజవాది పార్టీ తృతీయ స్థానంలో ఉండగా కేవలం 19 చోట్ల గెలిచి రాహుల్ గాంధీగారి కాంగ్రెస్ పార్టీ నాల్గవ స్థానంలో ఉంది. బిజెపికి మొత్తం పోలైన ఓట్లలో 53 శాతం రాగా కాంగ్రెసుకు 3 శాతంకన్నా తక్కువ వచ్చాయి. 14 మేయర్ స్థానాలు బిజెపి గెలువగా 2 స్థానాలు ఇతరులు గెలిచారు. కానీ కాంగ్రెసు గెలువలేదు. దీని ప్రభావం భారత రాజకీయాలమీద ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అన్నింకన్నా పెద్దవార్త.. రాహుల్ గాంధీ ప్రాతనిధ్యం వహిస్తున్న అమేధీ నియోజకవర్గంలోని ఓటర్లు కాంగ్రెసును తిరస్కరించారు. అక్కడ బిజెపి గెలిచింది. దీనికి కాంగ్రెసు అధికార ప్రతినిధి చెప్పిన సమాధానం ఇలా ఉంది..‘‘ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమే. ఆ మధ్య బిజెపి చిత్రకూట్ అసెంబ్లీ స్థానం గురుదాస్‌పూర్ పార్లమెంటు స్థానం కోల్పోలేదా ఏమిటి?’’ - నిజమేకదా మరి??
ఇంట్లో కూర్చొని పత్రికలలో పతాక శీర్షికలు చదివినంత మాత్రాన దేశంలో ‘గ్రౌండ్ లెవెల్’లో ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడం కష్టం. ఉత్తరప్రదేశ్‌లో 2014-2017 సాధారణ ఎన్నికలలోను, ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలలోను బిజెపి ఎందుకు ఘనవిజయం సాధించింది? కాంగ్రెసు పార్టీ ఎందుకు అడ్రసు లేకుండా పోయింది??
మొదటి నుండి కాంగ్రెసు అంటే ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణులు గోవింద్ వల్లభపంత్, ఎన్‌డి తివారి, కమలాపతి త్రిపాఠి హేమావతి నందన్ బహుగుణ వంటి వారి నాయకత్వానికి తిరుగులేని రోజులవి. పండిత జవహర్ లాల్ అనే పేరులో ‘‘పండిట్’’ అంటే ఈయన కశ్మీరీ బ్రాహ్మణుడు అని యుపి ప్రజలు భావించారు. 1962లో జరిగిన ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. నెహ్రూగారు దేశమంతటా తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయన ఫూల్‌పూర్ అనే నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ‘అయ్యా మీ నియోజకవర్గం ఫూల్‌పూర్’ అని కార్యకర్తలు గుర్తు చేశారు. ‘అలాగా’ అని ఆయన చిరునవ్వు నవ్వారు. ఫూల్‌పూర్‌కు వెళ్లకుండానే నెహ్రూజీ అఖండ విజయం సాధించారు. నెహ్రూ నాయకత్వం మీద అప్పుడు భారతదేశంలో అంతటి విశ్వాసం ఉండేది.
యు.పి.లో నాడు నేడు కూడా కమ్యూనిస్టులు లేరు. కానీ సోషలిస్టు పార్టీ ఉండేది. దానికి రామమనోహర్ లోహియా అనే నాయకుడు ఉండేవాడు. ఇతడు గొప్ప దేశభక్తుడు. భారతీయ నాగరికతను సంస్కృతిని ఆయన ఎంతగానో ప్రేమించేవాడు. ఇండియా అంటే ఏమిటి? రాముడు- కృష్ణుడు- శివుడు- అని ఒకే ఒక్క వాక్యంలో లోహియా నిర్వచించడం నాకు బాగా జ్ఞాపకం ఉంది. విచిత్రమేమంటే ఇండియాకు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలన్నీ ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. చార్‌థామ్, గంగానది, ప్రయాగ, కాశి, మధుర, అయోధ్య ఇలా భారతీయాత్మ యుపిలో ఉంది. ‘‘అస్తి ఉత్తరస్యాత్ దిశి దేవతాత్మా’’ అని కాళిదాసు హిమాలయాలను వర్ణించాడు. మూలమూలల్లో నరుడు నారాయణుడు అవతరించిన బదరీ నారాయణం క్షేత్రమూ పార్వతీదేవి తపస్సు చేసుకున్న చోటు పరమశివుని కైలాసమూ ఇలా భారత పూరణేతిహాసాలతో ముడివడి ఉన్న ప్రదేశాలన్నీ ఉత్తర ప్రదేశ్‌లోనే ఉన్నాయి. అంతేకాదు బౌద్ధులకు ముఖ్యమైన సారనాథ్ వంటివి కూడా యూపీలోనే ఉన్నాయి.
నెహ్రూ యుగం ముగిసిన తర్వాత ఇందిరాగాంధీ భారతదేశాన్ని నిరంకుశంగా పరిపాలించింది. ఈమె ఎవరిమాట వినేది కాదు. ఈమెకు బారువా అనే సలహాదారు ఉండేవాడు. ‘ఇండియా ఇందిర పర్యాయపదాలు’ అన్నాడు. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వర్ణాలతోబాటు నాడు ముస్లిములు యాదవులు ఆమె వెన్నంటి ఉన్నారు. 1975లో దేశం మీద అవసరం లేకపోయినా ఎమర్జెన్సీ విధించారు. అప్పటి నుంచి కాంగ్రెసు పతనం మొదలయింది. 1977 మార్చిలో జరిగిన ఎన్నికలలో యుపిలో కాంగ్రెస్ ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
ఆ తరువాత భారతీయ జనసంఘ్ బలపడింది. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వర్గాలు కాంగ్రెసుకు దూరమైనారు. 1990లో లోహియా శిష్యుణ్ణి అని చెప్పుకునే ములాయంసింగ్ యాదవ్ స్థాపించిన సోషలిస్టు పార్టీ (దీనిని యూపీలో సమాజవాద పార్టీ అంటారు) బలపడింది. రాజకీయ లబ్ధికోసం యాదవులు ముస్లిములు ఏకమైనారు. ఆ తరువాత బహుజన సమాజవాద పార్టీ రంగంలోకి దిగి దళితులకు ఆదివాసీలను కాంగ్రెసుకు దూరం చేసింది. క్రైస్తవులు కాన్షీరామ్‌ను బలపరిచారు. ఆయన తన ఎన్నికల ప్రచారం చర్చీల నుండి ప్రారంభించేవాడు. ఈ విధంగా సోనియా-రాహుల్ యుగం వచ్చేసరికి ప్రధాన సామాజిక వర్గాలన్నీ కాంగ్రెసుకు దూరమైనాయి.
ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం గమనించాలి. అలహాబాదులో బ్రాహ్మణ పూజారులను పండాలు అంటారు. వీరిలో గూండాలు కూడా ఉన్నారని నేను ప్రత్యక్షంగా చూచాను. యుపి బ్రాహ్మణులలో నేడు దర్భలకు బదులు తుపాకులున్నాయి. ఇలా ఎందుకు జరిగింది? అని ప్రశ్నించాను. ‘మాయావతి-ములాయంసింగ్-అజంఖాన్‌ల నుండి మాకు ప్రాణభయం ఉంది. అందుకని మేము శస్తధ్రారులమైనాము’ అని వారు సమాధానం చెప్పారు.
సోనియాగాంధీ రాజకీయ రంగ ప్రవేశం యాదృచ్ఛికం. చాలాకాలం ఆమె భారతీయ పౌరసత్వం తీసుకోవడానికే నిరాకరించింది. ఐతే వందిమాగధ బృందం బలవంతంగా ఆమెను రాజకీయాల్లోకి లాక్కొని వచ్చారు. ఇది ఉభయతారకంగా మారింది. ఆమెను అడ్డంపెట్టుకొని సల్మాన్ ఖుర్షీద్‌లు, అమితాబ్ బచ్చన్‌లు భారతదేశం సంపదను స్విస్‌బ్యాంకులకు తరలించారు. ‘‘ఇదేమి దుర్మార్గం’’ అని ప్రశ్నించినవాడిని మతతత్వవాదులు అని ముద్రవేశారు. నాడు శ్యాంప్రసాద్ ముఖర్జీని షేక్ అబ్దుల్లా హత్య చేయిస్తే పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయను 1968లో మొగల్‌సరాయిలో చంపివేశారు. 1975లో ఇందిరాగాంధీ, 1993లో రాజీవ్-సోనియా హిందూ జాతీయ సంస్థలపై నిషేధం విధించారు. దీనికి దేశంలోని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతునిచ్చాయి. రాజీవ్‌గాంధీ మరణం సోనియాగాంధీ అనారోగ్యం కాంగ్రెసు పార్టీని కలవరపెట్టింది. ఈ దశలో అనువంశిక రాజకీయాలకు అలవాటుపడ్డ కాంగ్రెసు పార్టీ ప్రియాంకగాంధీని రంగం మీదికి తీసుకురావాలని ప్రయత్నించింది. ఈమె ఒకవైపు నుండి చూస్తే సాక్షాత్తు ఇందిరాగాంధీలాగే ఉంటుంది అని అప్పుడే వందిమాగధ ప్రచారం మొదలుపెట్టారు. తర్వాత ఆమె భర్త వాద్రా అనేక అవినీతి ఆరోపణల్లో ఇరుక్కోవడం, కోర్టుల చుట్టూ తిరగడం పార్టీలో కొన్ని వర్గాల వ్యతిరేకత కారణంగా మళ్లీ రాహుల్‌బాబు తెరపైకి వచ్చాడు.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఆలిగఢ్ మేయర్ పదవిని మాయావతిగారి పార్టీ ముస్లిముల సహాయంతో గెలుచుకున్నది. గోరఖ్‌పూర్ లక్నో వంటి ప్రతిష్టాత్మకమైన మేయర్ స్థానాలన్నింటిని బిజెపికి గెలుచుకున్నది. ‘ఇది హిందుత్వ ప్రభంజనం’ అని విశే్లషకులు వ్యాఖ్యానిస్తుంటే ‘మేము ఇంటింటికి కరెంట్ వాటర్ డ్రైనేజీ సౌకర్యం కల్పించాము ఇదే మా విజయ రహస్యం’ అని బిజెపివారు చెబుతున్నారు. అంటే ఏమిటి? గత డెబ్బయి సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రాథమిక సౌకర్యాలు ప్రజలకు లేవు-అని అర్థం కావడం లేదా??
రాహుల్‌బాబు తెలివైనవాడా? కాదా? అనే చర్చ అలా ఉంచితే దేశవ్యాప్తంగా కాంగ్రెసు అనే పేరుగల ఒక జాతీయ పార్టీ అంతరించిందని గ్రహించాలి. పంజాబులో అమరేందర్ సింగ్ కెప్టెన్. ఆయన గెలిచాడు..అని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అకాలీ బిజెపిలు ఓడాయి అని చెప్పడం సరియైన విశే్లషణ కాగలుగుతుంది. అలాగే చిత్రకూట్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెసు సానుభూతి పవనాలతో గెలిచింది. ఎందుకంటే అక్కడ స్థానిక కాంగ్రెసు అభ్యర్థి మరణించడం వల్ల గత నెల ఉపఎన్నిక జరిగింది. ఇప్పుడు కాంగ్రెసు వెంట హ్రాబ్మణులు వైశ్యులు ఠాకూర్లు దళితులు ముస్లిములు లేరు. కొద్దిమంది క్రైస్తవులు మాత్రం ఉన్నారు. మతమార్పిడుల కోసం చర్చిలకు అందే నిధులను కేంద్రం ఆపివేసింది. ఇప్పుడేం జరుగుతుంది? కాంగ్రెసు అనే జాతీయ పార్టీ అంతరించడం ద్వారా ఏర్పడిన శూన్యాన్ని స్థానిక - ప్రాంతీయ పార్టీలు పూరిస్తున్నాయి. నిజానికి ఇది భారత రాజకీయాలకు శుభసూచన కాదు. కానీ చేయగలిగింది ఏమీ లేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాహుల్‌బాబు నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తుందని పార్టీకి పూర్వవైభవం తెస్తుందని మణిశంకర్ అయ్యర్, ఇందిరాతివారి, ఘనశ్యాం వంటివారు పగటికలలు కంటున్నారు. భారతదేశ చరిత్రలో రాజకీయంగా సోనియా-రాహుల్ యుగం ముగిసింది. భారతీయ సాంస్కృతిక జాతీయవాదం పునరుజ్జీవనం చెందింది. నరేంద్రమోదీ వెనుక వివేకానందుడు దయానందుడు అరబిందో ఉన్నారు. రాహుల్‌బాబు వెనుక ఎవరున్నారు?? అహ్మదాబాదులోని ఆర్చిబిషప్ ఉన్నాడు. రాహుల్‌బాబు రోమన్ కాథలిక్ మతస్థుడు. ఐతే కేవలం ఈ మతవర్గం ఓట్లతోనే అతడు భారత ప్రధాని ఎలా కాగలడు? కేంద్రంలో బిజెపికి అజేయమైన నాయకత్వం ఉంది. కానీ కాంగ్రెసుకు అలాంటి పరిస్థితి లేదు. త్యాగధనుడైన వల్లభ్‌భాయ్ పటేల్ ఎక్కడ? పాకిస్తాన్ వైపు చూస్తున్న అహమ్మద్ పటేల్ ఎక్కడ? తిరుపతి తెలుగుదేశం ఎంపిని, న్యూఢిల్లీ వీధులలో చంపుతాను-అని బెదరించింది మరెవరో కాదు.. షీలాదీక్షిత్ సుపుత్రుడు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సందీప్ దీక్షిత్. వీరే రాహుల్‌గారి యంగ్ టీమ్!

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్