సబ్ ఫీచర్

మహిళా సాధికారత అంటే?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదశ్రీ ఉదయం నుండీ ఒకటే బాధపడుతోంది. తనకు భర్త విలువివ్వడు. పదిమందిలో టిఫిన్ బాగాలేదని అవమానిస్తాడు బాగున్న రోజున బాగుందని చెప్పడు. ప్రతి ఒక్కళ్లనీ విశ్రాంతి తీసుకోమని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇక తన కష్టం సుఖం ఆలోచించడు. ఒకోసారి అనిపిస్తోంది ఎందుకీ జీవితం అని. ఒక్కోసారి విసుగొచ్చి విడిపోవాలని కూడా అనిపిస్తుంది. ఆ పక్కింటి పంకజాక్షిలా ఉద్యోగం ఉంటే హాయిగా ఈ కాపురానికి గుడ్‌బై కొట్టేసి వెళ్లిపోవచ్చు.
***
ఇవాంకా ఉద్యోగం చేస్తుంది. సమర్థవంతంగా ఇల్లూ వాకిలీ చూసుకుంటుంది. కాని తన విషయంలో భర్త ఏ రోజూ అలసటగా ఉన్నావే, కాఫీ పెట్టి ఇవ్వనా? అని అడిగిన పాపాన పోలేదు. అడిగితే ఇచ్చేవాడేమో అని కూడా తనకు అనిపించదు. ఎందుకంటే వాళ్లింట్లో అందరూ మగాళ్లు పనిచేయకూడదు అని అనుకుంటారు. ఏదైనా చేస్తే పాపమేమో అన్నట్లు భావిస్తారు. ఆదివారం చర్చికి వెళ్లి వచ్చాక కూడా అన్ని రకాలు వండి వార్చాలి. జీవితం విసుగనిపిస్తోంది.
***
ప్రార్థనది మరో సమస్య. కష్టపడి ఇల్లు దిద్దుకుంటూ టైలరింగ్ సెంటర్ నడుపుతోంది. ఇంటికొచ్చాక కాళ్లు నొప్పులు వచ్చి అడిగినా కూడా పిల్లలు కనీసం కొబ్బరినూనె రాయమన్నా రాయరు. ఎవరికోసం ఇంత కష్టపడుతున్నాననుకుంటుంది. భర్తకు కూడా ఫిర్యాదు చేస్తే పట్టించుకోడు. ఏం చేయాలో తోచదు.
***
అనుగీతది మరో సమస్య- అత్తగారు టీవీ సీరియల్స్ పెట్టుకుని కూర్చుంటారు. రిమోట్ అస్సలు వదలరు. పిల్లలుగాని తనుగాని చూడటానికి ఉండదు. భర్తకు చెబితే మా అమ్మకు ఉన్న ఏకైక ఆనందం అదేకదా! భర్తతో ఎన్నో బాధలు పడింది, నీవే సర్దుకుపో అంటాడు. పిల్లల చదువు పాడయిందని చెప్పినా పట్టించుకోడు. ఒక్కోసారి కాపురం చేయలేనేమో అనిపిస్తుంది. ఇలా రకరకాల సమస్యలు.

ప్రతిక్షణం కష్టపడుతున్న మహిళకు ఏ కాలంలోనైనా నీవు బాగా చేస్తున్నావు, కష్టపడుతున్నావు, నీకేమైనా సహయం కావాలా? అని అడిగితే పరవశించిపోతుంది. నిజానికి ఎప్పుడైనా భర్తతో పనులు చేయించుకోవాలని ఏ మహిళ కోరుకోదు! నేటి యాంత్రిక యుగంలో భార్యాభర్త సంపాదిస్తేగాని గడవని రోజులు. ఆమె శ్రమను పంచుకుంటే చిన్నతనంగా భావించనసరం లేదు. ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు తమ భార్యలకు సాయం చేసి వారిని కాపాడుకుంటున్నారు. రేపు ఆమె అనారోగ్యం పాలైతే నష్టపోయేది కుటుంబమే.
ఇక కొంతమంది మహిళలు భ్రమలలో ఉంటారు. తాము చెప్పిందే వేదం అనుకుంటారు. అణచివేత ఎదుర్కొంటున్నామని, పురుషస్వామ్యంతో హింస జరుగుతుందని భావిస్తారు. నీకీ చీర కన్నా ఆ చీర బాగుంటుంది అన్నందుకు నిశ్చితార్థమైన జంటే, రేపు పైళ్ళనాక ఎంత సాధిస్తాడో అని ఇటీవల విడిపోవడం చూస్తున్నాం. చెబితే తప్పులేదు. అపుడపుడూ ఒకరి ఇష్టలు ఒకరు గౌరవించుకోవాలి. అంతమాత్రంచేత మేం ఆకాశంలో సగం, మేం సంపాదిస్తున్నాం, మీరెంత? అని చిన్న చిన్న కారణాలకు విడిపోవడం దాకా తెచ్చుకుని గోటితో పోయేదాన్ని గోడ్డలిదాకా తెచ్చుకోకూడదు. స్ర్తి పురుషులు ఇరువురూ సమానమే. బండికి రెండు చక్రాల వంటివారు. ఈ రోజుల్లో పెయిన్ భరించలేము, విడిపోవడమే నయం అంటున్నారు. పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకోవడంలేదు.
స్వయం నిర్ణయాధికారం కలిగి వుండటం..
అణచివేతను ఎదుర్కోవడం, స్వయం నిర్ణయాధికారం కలిగి వుండడం, అది ఎప్పుడు? మన అవకాశాలను పాడు చేసి ఏ విధంగానూ ఎదగనివ్వకుండా ప్రతిక్షణం హింసిస్తూ ఉంటే తప్పులేదు. ఈ రోజుల్లో భిన్న భిన్న భావాలు కలిగిన వారు, రాజకీయాలలో ఉన్నవారు భార్యాభర్తలుగా హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఫస్ట్ షో అభిమాన నటుడు సనిమాకు టికెట్లు తెచ్చి సినిమా చూపించలేదనో లేకపోతే అత్తగారిని చూడకూడదనో, ఆడపడుచుకు చీర పెట్టకూడదనో అసూయతో మహిళలు భర్తను వేధించడకూడదు. బాగా విద్యావంతులైన మహిళలు కూడా తమ అత్తగార్లపై నేరాలు చెబుతూ వాళ్ళ అమ్మగారికి చీరలు కొని ఎంతో బాగా చూసుకున్న వారిని ఎరుగుదుం.
తప్పంతా స్ర్తిలదేనా?
ఎప్పటికీ కాదు. పురుషులు అర్థం చేసుకోవాలి. పరాయి ఇంటినుండి వచ్చి తమ సర్వస్వంగా భావించిన భర్తని ప్రాణపదంగా చూసుకుంటుంది మహిళ. వారికోసం ఆమె ఎంతో మారుతుంది. గారాబంగా పెరిగినా వినయ విధేయతలతో అందరికీ అనుగుణంగా నడచుకొని వేడి చల్లారకుండా దోసెలు తెచ్చి వేస్తుంది. అలాంటి ఆమె అభిప్రాయాలకు విలువనివ్వాలి. అమ్మ మనసు కష్టపెట్టకుండా భర్తని రాత్రి సమయంలో అనునయించాలి. కొండంత ప్రేమను కురిపించాలి. నీవు తప్ప నాకు వేరే ప్రపంచం లేదనే భావన కలుగజేయాలి. పిల్లలకు బట్టలు వేయడం, టిఫిన్ తినిపించడం వంటివి చేసి సహకరించాలి. అపుడపుడూ ఆమెకు ఓ కాఫీ చేసిచ్చినా ఆమె మురిసిపోతుంది. ఆమెకు మంచి మంచి వార పత్రికలు తెచ్చి చదివించాలి. ఆమె అందచందాలను గుర్తించాలి. శ్రమను గౌరవించాలి. అపుడు ఇల్లు నందనవనం అవుతుంది. ఆకాశంలో సగం ఆమె అయితే మీరు సగం అవుతారు. పిల్లలకు ఆనందోత్సాహాలతో వ్యక్తిత్వ వికాసం లభిస్తుంది. పిల్లల ముందు కీచులాడుకోకుండా ఓ మంచి జంటలా ఉంటే మీ పిల్లలు ఆకాశంలో నక్షత్రాలై మెరుస్తారు!

-బి.హెచ్.వి.రమాదేవి