సబ్ ఫీచర్

గురువు చెక్కే శిల్పం విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంతులు పని డాక్టర్లు లేదా ఇంజనీర్ల మాదిరిగా ఒక వృత్తి కాదు. పంతులు పని తహసీలు ఆఫీసులో అధికార్ల మాదిరిగా అధికార ఉద్యోగం కాదు. ఉపాధ్యాయ వృత్తి శూన్యంలో నుంచి అనంతాన్ని చూడటం. ఇదొక బృహత్తర కార్యక్రమం. ఒక సామాజిక ప్రక్రియ సాధనం. ఒక సమాజాన్ని తరగతి నుంచి అల్లిక చేయటం. అందుకే ఫెరా అనే మహోపాధ్యాయుడు ఇలా అంటాడు. ‘‘ఉపాధ్యాయుడు ఒక సాంస్కృతిక కార్యకర్త’’ అని చెప్పాడు. రాబోయే సమాజానికి ఒక కొత్త సంస్కృతిని అందించాలి. అది రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రక్రియకు చేదోడు కావాలి. ఉపాధ్యాయుడు సృష్టించే సంస్కృతికి లక్ష్యం ఇది అని ఉండదు కానీ సమాజంలోని సర్వరంగాలకు అది ఇంధనం అందిస్తుంది. ఆ నూతన సంస్కృతిని ఉపాధ్యాయుడు ఒంటరిగా సృష్టించలేడు. ఉపాధ్యాయునికి తరగతి గదిలోని పిల్లలు కావొచ్చు. తల్లిదండ్రులు కావొచ్చు. లేదా మొత్తం సమాజం కావొచ్చును. ఇది నా సృష్టి అని చెప్పుకునే వీలుండదు.
‘‘దేరీజ్ నో టీచింగ్ విత్‌అవుట్ లెర్నింగ్’’
‘‘దేరీజ్ నో లెర్నింగ్ విత్‌అవుట్ టీచింగ్’’
విద్యార్థి లేకుండా ఉపాధ్యాయుడికి అస్తిత్వమే ఉండదు. పిల్లలు పంతుళ్లు లేకుండా నేర్చుకోవచ్చును. పిల్లలు లేకుండా ఉపాధ్యాయుడు మనుగడ సాగించలేడు. అదే మాదిరిగా లెర్నింగ్‌కు శాస్ర్తియత రావాలంటే టీచింగ్ కావాలి. పిల్లలు నేర్చుకున్న దానిపైన ఎవరో ఒక ఉపాధ్యాయుని సంతకం మాత్రం ఉండాలి. ఉపాధ్యాయుణ్ణి అందుకే అత్యున్నత స్థానం లో నిలిపింది. ఉపాధ్యాయుడిచ్చే చైతన్యమే ప్రధానం. టీచింగ్ అనేదే చైతన్యం. ఒక కదలిక. అంధకారాన్ని ఛేదించేది ఉపాధ్యాయుని బోధనతో సమస్త సమాజానికి మేలుకొలుపుకావాలి. పిల్లలు ఉపాధ్యాయుల బోధన మధ్యలో ప్రేమ ఉండాలి. కానీ భయం ఉండకూడదు. అధికార ఒత్తిడి ఉండకూడదు. తల్లి చనుబాల ధార మాదిరిగా జ్ఞాన ప్రవాహం ఉండాలి. ఉపాధ్యాయుడు ఎంత ప్రధానమో టీచింగ్ కూడా అంతే ప్రధానం. ఉపాధ్యాయుని స్థానాన్ని అన్ని దేశాల్లో ఒక వృత్తిగా పరిగణించలేరు. ఒక జాబ్‌గా పరిగణించలేరు. ఒక క్రియేటివ్ థింకింగ్‌గా, ఒక కళగా భావించారు.
‘‘టీచర్ ఈజ్ ఎన్ ఆర్టిస్ట్.’’
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడు ఒక కళాకారుడు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర కాంప్లిమెంటరీ పాత్రే కానీ ఒక పుస్తకం నుంచి మరొక పుస్తకానికి ఎత్తిరాయటమో, బదలాయించటమో కాదు. అది మేధో సంఘర్షణ. ఉపాధ్యాయుడు సమాజ అల్లికలో తన పాత్ర ఏమిటిదో గుర్తుంచుకుంటే తన మహోన్నత పాత్ర తనకు తెలుస్తుంది. తన మహోన్నత పాత్రను అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు తగిన న్యాయం తప్పక చేస్తాడు. బోధన ద్వారా అభ్యసనానికి మరింత పదును పెట్టి పిల్లల్లో జ్ఞానతృష్ణ పెరగడానికి దోహదం చేస్తాడు. అటువంటి ఉపాధ్యాయుడి చేతిలో పిల్లలు అద్భుతమైన శిల్పాలుగా రూ పొందుతారు. సమాజ నిర్మాణానికి దోహదకారులవుతారు.

- చుక్కా రామయ్య