సబ్ ఫీచర్

‘నీచే’ముడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవాతుల్లో ‘ఆగేముడ్’ అంటే ముందుకు నడవమని, ‘పీచేముడ్’ అంటే వెనక్కి తిరగమని అర్ధం. ఇప్పుడు రాజకీయ పరిభాషలో ‘నీచేముడ్’ అన్న పదం కొత్తగా వచ్చి చేరింది. గుజరాత్ ఎన్నికల ప్రచారం తీరు చూస్తే రాజకీయ విలువలు ‘నీచేముడ్’ ఒరవడిలోనే సాగుతున్నాయని చెప్పాలి. అంటే రాజకీయ విలువలు పాతాళంలోకి జారిపోతున్నాయన్నమాట. తలపండిపోయిన కాంగ్రెస్ అనుభవజ్ఞుడు మణిశంకర్ అయ్యర్ ప్రధాని మోదీని ఉద్దేశించి ‘నీచ’ పదప్రయోగం చేసి, తద్వారా రాజకీయ ప్రచారం ఎంతటి నీచస్థితికి దిగజారిపోయిందో మనకి అర్ధమైనట్లు చెప్పాడు. రాహుల్‌గాంధీ వెంటనే ఆయనను పార్టీ నుంచి తొలగించడం ద్వారా కాస్తంతైనా గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసినట్టయింది. ఇప్పుడు ప్రధాని ఏకంగా తనపై ‘పాకిస్తాన్, కాంగ్రెస్ కలసి కుట్రలు పనిన్నట్లు’ సెలవిస్తున్నారు. అదే చోద్యంగా ఉంది. ఇది అత్యంత తీవ్రమైన నేరారోపణ. ఒకవేళ అదే నిజమైతే ముందుగానే చర్యలు తీసుకోవాల్సింది. గుజరాత్‌లో ఎన్నికల ప్రచార సభలలో మైకు దొరికేవరకూ ఆగడం ఎందుకు? సార్వభౌమ దేశానికి సమర్థవంతమైన ప్రధానిగా ఉంటూ, ప్రతిపక్షంపైనా, పొరుగుదేశంపైనా బేల ఆరోపణలు ఎందుకు చేయడం? మన దేశాన్ని అస్థిర పరచడానికి పాకిస్తాన్‌తో అందివచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోదు. సరే, ఇరు దేశాల మధ్య సయోధ్య లేనప్పుడు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి స్నేహహస్తం చాచింది నరేంద్రమోదీయే కదా! ఒకవేళ ఎన్నికల్లో లబ్దికోసమే ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటే మాత్రం దేశ రాజకీయాలకు ఇంతకంటే చీకటిరోజు మరొకటి ఉండదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు ‘మెరుపుదాడుల అంశం’ భారతీయ జనతా పార్టీకి ఎంతగానో కలసివచ్చింది. అది వేరు. మోసకారి పొరుగుదేశానికి, సరైన తీరులో బుద్ధి చెప్పిన ధైర్యశాలిగా ప్రధానిని భావించినందుకు ఓటర్లు మద్దతుగా నిలిచారు. ఈసారి పాకిస్తాన్‌పట్ల ఆరోపణలు ఏవిధమైన దైర్యసాహసాలకూ గుర్తుకావు. ఆ మాటలు అభద్రతాభావాన్ని చాటుతాయంతే. ఇందిరాగాంధీ తన రాజకీయ అవసరాలకు, ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేందుకు ‘విదేశీహస్తం’ బూచి చూపేవారు. ఇప్పుడు మోదీజీ ఆ పల్లవి అందుకున్నారు. మోదీజీ తరహాలో రాహుల్‌గాంధీ ‘ఆలయ దర్శనాలు’ చేస్తున్నారు. పార్టీలు అవే. పాత్రలే మార్చుకున్నాయి. అదీ రాజకీయం.

-డా. డి.వి.జి.శంకరరావు