సబ్ ఫీచర్

అందంగా అల్లేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నా జడ చూడు బావా.. వాలు జడ చూడు బావా!’’ అని
ఓ కనె్నపిల్ల పాట విన్నాడు.
‘‘నువ్వు కులుకుతు, గలగల నడుస్తూ ఉంటే,
నీ వాలు జడ అటు ఇటు ఊగుతూ వుంటే,
నిలువదె నా మనసు.. ఓ లలనా! ఓ మగువ!’’ అని పాట విన్నాం, ఓ కథానాయకుడి నోట! ఇలా వేణి అలవేణి కందం! స్ర్తిలకు జుత్తు సిరి! బారు జడ చూసి మోహించి పెళ్లాడినవారున్నారు నేటికి కూడా! ఇలా ‘వేణి లలనలకందం’ అని మన సంస్కృతి, కట్టు, బొట్టుతో వర్ణిస్తారు. బారుజడలున్నవారు తలంటుకుని జుత్తు ఆరబెట్టుకుంటూ బయటకు వస్తే పెద్దలు వారించేవారు. అది దిష్టి తగులుతుందో, లేక ఎవరైనా కనే్నస్తారేమో అనో?! అది ఈనాటి మాట!

వెంట్రుకలు విరబోసుకొని, మాటిమాటికీ పైకి ముఖంమీదనుండి, భుజాలమీద నుండి ఎగదోసుకుంటూ, ఆ మానరిజమ్ చాలామంది.. చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు, సౌకర్యం కొద్దీ, పొట్టిగా కత్తిరించుకున్నా, వేదికలపైన ఉపన్యాసాలిచ్చేటప్పుడో, ఆఫీసుల్లో, ఫంక్షన్ల్‌లో సబబుగా ఉంటుందేమో కానీ.. వంట చేస్తున్నప్పుడు వెంట్రుకలు అన్నింట్లో రాలితే, కనబడీ, కనబడక చూసినవాళ్ళ సంగతి అటుంచి, అవి ఆహార పదార్థాల్లో రాలితే అసహ్యంగా ఉంటుందని, అనారోగ్యానికి హేతువని అతివలు గ్రహించాలి.

ఇపుడు ఉన్న జుత్తును కత్తిరించుకోవడం. దువ్వుకోవడం, జడ అల్లుకోడానికి, తలంటుకు, రంగు వేసుకోవడానికి అవి అడ్డంకులు. సమయాభావం ఒక వైపు, నేటి ఫ్యాషన్ రీత్యా మరోవైపు. ఇపుడు బాబ్డ్, పోనీటేల్, రకరకాలుగా జుత్తు కత్తిరంపులు! వాటికి పార్లర్లు సదుపాయంగా ఉన్నాయి. అది చాలామంది మహిళలకు ఉపాధి కూడా!
‘నరులు, నఖములు, కేశములు స్థానభ్రంశము నొందినచో రాణించవు’ అని చదువుకున్నాం కదా! ముచ్చటగా మీ ఇష్టం అలా వదిలేసుకోండి! వెంట్రుకలు దువ్వుకోవడం నట్టింట్లో కూడదు. రాలినవెంట్రుకలు నేలమీద గాలికి అల్లాల్లాడుతుంటే, మన మనస్సు కూడా అలాగే అల్లాడుతూ శాంతిని కోల్పోతుందని (సెంటిమెంట్ అనుకోండి) మన అమ్మమ్మలు, బామ్మలు హెచ్చరించేవారు. అందుకే కొబ్బరిచిప్పలో నీళ్ళు పోసి ఊడిన జుత్తును అందులో వేసి దూరంగా పారేసేవారు. మనం తినే ఆహారంలోను, నీళ్లల్లో రాలితే ఎంత అనర్థమో, ఎంత ఏవగింపుగా వుంటుందో తెలియనిదికాదు. కాస్త ఆలోచించండి!
ఆ వెంట్రుకలు తలమీద ఉన్నంతవరకే విలువ! ఇప్పట్లో అవి సంపద కూడా! అమ్ముతున్నారు, కొంటున్నారు, విగ్స్, సవరాలు, గడ్డాలు, మీసాలు తయారీకి. వ్యాపారానికి ఉపయుక్తం! జుత్తును అలా వదిలేకొద్దీ వాటి నిగారింపు, కురులకుండాల్సిన నాణ్యత లోపించి కొసలు చిట్లిపోతాయి. కాబట్టి కేశ సంపదను కాపాడుకోండి! అందంగా దువ్వుకోండి.

-పరిమి శ్యామలా రాధాకృష్ణ