సబ్ ఫీచర్

తొలి తెలుగు దళిత కిరణం(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో మొట్టమొదటి కథలు రాసిన దళిత రచయిత భాగ్యరెడ్డి వర్మ. మాదిగల వెట్టిచాకిరీని చూసి చలించి ‘అజ్ఞాతవాసి’,‘వెట్టిమాదిగ’ రచనలను భాగ్యరెడ్డి వర్మ రాశారు. గణపతి తత్త్వం అనే నాటికను కూడా ఆయన రాసి మెప్పించారు. భాగ్యరెడ్డి వర్మ చాలా రచనలు ఇప్పుడు లభించడం లేదు. తనపేరు, హైదరాబద్ కలసి వచ్చేలా ‘్భగ్యనగర్’ పత్రికలను వెలుగులోకి తీసుకువచ్చారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ని భిన్న పార్శ్వాలలో దర్శించడానికి దారిచూపిన రచనలు చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో భాగ్యరెడ్డి వర్మ సమాచారం వెలుగు చూసింది. 1921లో వడ్లకొండ నరసింహరావు రాసిన పుస్తకం మాతృకతో భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన గౌతమ్ 1952లో ‘్భగ్యోదయం’ అనే ఇంగ్లీషు పుస్తకాన్ని వెలువరించారు. భాగ్యరెడ్డి వర్మ సంపాదకీయాలు, ఉపన్యాసాలు, సృజనాత్మక రచనలు ఈ తరం వారికి తెలియాల్సిన అవసరం ఉంది. భాగ్యరెడ్డి వర్మ రచనలు ఆంగ్లంలోకి తర్జుమా అయితే ప్రపంచానికి ఆయన గొప్పతనం తెలియడానికి మార్గం ఏర్పడుతుంది.
హైదరాబాద్ నుండి దళితోద్యమ నాయకుడుగానే పేరొందిన భాగ్యరెడ్డి వర్మ బహుముఖ కృషి చేశారు. దళిత హక్కుల కోసం పోరాటం చేసిన తొలితరం నాయకులలో మొదటి శ్రేణిలో నిలిచిన వ్యక్తి. భాగ్యనగర్, ఆది హిందూ పత్రికలను నడిపించి హక్కులను కాపాడేందుకు సంపాదకీయాలను చైతన్యం రేకెత్తిస్తూ ఆయన రాశారు. ఆది హిందూ పత్రికలో 1938లో ఆయన రాసిన ‘‘ప్రాథమిక హక్కులు’’ అనే సంపాదకీయం ఎందరినో ఆలోచింపజేసింది. భాగ్యరెడ్డి వర్మ కాలంలో తెలంగాణలో చదువుకున్న తెలుగువారి జనాభా 5, 6 శాతానికి మించి లేకపోవడం, దళితుల అక్షరాస్యత శాతం అతి తక్కువగా ఉండడం వంటి పరిస్థితులలో మొత్తం సమాజ సమస్యను అర్థం చేసుకొని పత్రికా రచనతో పరిష్కారాలను సూచించిన సంపాదక శ్రేష్ఠుడు. అనేక సంఘటనలను, విషయాలను కళ్లకు కట్టినట్టుగా తన సంపాదకీయాలలో రాసిన ధీశాలి. బ్రహ్మసమాజ్, బుద్ధ జయంతి, రాజారామమోహనరాయ్ వంటి అనేకానేక సందర్భాలలో ఆయన రాసిన సంపాదకీయాలు ఎందరినో ఆలోచింప చేశాయి. దళితుల్ని చైతన్యం చేసే ఉద్దేశ్యంతో ఈ దేశ మూల వాసులు వారేనంటూ 1906లోనే ‘జగన్మిత్రమండలి’ అనే సంస్థను స్థాపించి ఎంతో కృషి చేశారు భాగ్యరెడ్డి వర్మ. బ్రతికింది 52 సంవత్సరాలు. అయితే అందులో 32 సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారు. చిరస్మరణీయుడిగా మిగిలారు. దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలలను ఏర్పాటు చేయించేందుకు పోరాటం చేశారు. ఆది హిందువుల ఐక్యత, వాటా కొరకు, దళితుల ఆర్థిక సామాజిక ప్రగతి కొరక ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదైనా అది సరిగ్గా గుర్తింపులోకి రాలేదు. ఆది హిందూ వార్షిక సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు ఉత్తేజపూరితమైనవి. సైనిక, పోలీసు విభాగాల్లో ఆది హిందువులను చేర్చుకోవడంలో చూపించే వివక్షతను నిరసిస్తూ ఉపన్యాసాలు ఇచ్చి, వ్యాసాలు రాశారు. 1930 నుండి ఆంధ్ర మహాసభ నిర్వహించిన ప్రతి సభలకు భాగ్యరెడ్డి వర్మ తప్పనిసరిగా హాజరయి ప్రసంగించేవారు. 1911 నుండి అనేకాంశాలపై పత్రికలకు వ్యాసాలు రాసే భాగ్యరెడ్డి వర్మ మొదటి వ్యాసం అదే సంవత్సరం ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైంది.
తెలుగులో మొట్టమొదటి కథలు రాసిన దళిత రచయిత భాగ్యరెడ్డి వర్మ. మాదిగల వెట్టిచాకిరీని చూసి చలించి ‘అజ్ఞాతవాసి’,‘వెట్టిమాదిగ’ రచనలను భాగ్యరెడ్డి వర్మ రాశారు. గణపతి తత్త్వం అనే నాటికను కూడా ఆయన రాసి మెప్పించారు. భాగ్యరెడ్డి వర్మ చాలా రచనలు ఇప్పుడు లభించడం లేదు. తనపేరు, హైదరాబద్ కలసి వచ్చేలా ‘్భగ్యనగర్’ పత్రికలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ సంచిక (్భగ్యనగర్, ఆది హిందూ ప్రతులు) దొరికితే ఉస్మానియా తదితర విశ్వవిద్యాలయాల నుండి లోతైన ఆలోచన పెరిగి పరిశోధనకు దారులుతీసే అవకాశం ఉంది. భాగ్యరెడ్డి వర్మ విగ్రహం హైదరాబాద్ ఆది హిందూ పాఠశాలలో ఏర్పాటు చేశారు. నిత్యకృషితో నిరంతర తపనతో ఆనాడే గొప్ప కార్యాలను ప్రారంభించి సమస్యలను తన ప్రజ్ఞలో పరిష్కరించిన మహాకథకుడు భాగ్యరెడ్డి వర్మ. హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వర్మ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఘనమైన నివాళి అర్పించాలి. ఆనాటి తరం తెలంగాణ సామాజిక, ఉద్యమ స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచిన మహానాడు మూర్తిమత్వం భాగ్యరెడ్డి వర్మది. భావితరాలకు బాటలను చూపే ఎన్నో విలక్షణ అంశాలను భాగ్యరెడ్డి వర్మ తన రచనలలో ప్రబలంగా రాసి మెప్పించారు. తొలితరం తెలంగాణ, సాహిత్య, పత్రికారంగ సమరస్ఫూర్తి - భాగ్యరెడ్డి వర్మ.

- తిరునగరి శ్రీనివాస్ 94414 64764