సబ్ ఫీచర్

నవయుగ వైతాళికుడు(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) తెలుగునాడులో తెచ్చిన సాహితీమూర్తిమత్వం. సాంఘిక సంస్కరణ ప్రబోధ చైతన్యతావ్యాప్తి. దేశ చరిత్ర, సంస్కృతి, పత్రికా నిర్వహణ, పురా భారతీయ తత్వ చింతన, జనజీవనం, పరిశోధక సాహిత్య పరిణామ రీతులు, తలచుకున్నప్పుడు ఆ మహానుభావుడు తీరాంధ్రంలో కందుకూరి, గిడుగు, గురజాడలు ఫలదీకరించిన సమాజ జీవన ప్రబోధ చైతన్య పరివ్యాపకుడు తెలంగాణలో అని అర్థమవుతుంది. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో సురవరం వారితో సమస్కంధులైన కవి పండిత పరిశోధక సామాజిక చరిత్రవిదులు తెలుగు నాట మరొకరు లేరు. ఆయన రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇటీవలి డెబ్భై ఏళ్ళలో ఇంకొకటి లేదు. మారేపల్లి రామచంద్రశాస్ర్తీగారి ‘నుడిదండలు’ (తెలుగులో వచ్చిన నిఘంటువులు) అనే చిన్న పుస్తకానికి సురవరం వారు సమకూర్చిన పరిచయ వాక్యాలు తెలుగు భాషా సారస్వతాల కృషితో ప్రతాపరెడ్డిగారి సర్వంకష, సర్వతోముఖ, నిరుపమాన పాండిత్య గరిమను నిరూపిస్తున్నది. రాళ్ళపల్లి, వేలూరి, దీపాల వారివంటి ప్రశంసలకు సమార్హమైనది సురవరం వారి సాహితీ ప్రతిభ. ఎవరో ఒక అవివేకి తెలంగాణంలో కవులు, పండితులున్నారా? అని ప్రతాపించగా 354మంది కవి పండిత, పరిశోధక, వైదుష్య సంకలనం ప్రకటించినవారు ప్రతాపరెడ్డిగారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర కేంద్ర సాహిత్య అకాడమీవారి పురస్కారం పొందిన మొట్టమొదటి ఉద్గ్రంథం. వెయ్యేళ్ళ తెలుగువారి భాషా సాహిత్య జీవనాన్ని తెలియజేస్తున్నది. సాంఘిక జీవనాన్ని ఆవిష్కరిస్తున్నది. వెలమలు, రెడ్లు తమిళ ప్రాంతం వెల్గాల వంశాలనుంచి, రాష్టక్రూటుల దేశంనుంచీ వలస వచ్చి తెలుగువారైనారని చెపుతున్నారు సురవరంవారు. రెడ్లు జాతీయ సంప్రదాయాభిమానులనీ, వెలమలు సంస్కరణపు చోదకులనీ ప్రతాపరెడ్డిగారు చెప్పారు. రెడ్లంతా శైవ మతాభిమానులనీ, వారి వంశగోత్రాలు శివసహస్రనామ అపభ్రంశ రూపాలనీ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి జీవిత చరిత్రలో ప్రతిపాదించారు సురవరంవారు. నన్నయ్యగారి కాలంలో పురుషులు కూడా మట్టెలు ధరించేవారని ఆధారాలు చూపారు ప్రతాపరెడ్డిగారు. తెలుగు వర్ణమాలను ‘ఓనమాలు’ ఎందుకంటారో వివరించారు. హిందువుల పండుగలు, రామాయణ రహస్యాలు, హైందవ ధర్మవీరులు, మొగలాయి కథలు వంటి 40 గ్రంథాలు రచించారు. సురవరం వారి తెలుగువారి సాంఘిక చరిత్ర ఐఏఎస్, ఐపిఎస్ పరీక్షా కాంక్షులకు పఠనీయ గ్రంథంగా ఉండేదని తెలుస్తున్నది. కర్నూలులో ప్రాథమిక విద్య, హైదరాబాద్ నిజాం కాలేజీలో ఇంటర్మీడియెట్, మద్రాసులో బి.ఎ, బి.ఎల్ చదివారు. 1930లో గోల్కొండ పత్రిక స్థాపించారు. బ్రిటిషు ఆంధ్రంలో ఆంధ్రపత్రిక వంటిది తెలంగాణ గోల్కొండ పత్రిక. 1930లో నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ జరిపిన భావ విప్లవ ఉద్యమానికి తొలి అధ్యక్షులు సురవరంవారు. షష్టిపూర్తి కూడా కాకుండానే ప్రతాపరెడ్డి పరమపదించడం తెలుగువారి బహు శతాబ్దాల దురదృష్ట విషాద చరిత్ర. 1920-48 మధ్యకాలంలో తెలంగాణ పునరుజ్జీవన నవయుగ వైతాళికుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి.
సురవరం వారి సౌజన్యం, సౌమనస్యం, నిరాడంబర హృదయ వైశాల్యం, దేశహితైక జీవన దృక్పథం ప్రత్యక్ష సాక్షికంగా తెలియాలంటే గడియారం రామకృష్ణశర్మగారి స్వీయచరిత్ర ‘శతపత్రం’, తిరుమల రామచంద్ర స్వీయచరిత్ర ‘హంపీ నుంచి హరప్పా దాక’ చదవాలి. మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకరశాస్ర్తీ, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి ప్రాతః స్మరణీయుడు నాకు సురవరం ప్రతాపరెడ్డిగారు అని తిరుమల రామచంద్ర కైమోడ్పు. పరమ శాంతమూర్తి, ఉన్నత ఉదార సాహితీవ్రతుడు ప్రతాపరెడ్డి అని రామచంద్ర కథితం.

- డా. అక్కిరాజు రమాపతిరావు