సబ్ ఫీచర్

రాహుల్ ప్రార్థనలు చాలా ఆలస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్‌జీ మొన్న గుజరాత్ ఎన్నికలలోనే, మనకు తెలిసినంత వరకూ, దేవాలయ దర్శనాలు ప్రారంభించారేమో! అమేథీలో వారెప్పుడు దేవాలయాలు దర్శించినట్లు వార్తలు రాలేదు.. సరే మంచిదే, పైగా వారు తాము శివభక్తులమని ప్రకటించారు, సంతోషం. మనం శివకేశవులకు భేదభావం చూపం కాబట్టి, మొత్తానికి వారు భక్తులయ్యారు, చాలు. ఇప్పుడు అసలీ సోమనాథ దేవాలయ పునర్నిర్మాణ కథ ఏమిటో తెలుసుకుందాం.
ఆ దేవాలయాన్ని, మొహమ్మద్ గజనీ, అల్లాఉద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు బోటి ముస్లిం పాలకులంతా బీభత్సం సృష్టించారు. కాబట్టి మనకు 1947లో స్వతంత్రం సిద్ధించిన నాటికి అదో శిథిలం, మిగిలింది మనకు పూర్వస్మృతులు మాత్రమే. ఈ పరిస్థితులలో, ప్రజలంతా స్వాతంత్య్రం వచ్చింది కాబట్టి, ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించాలని కోరుకున్నారు.
కాని మన ప్రథమ ప్రధాని, పండిట్ నెహ్రూగారు దానిని, పురావస్తుశాఖకు ఇస్తే, ఆ శాఖవారు శిథిలాలలను భద్రంగా కాపాడతారని సెలవిచ్చారు, కారణం మనకు తెలియదు. కాని దానికి ప్రజలెంత మాత్రం సుముఖంగా లేరు. పైగా - నెహ్రూజీ మంత్రివర్గంలోని ప్రముఖులు - సర్దార్ పటేల్, కె.యం.మున్షీ, ఎన్.వి.గాడ్గిల్‌లు నిర్మించి తీరాలనే దృఢాభిప్రాయంతో ఉన్నారు! పైగా మన ప్రథమ రాష్టప్రతి డా.రాజేంద్రప్రసాద్, సోమనాథ దేవాలయాన్ని తిరిగి నిర్మించి, అక్కడ జ్యోతిర్లింగ స్థాపన జరగాలని, అప్పుడే మన ‘రాష్ట్రీయ స్వాభిమానం’ పురుడు పోసుకుంటుందన్నారు. ఇలా నెహ్రూజీ మంత్రివర్గంలోని ముఖ్యులే కాకుండా, రాష్టప్రతి కూడా వారితో విభేదించారు.
నెహ్రూజీ, తన ప్రభుత్వపు ‘సెక్యులర్’ ముద్రను అది దెబ్బతీస్తుందనీ, ప్రభుత్వ ధనం దానికెంతమాత్రం ఖర్చు పెట్టకూడదనీ, తన మంత్రివర్గంలోని వారెవ్వరికీ ఇందులో జోక్యం ఉండగూడదనీ చెప్పారు.
మహాత్మాజీ జోక్యం
దీనిమీద పటేల్, మహాత్మాజీకి ఈ విషయాన్ని విన్నవించి వారి అభిప్రాయం కోరారు. మహాత్మాజీ, దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా సమర్థించారు. అయితే, అది ఒక ట్రష్టు అధ్వర్యాన జరగాలనీ, అది ప్రజాధనంతోనే నిర్మించబడాలనీ కోరారు. పండిట్‌జీ ‘మీ జోక్యం వద్దన్నా’, దానిని ఖాతరు చేయకుండా పటేల్ ప్రభృతులు, రంగంలోకి దిగారు.
సర్దార్ పటేల్ లేఖ.. నిర్యాణం
ఈ ఉత్తరాన్ని, మున్షీ ఉదహరించారు. ఆ ఉత్తరంలో, పటేల్ స్పష్టంగా చెప్పారు. ‘ఈ విషయంలో, హిందువుల భావాలు (sentiments) స్పష్టంగా, దృఢంగా ఉన్నాయి. అది వారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం’ అన్నారు. కాని, దురదృష్టవశాత్తు, ఆ నిర్మాణం, లింగ స్థాపనను చూడకుండానే సర్దార్ 1950 డిసెంబర్ 15న వెళ్లిపోయారు! తరువాత నిర్మాణ కార్యక్రమం సాగింది. నెహ్రూజీ సలహాను ప్రక్కకు త్రోసి, మన అధ్యక్షుడు, రాజేంద్రప్రసాద్ కూడా పూర్తిగా ఇందులో నిమగ్నమయ్యారు. చివరగా మన అధ్యక్షుల వారి చేతుల మీదుగా, సోమనాథ జ్యోతిర్లింగము 1951 మే 11న పునః ప్రతిష్ఠించబడింది.
కొన్ని ఉత్తరాలు
నెహ్రూజీ ఈ కార్యక్రమాన్ని ‘హిందూ పునరుద్ధరణ’గా వర్ణిస్తే, మున్షీ నెహ్రూజీకి 1951 ఏప్రిల్ 24న వ్రాసిన ఉత్తరంలో, ఇలా అంటారు.. ‘భారతదేశపు సామూహిక అంతరంగం సోమనాథ దేవాలయ పునర్నిర్మాణంతో, మనం ఇంతవరకు చేసిన అనేకానేక ఇతర పనులకన్న, చాలా సంతోషించింది అని చెప్పగలను’ అంటూ ఆ ఉత్తరాన్ని ఈ విధంగా ముగించారు.
‘నా గతం పట్ల నాకుగల నమ్మకమే, వర్తమానంలో నా పనులకు బలాన్నివ్వటమే కాకుండా, భవిష్యత్‌పట్ల చూడగలిగే నమ్మకాన్ని కలిగించింది. మనలను మన ‘భగవద్గీత’ నుంచి దూరం చేసే స్వతంత్రాన్ని నేను గౌరవించలేను. మన దేవాలయాల పట్ల మనం చూపే గౌరవాన్ని తీసివేసి, జీవితంపట్ల మన దృక్పథాన్ని మార్చటాన్ని నే భరించలేను. సోమనాథ పునరుద్ధరణ అనే నా స్వప్నం సాకారమవడం నే చూడగలిగాను. ఇది మన ప్రజకు, ఇప్పుడు మన స్వతంత్ర జీవనానికి అవసరమైన బలాన్ని ప్రసాదిస్తుందని నా నమ్మకం’
ఇదంతా ఎక్కడిది? మన ‘ప్రసారభారతి’ అధ్యక్షులు ఎ.సూర్యప్రకాష్, డిసెంబర్ 5న ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో వ్రాసిన సుదీర్ఘవ్యాసం ఆధారం. ఆ వ్యాసాన్ని చివరికి ఈ విధంగా ముగించారు.
‘నెహ్రూగారి సిద్ధాంతం’, హిందువుల పట్ల వారి ధోరణి ఇంత స్పష్టంగా ఉంటే, వారి ముని మనుమడు ప్రాయశ్చిత్తం కోసం సోమనాథ్‌ను దర్శించటం చాలా చిన్న విషయం, చాలా ఆలస్యమైన సంగతి కూడా సుమా(finally it must be set that. In view of the damning evidence we have on hand in regard to the ‘Nehru Doctrine’ vis-a-vis Hindus, Rahul Gandhi’s ‘Prayaschitth’ is too little and too late)

ఏమంటారు?

-చాణక్య