సబ్ ఫీచర్

ధర్మాచరణే మోక్షానికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతిలో భాగమైన మానవుడు తన జీవన పథం కూడా ప్రకృతికి అనుగుణంగా ఉంటాలనే కృతజతాభావనతో ఉంటాడు. మానవుని ఉనికిని ఒక పవిత్ర అంశంగా ఈ పుడమిపై స్థిరపరిచినాడు. సృష్టి, స్థితి,లయమనే అపూర్వ విషయాలను తన ఏకాగ్రచిత్తంతో అనంతమైన మనో ప్రపంచంలో శోధించి సాధించారు మన ఋషులు. హిందూ ధర్మం సర్వజనీనము, మానవ శ్రేయస్సుకు మూలం ఒక్క సనాతన ధర్మమే. ప్రకృతి నుండి మానవుని ఆవిర్భావ మనే విశ్వాసమే బహు దేవతారాధనకు దారితీసింది. భూమాత, వాయుదేవుడు, అగ్నిదేవుడు, నారాయణుడు, విశ్వం, ఆదిత్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, ఇవన్నీ దేవతారూపాలుగా ఈనాటికి పూజలందుకుంటున్నాయి. దీనివెనుక మానవుని గొప్ప అణుకువ తత్త్వం నిండి యుంది.
పాశ్చాత్యతత్త్వవేత్తలు హిందువులను, బహుదేవతలను కొలిచే ఏకత్వ దైవ దర్శకులని కొనియాడారు. హిందూ ధర్మమనే మతానికి మూలం వేదనిధి. దీని నుండి వ్యక్తమైన పురాణ ఇతిహాసాలు, ఉపనిషత్తులు, దర్శనాలు మొదలైనవి మనకు దిశానిర్దేశం చేస్తున్నాయి.
ఆర్యావర్తనంలో జన్మించిన ప్రతిమనిషికి వీటిపై అచంచల విశ్వాసం ఉండడం వలననే హైందువులు తరతరాల నుండి అర్థవంతమైన ఆనందయుతమైన జీవనాన్ని గడుపుచున్నారు.
చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థకామ మోక్షాలు జీవనసారాన్ని అందిస్తున్నాయి.
కోరికలను ధర్మానుసారంగా తీర్చుకుంటేనే మోక్షానికి అర్హుడని పురాణాలు చెబుతున్నాయి. వానప్రస్థాశ్రమంలో మోక్షానికి వేదిక ఏర్పాటు చేసుకొని సన్యాసాశ్రబంలో అనంత వైరాగ్యంతో పడిపోవడమే గమ్యమని అదే మోక్షమని దారిచూపింది మన సనాతన ధర్మం.
ఆత్మను తెలసుకొనే జ్ఞానాన్ని మనకందించింది హైందవం. జనన మరణాలను తృణప్రాయంగా భావించే ఆత్మజ్ఞానాన్ని అందించిన హిందూ ధర్మ మార్గం విశ్వాసమనే దైవ భావనతోగాఢంగా ముడి వడి ఉంది. త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతిలో సత్వగుణ ప్రాధాన్యతతో పరమాత్మను ఎలా చేరుకోగలమో చెప్పింది. సచ్చిదానందంలో ఎలా మునిగి తేలాలో బోధించింది. సగుణోపాసనతో నిర్గుణోపాసనకు దారిచూపింది. ఆ నిర్గుణంతో ముక్తిని పొందే మార్గం సుగమమం చేసింది.
పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని పరోపకారమే పుణప్రదమని పరపీడనమే పాపమని వేదాల సారాంశంగా హైందవం హెచ్చరించింది. పరాత్పరునిపై విశ్వాసమే ఊపిరిగా నిలిపి సచ్చిదానందాన్ని పొందే సనాతన మార్గానికి దారి హైందవ ధర్మమే.
అహింసను పాటించేవాడు, నిస్వార్థంగా శుభకర్మలను ఆచరించేవాడు, భగవంతుని చేరే మత మార్గాన్ని తాను విశ్వసిస్తూ ఇతరుల విశ్వాసానికి భంగం కలిగించని వాడు చేరే పరమపదంలో ఉండేది ఒకే దేవుడు ఆయన భగవాన్ మహావిష్ణువు.

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు