సబ్ ఫీచర్

కిర్రాక్ స్టెప్పులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మై డాన్స్ వరల్డ్ ఇనిస్టిట్యూట్’లో పేదలకు ఉచిత శిక్షణ డాన్స్ మాస్టర్ మైఖేల్ రాజ్ ప్రోత్సాహం

నవనాగరిక ప్రపంచంలో ప్రతినిత్యం ఎన్నో మార్పులు కనిపిస్తుంటే దానికి తగినట్లు యువత కేవలం విద్యలోనే కాకుండా కాలానుగుణంగా పాశ్చాత్య నృత్యంలోను, సినీ సంగీత అడుగుల సవ్వడిలోను ఉత్సాహాన్ని చూపిస్తూ తమదైన శైలిలో వేదికలపై నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. చదువుకోవడానికి పరిస్థితులు అనుకూలించని కొంతమంది తమకు తెలిసిన నృత్యంలోనే సినిమాలలో అవకాశాలు సంపాదించుకుంటున్నారు. ఇటువంటి వారిలో మైఖేల్‌రాజ్ ఒకరు. సినీ నృత్య దర్శకులు లారెన్స్, రాజు సుందరం, అమ్మ రాజశేఖర్ వంటి ప్రముఖుల నేతృత్వంలో అనేక చిత్రాల్లో డాన్సర్‌గా పనిచేసి ఆరు చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించి పరిస్థితులు అనుకూలించక తన జన్మస్థలమైన తిరుపతిలో ‘మై డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్’ స్థాపించి యువతీ యువకులకు వెస్ట్రన్ డాన్స్ నేర్పిస్తున్నారు.
నృత్యం ఒక వ్యాయామం
పిచ్చి డాన్సులు అంటూ వ్యాఖ్యానించే పాత తరానికి నేటి తరం తమదైన శైలిలో నచ్చచెప్పి వెస్ట్రన్ డాన్స్ స్టెప్పులు నేర్చుకోవడమే కాకుండా వేదికలపై ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. ఇది కేవలం నృత్యం మాత్రమే కాదు ఒక వ్యాయామం కూడా అని అంటున్నారు మైఖేల్ రాజ్. సుమారు నలభై ఐదు సంవత్సరాల క్రితం ‘దమ్మరే ... దమ్’ అంటూ వచ్చిన హిప్పీ ఫ్యాషన్‌లతో వచ్చిన హిందీ పాట యువతను నిద్రను లేపితే, ఇటీవల నాగార్జున - శ్రీదేవిల కాంబినేషన్‌లో వచ్చిన ‘గోవిందా గోవిందా’ సినీ గీతం ఉత్సాహాన్ని పెంచింది. శాస్ర్తియ సంగీత నృత్యాలను ఆదరించి ప్రోత్సహించినట్లే ఈ నృత్యాన్ని కూడా చూసి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఆనందిస్తున్నారని, అందుకే తాము కూడా వెరైటీ కోసం ఈ నృత్యం నేర్చకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు.
సినీ పరిశ్రమ ఆదరణ కొత్త ఉత్సాహాన్నిచ్చింది
ఒక డాన్సర్‌గా తాను స్టెప్పులు వేస్తున్నపుడు చూసిన హీరో బాలకృష్ణ, రాజాలతోపాటు ఈనాటి హీరోన్‌లు కూడా డాన్స్ చాలా బాగుంది అంటూ మెచ్చుకోవడం సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అని మైఖేల్‌రాజ్ అన్నారు. ఆ ఉత్సాహాన్ని ఊపిరిగా చేసుకొని ఈనాటి నవ శతాబ్దంలో యువతకు నృత్య శిక్షణలో హారతి పడుతున్నానని అన్నారు. తనకు తగిలిన ఎదురుదెబ్బలు నృత్యంలో జీవితం నేర్పిన పాఠాలుగా జీర్ణం చేసుకొని విద్యార్థులకు కొత్త పోకడలు తెలిసే విధంగా శిక్షణ ఇస్తూ వారి చదువులకు ఆటంకం కలుగకుండా ప్రోత్సహిస్తున్నానని, ప్రస్తుతం పేరెంట్స్ కూడా వెస్ట్రెన్ డాన్స్‌పై కొంత అవగాహన కలిగించుకొని ప్రోత్సహిస్తున్నారని మైఖేల్ రాజ్ అన్నారు.
ప్రేక్షకుల కేరింతలే ప్రోత్సాహం
ప్రస్తుతం చాలా కాలేజీలలోను, విద్యా సంస్థల వార్షికోత్సవాలలోను యువత ఈ నృత్యాలు చేస్తుంటే ప్రేక్షకులు ఈలలు వేస్తూ గెంతులు వెయ్యడం అల్లరి కాదని, కళాకారులను ప్రోత్సహించటమేనని రాజ్ అన్నారు. తిరుపతిలోని గాంధీపురంలో జన్మించిన నాగరాజు సినిమా పాట వినిపించినపుడుల్లా స్టెప్పులు వేస్తూంటే కొంత మంది హేళన చేసినా అది వారి ఆశీర్వాదంగా భావించి హైదరాబాద్‌కు వచ్చి ‘ఒసే రాములమ్మ’ చిత్రంలో అవకాశం సంపాదించి దాసరి నారాయణరావు ఆశీర్వాదంతో, ప్రేక్షకుల మన్ననలతో ఎదిగానని అన్నారు. ఆనాటి నాగరాజు ఈనాటి మైఖేల్ రాజ్‌గా ఎదగడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు, స్నేహితులు, ప్రోత్సహించిన పెద్దలు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని అన్నారు. పరిశ్రమలో నిలబడటానికి అదృష్టంతోపాటు కాసులు కూడా కొంత వుండాలి. ఆ కాసులు లేక ఎన్నో కష్టాలు పడ్డాను. అందుకే తాను స్థాపించిన ‘మై డాన్స్ వరల్డ్ ఇనిస్టిట్యూట్’లో పేదలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. ఈనవశకంలో యువతీ యువకులకు తనదైన శైలిలో శిక్షణ ఇస్తూ వేదికలపై అవకాశాలను కల్పిస్తూ ధైర్యాన్ని కలిగిస్తున్న మైకేల్‌రాజ్ భవిష్యత్తులో ‘చికుబుకు చికుబుక రైలే’ అంటూ నృత్యం చేసిన ప్రభుదేవా స్థాయికి ఎదగాలని విద్యార్థులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

-మురళీధర్