సబ్ ఫీచర్

మాలాకైంకర్యరూపిణి.. ఆండాల్ తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియుగములో పాండ్య మండలము నందలి శ్రీవిల్లిపుత్తూరులో శ్రీ భట్టనాథులు పష్పోద్యానమున తులసీవనమును పెంచుటకై భూమిని తవ్వునప్పుడు భూదేవి చిన్న శిశువుగా ఆవిర్భవించింది. ఆ శిశువును చూచిన నిస్సంతువగు భట్టనాథులు ఆమె భగవానుడు తనకు ప్రసాదించిన సంతానముగా భావించి ఆమెకు ‘‘కోదై’’ అని పేరు పెట్టాడు. వయసుతోపాటు గోదాదేవికి భగవద్భక్తియు పెరుగజొచ్చెను ‘‘తమంతరేణనైవాన్యం మనసా పి పితం వృణే’’ అనునట్లు భగవానుడగు శ్రీమన్నారాయణుని మాత్రమే భర్తగా వరింప నిశ్చయించుకొనెను. ప్రతి దినము శ్రీ విల్లిపుత్తూరులో వెలసియున్న వటపత్రశాయి స్వామికి సమర్పించుటకై పూలమాలికలను కట్టుట భట్టనాథులకు అలవాటు. తన తండ్రి కట్టి యుంచిన పూలమాలికలను రహస్యముగా తాను ధరించి అద్దములో తన రూపమును చూచుకొనుచు తనకు భగవానునకు అపురూపమైన సౌందర్యము ఉన్నదా? లేదా? అని గోదాదేవి పరిశీలించు కొనుచుండెడిది. ఒకనాడు తన కూతురు చేసే పనిని చూచిన భట్టనాథులు ఆమెపై మిక్కిలి కోపించి, ‘‘అయ్యో! ఎంత పనిచేసితివి ఎంత అపచారము జరిగినది’’ అని పల్కి చాలా బాధపడి ఆ దినమున వటపత్రశాయికి పూలమాలికలను సమర్పించలేదు. కాని, భట్టనాథులకు ఆనాటి రాత్రి వటపత్రశాయి స్వామి కలలో కనిపించి ‘‘్భట్టనాథా! ఎందులకీనాడు నీవు పూలమాలికలను సమర్పింపలేదు?’’ అని ప్రశ్నించెను.జరిగిన సంగతి చెప్పబోగా ‘‘ఓరుూ! గోదాదేవి ముడుచుకొని విడచిన మాలికలె నాకు ఆనందదాయకము సుమా! నీవు సంకోచింపకఆ పూమాలికలనే నాకు అర్పింపుము అని ఆదేశించెను. దీనివలన గోదాదేవికి ‘‘శూడిక్కొడుత్త నాచ్చియార్’’ (స్వోచ్చిష్ట మాల్యదాత్రీ - ఆముక్తమాల్యద) అను పేరు కలిగినది.

- వడ్డూరి రామకృష్ణ