సబ్ ఫీచర్

ఆమె జీవితం ఓ పోరాటం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ భారత తొలి టాక్సీ డ్రైవర్‌గా రికార్డు జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ రూపకల్పన బాలికలకు స్ఫూర్తిదాయకం
పద్నాలుగేళ్ల వయసులో ఆమెకు పెళ్లయింది. 18 ఏళ్ల వయసులో అత్తింటిలో పెట్టే గృహ హింసకు తాళలేక అత్తింటి నుంచి పారిపోయింది. ఆ నాలుగేళ్ల నరకం నుంచి నేర్చుకున్న గుణపాఠాల వల్ల ఆత్మస్థయిర్యానికి ప్రతీకగా నిలిచింది. ఆమే దక్షిణ భారతదేశ తొలి మహిళా టాక్సీ డ్రైవర్. ఈ వృత్తిలో రాణించటానికి తనకు మహిళ అనే వివక్షత ఎక్కడా అవరోధంగా రాలేదని ధైర్యంగా చెప్పే ఈ ధీర వనితపై డాక్యుమెంటరీ సైతం రూపొందింది. లింగ వివక్షత, శారీరక చిత్ర హింసల నుంచి తనను తాను రక్షించుకుంటూ అసాధారణ నైపుణ్యంతో ఆనాడు సెల్వీ టాక్సీ డ్రైవర్‌గా జీవితాన్ని ఆరంభించింది. అన్యాయంపై పోరాడిన ఓ సాధారణ మహిళను అని తనకు తాను చెప్పుకునే ఆమె గురించి ఈ డాక్యుమెంటరీతో ప్రపంచానికి తెలిసింది.
అత్తింటి ఆరళ్ల నుంచి బయటపడిన ఆమెకు 2004లో కెనడియన్ డైరెక్టర్ ఎలీసాకు సెల్వీ తారసపడింది. ఆమె వద్దే టాక్సీని ఎలా నడపాలో ఎలీసా సైతం నేర్చుకుంది. ఒక గంట 18 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో సెల్వీ జీవిత చరిత్ర 2004 నుంచి 2014 మధ్య ఎలా సాగిందో సవివరంగా ఉంటుంది. తన మీద డాక్యూమెంటరీ అని అనగానే తొలుత సెల్వీ సైతం సంశయించింది. తాను అంత గొప్పదాన్నా? తన మీద ఆమె ఎందుకు చిత్రం తీయాల్సిన అవసరం ఏమిటి అని అనుమానం పడింది. ఆమె అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎలీసా తీసిన ఈ డాక్యుమెంటరీ నేడు అట్లాంటా ఫిలిం ఫెస్టివల్‌లో సైతం ప్రదర్శనకు నోచుకున్నది. బతుకు పోరాటం కోసం తాను చేసిన ప్రయత్నం ఒక కథగా మలచబడిందంటేనే సెల్వీకి ఆశ్చర్యం. నేడు ఎంతోమంది అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా మారానంటేనే ఆమెకు ఒకింత గర్వంగానూ ఉంటుంది. ఇపుడు మహిళా సాధికారిత కోసం సెల్వీ దేశంలో విస్తత్రంగా ప్రచారం చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలకు, ఢిల్లీలోని మురికివాడలు, ఉత్తర కర్నాటకలోని దేవదాసీ ప్రాంతాలకు వెళ్లి అక్కడ వేలాది మంది బాలికలను కలుసుకుని సాధికారిత పాఠాలు చెబుతుంది. సెల్వీ డాక్యుమెంటరీని చూసిన బాలికలు ఆమెను ప్రేరణగా తీసుకుని తమ కష్టాల నుంచి బయటపడటానికి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తున్నారు.

నేను నమ్మను, ఓ మహిళ తాను ఏమీ చేయలేనని బేలగా అనుకుంటుందని. ఒక మగవాడు వంట చేస్తుంటే బియ్యం గింజలు తాము నీ చేతుల్లో ఉడకం అని చెబుతాయా? అలాగే కారు మహిళ నడుపుతానంటే తిరస్కరిస్తుందా?. నా జీవితం ఎంతోమందికి ప్రేరణగా నిలిచిందని నాకు తెలుసు. ఎవరికైనా బాధ కలిగినపుడు వారు నేను ప్రదర్శించిన శక్తిని గుర్తుకు చేసుకుంటారని నమ్ముతున్నాను. ప్రతి అమ్మాయి, తల్లిదండ్రులు నా సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సామాజిక వైఖరిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.
-సెల్వీ, దక్షిణ భారత దేశ తొలి మహిళా డ్రైవర్.