సబ్ ఫీచర్

భాజపాతో స్నేహం..బాబుకే లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో తన పలుకుబడి దెబ్బతినకుండా చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజకీయాలను నడుపుతుంటారు. 1995లో చంద్రబాబునాయుడు రాష్ట్రం లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూనే వచ్చారు. 1996లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ ఏర్పడిన సందర్భంగా కాంగ్రెస్-బి.జె.పి.ల ప్రత్యామ్నాయంగా యునైటెడ్ ఫ్రంట్ రూపొందడంతో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి లోక్‌సభలో 16 సీట్లు లభించాయి. పెద్ద పార్టీగా అవతరించిన బి.జె.పి వాజ్‌పేయి నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 13 రోజులపాటు సాగిన బి.జె.పి. ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోలేక రాజీనామా చేసింది. ఫలితంగా కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చంద్రబాబు చక్రం తిప్పారు. తదుపరి 1998లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ఈ ఎన్నికల్లో 12 స్థానాలు పొందిన తెలుగుదేశం పార్టీదే మళ్ళీ కీలక పాత్ర అయింది. బి.జె.పితో జట్టు కట్టిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబునాయుడు జాతీయస్థాయిలో ఏన్డీయే కూటమి ఏర్పాటులో ప్రధానపాత్ర వహించారు. ఆ తరువాత జాతీయ రాజకీయాలలో ఒక వెలుగు వెలిగారు. లోక్‌సభ స్పీకరు పదవిని తెలుగుదేశం పార్టీ స్వీకరించినప్పటికీ ప్రభుత్వంలో చేరకుండా బయటినుంచే ఆ పార్టీ మద్దతు తెలిపింది. అన్నాడిఎంకె తన మద్దతు ఉపసంహరించుకోగా 13 నెలల్లోనే ఎన్డీయే ప్రభుత్వం కూలిపోయింది.
1999 ఎన్నికల్లో తిరిగి ఎన్డీయే కూటమితో కలిసి పోటీచేసి టి.డి.పి. ఈసారి 29 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. మంత్రివర్గంలో చేరకనే స్పీకరు పదవి కొనసాగించుకుంది. బాలయోగి మరణంతో ఆ పదవిని వదులుకుంది. నమ్మకస్థుడైన మిత్రుడుగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి బి.జె.పి. నేతలు గౌరవ మన్ననలందించారు. కేంద్రంనుంచి రాష్ట్రానికి కావలసిన వనరులను చంద్రబాబు అడిగిందే తడవుగా అందించారు. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం, బి.జె.పి. పొత్తు ఉభయ తారకంగా అద్భుతంగా విజయవంతమైంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బి.జె.పి. సాధించిన ఘన విజయం నిజంగా ప్రభంజనమే. ఈసారి రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలలో టి.డి.పి. 29, బి.జె.పి (ఏడు) స్థానాలు గెలుచుకున్నాయి. కానీ ఇతర పార్టీ అండదండలు లేకుండా తెలుగుదేశం ఎప్పటికయినా ఒంటరిగానే ఈ రాష్ట్రాన్ని గెలుచుకోగలదన్న ధైర్యాన్ని కూడా అదే సమయంలో ఈ ఎన్నికలు మిగిల్చలేదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు యిచ్చినప్పటికీ రాష్ట్రంలో మాత్రం బి.జె.పి.తో అధికారాన్ని పంచుకోవడానికి ఆయన ఏమాత్రం సుముఖం వ్యక్తంచేయలేదు. అంతేకాదు, తమ పునాదులు విస్తరించాయని, అందువల్ల తమకు 2004 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలని రాష్ట్ర బి.జె.పి. నాయకత్వం ఎంత వాదించినా చంద్రబాబు లొంగలేదు.
12 మంది ఎమ్మెల్యేలు, పలు స్థానిక సంస్థల్లో మున్సిపాల్ చైర్మన్లు, మండలాధ్యక్షులు, జడ్‌పిటిసి, ఎంపిటిసి సభ్యులు, పలు గ్రామాలలో సర్పంచ్‌లు తొణికిసలాడే అధికార దర్పం- ఇదీ 2004 ఎన్నికలకు ముందు రాష్ట్రం లో బి.జె. ప.కున్న ప్రాభవం. మంచి ఊపుమీద ఉన్న ఆ పార్టీకి 2004 ఎన్నికల్లో అనూహ్యంగా దెబ్బతగిలింది. తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకుని 9 పార్లమెంటు 27 అసెంబ్లీ స్థానాలనుంచి బరిలోకి దిగితే కేవలం 2 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. పార్లమెంటులో రాష్ట్రంనుంచి అసలు ప్రాతినిధ్యమే లేకుండాపోయింది. 2009 ఎన్నికల్లో బి.జె.పి. సర్వశక్తులతో రంగంలో దిగింది. 41 పార్లమెంటు 269 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒంటరిగానే పోటీచేసింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో బి.జె.పి. ఇంత పెద్ద సంఖ్యలో పోటీచేయడం ఇదే మొదటిసారి.
2009 ఎన్నికల్లో విజయానికి దోహదంచేసే ఏ చిన్న అవకాశాన్నయినా చంద్రబాబు వదులుకోలేదు. ఎన్నికల తరువాత, తదుపరి దేశ ప్రధానమంత్రి ఎంపికలో చక్రం తిప్పే అవకాశం సైతం తన చేతిలో ఉండాలని చంద్రబాబు ఆరాటపడ్డారు. కాంగ్రెస్, బి.జె.పి.లు రెండింటినుంచి కాకుండా మరో ఫ్రంటునుంచి ప్రధానమంత్రిని ఎంపికచేసే పరిస్థితులు రావాలని ఆయన ఆశించారు. 2004 ఎన్నికల్లో ఎన్డీయేలో ఉన్నందువల్లనే ఓటమి పాలయ్యామని టి.డి.పి. నేతలు భావించి బైటకొచ్చారు. బి.జె.పి. సాయంలేకుండా రెండు ఎన్నికల్లో 2004, 2009లలో ఘోరంగా విఫలమైన చంద్రబాబునాయుడు పర్యవసానంగా పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. 2014 ఎన్నికలకు ముందు అనుభవంతో పాఠం నేర్చుకొని ఆయన ఎన్డీయేతో చేతులు కలిపారు. గత ఎన్నికల్లో మూడోసారి వరుసగా పరాజయంపాలు కావడమే జరిగితే అది చంద్రబాబునాయుడు పాలిట ఆశనిపాతంగా పరిణమించేది. పొత్తు కారణంగా తెలంగాణా ప్రాంతంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎనిమిదింటిని, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నలభై రెండింటిని బి.జె.పి.కి ఆయన సమర్పించుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో బి.జె.పి.ని పెరగనివ్వకుండా గట్టి బందోబస్తుచర్యలు తీసుకున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేవలం నాల్గింటినీ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదహేడింటిని మాత్రమే బి.జె.పి. కేటాయించడానికి ఆయన సమ్మతించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బి.జె.పి. కలిసి పోటీచేసినా కాంగ్రెస్ కన్నా రెండు స్థానాలు తక్కువే వచ్చాయి. ఏతావతా ఏ రాష్ట్రంలోనైనా రెండు పార్టీలు బలంగా ఉన్నప్పుడు మూడో పార్టీ ఎదగడానికి తక్కువ అవకాశముంటుంది. రాష్ట్రంలో రుూ సూత్రం బి.జె.పి.కి వర్తిస్తున్నది. ఉప ఎన్నికల గెలుపు ఓటమితో రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ప్రభావం కనిపించదు. ఐతే, అధికారంలో ఉన్న పార్టీ దీన్ని ఒక హెచ్చరికగా భావించవచ్చు.

- జి.వెంకటరామారావు ఫోన్: 040-24380707