సబ్ ఫీచర్

వీరికి సాటెవ్వరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కత్తి పడితే వీరికి తిరుగుండదు. యుద్ధవిద్యలో ఈ చిన్నారులు చిచ్చరపిడుగుల్లా విజృంభిస్తారు. కలరిపయట్ట్టుకు నెలవు కేరళ. కాని ఈ యుద్ధవిద్యే నేడు బెంగళూరుకు చిరునామాగా మారింది. ఈ పట్టణానికి చెందిన ఈ చిన్నారులు యుద్ధ్భూమిలోకి దిగితే చాంపియన్స్‌గా నిలవటం ఖాయం. ఆడపిల్లలు సైతం ఈ యుద్ధకళలో రాణిస్తున్నారు. కలరిపయట్టులో వీరికున్న నైపుణ్యమే వీరిని విజేతలుగా నిలిచేటట్లు చేస్తోంది.
ఆరేళ్లకే కత్తిపట్టింది..
ఎనిమిదేళ్ల దుర్గా రవికృష్ణ ఆరేళ్ల వయసులోనే కత్తిపట్టింది. ఈ యుద్ధకళలో నైపుణ్యం సంపాదించటం కోసం వారంలో కనీసం పది గంటల పాటు ప్రాక్టీస్ చేస్తుంది. కలరిపయట్టు కళ అంటే దుర్గకు ప్రాణం. కర్నాటక రాష్రం నుంచి యువ కళాకారిణిగా పాల్గొనటమే కాదు జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని సైతం సొంతం చేసుకుంది. లక్నోకు చెందిన కలరి ఫెడరేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో బెంగళూరు నుంచి ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ఏడుగురు బంగారు పతకాలను, ఒకరు కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. దుర్గ అక్క మీరా వయసు పదమూడేళ్లు. ఈమె కూడా బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మీరా ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. చెల్లెలు దుర్గ బాల్డ్విన్ బాలికల పాఠశాలలో చదువుతుంది. మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే విజేతలుగా నిలవటం ఖాయం అని మీరా చెబుతుంది.
ఏడేళ్ల నుంచి శిక్షణ..
పద్నాలుగేళ్ల గౌరవ్ ఆర్. చవాన్ ఏడేళ్ల నుంచి కలరిపయట్టులో శిక్షణ తీసుకుంటున్నాడు. బంగారు పతకాలు పొందిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు.
మంచి ఆహారం, ప్రతిరోజూ ప్రాక్టీస్ తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతాడు. నేను ఈ పోటీల్లో పాల్గొనే ముందే గెలుస్తామని నమ్మాను. ఎందుకంటే ఎన్నో కష్టాలను ఒర్చుకుని ప్రతిరోజూ ప్రాక్టీస్ చేశాం. అందుకే చాంపియన్‌షిప్ సాధించాం. డైట్‌ను కంట్రోల్ ఉంచుకోవటం ఈ కళకు ఎంతో అవసరం. సృజనాత్మకమైన కళ ఇది అని అంటుంది వైష్ణవి. శరీరక శక్తి, పటుత్వం వస్తుంది కాబట్టే ఈ కళను ఇష్టపడుతున్నాను. చాంపియన్ షిప్ సాధించాలని ఎంతో కష్టపడ్డాం. రోజూ కనీసం నాలుగు గంటలు ప్రాక్టీస్ చేశాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని 13 ఏళ్ల శ్రీపాద సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
రంజన్ ముల్లారట్ట గురువు
ఈ చిన్నారులు గురువు రంజన్ ముల్లారట్ట. కేరళకు చెందిన ఈయన బెంగళూరులో స్థిరపడ్డారు. తనకు వచ్చిన ఈ యుద్ధవిద్యను నలుగురికి అందించాలనే సంకల్పంతో 19 ఏళ్ల క్రితం శిక్షణ ఇవ్వటం ఆరంభించారు. దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ఈయన వద్ద శిక్షణ తీసుకునాను . ప్రతి ఏడాది ఈయన వద్ద శిక్షణ తీసుకున్న విద్యార్థులే చాంపియన్ షిప్ సాధించటం విశేషం. ఇప్పటి వరకు 18 మెడల్స్ సాధించారు. ఇది తమకెంతో గర్వకారణం అని రంజన్ అంటారు. కలరిపయట్టులో బెంగళూరు కేరళను మించిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. నలుగురు నడిచే దారిలో కాకుండా తనకంటూ ఓ దారిని ఏర్పరుచుకుని యుద్ధవిద్యలో ఈ చిన్నారులు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకం అనటంలో ఎలాంటి సందేహం లేదు.