సబ్ ఫీచర్

అమ్మ పెట్టిన భిక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచంలో నేను అమితంగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మే! నాకు తెలుసు నేను పుట్టడానికి ముందు ఆమె ఎన్ని ఉపవాసాలు చేసిందో, ఆ సర్వేశ్వరుడికి ఎన్ని మొక్కులు మొక్కిందో. యోగినిగా మారిన ఆమె నుంచే ఆధ్యాత్మిక సాధనలు నేర్చుకున్నాను. ఎన్నో బాధలు అనుభవిస్తూ కూడా ఆమె పంచిన ప్రేమే నాకు ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించింది. అమ్మకు సదా రుణపడి ఉన్నాను. ఈ జీవితం మా అమ్మ భువనేశ్వరీదేవి ప్రసాదించిన భిక్షే!

వివేకానందుని తల్లి భువనేశ్వరి దేవి. ఆమెకు నరేంద్రుడి మీద ఎంత ప్రేమో, నరేంద్రుడు తల్లిని అంతకుమించి ప్రేమించేవాడు. ‘‘ఈ ప్రపంచంలో నేను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి నా తల్లి’’ అంటూ తల్లి పట్ల తన మహోన్నత ప్రేమను వ్యక్తీకరిస్తారు స్వామి వివేకానంద. 775 స్వామి లేఖలు ప్రచురింపబడ్డాయి కాని ఏ లేఖలో కూడా, తన తల్లికి లేఖ వ్రాసినట్లు కనిపించదు. కాని 1898 నవంబరు 22వ తేదీన స్వామివారు ఖేత్రి మహారాజు అజిత్‌సింగ్‌కు రాసిన లేఖ ఆయన మాతృప్రేమ ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ఆ లేఖలో ‘‘నా జీవితంలో మిమ్మల్ని మాత్రమే మిత్రునిగా భావించాను. అందువలన నా భావాలను స్పష్టంగా చెప్పుచున్నాను. లోకోద్ధరణకు పూనుకొని కన్నతల్లిని అలక్ష్యం చేశానన్న బాధ ఎక్కువగా ఉంది. నా చివరి కోర్కె ఒక్కటే. నా మాతృమూర్తి వద్ద వుంటూ సేవ చేయడం. దానివల్ల ఆమె శేష జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పూరి గుడిసెలో వుంటున్నారు. ఆమెకు ఒక చిన్న గది నిర్మించాలనుకుంటున్నాను. నా స్వంత పనులకోసం ఇప్పటివరకూ ఎవ్వరినీ ఏమీ అడుగలేదు. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఈ ఉపకారం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఐరోపా నుండి నాకు అందిన డబ్బును అంతటిని శ్రీరామకృష్ణా మిషన్ కార్యక్రమాలకు వినియోగించడం జరిగింది. ఇందులోని ప్రతి అక్షరం ఆర్ద్రప్రపూర్ణం. స్వామికి తల్లిపట్లగల అపార ప్రేమకు నిలువుటద్దం. ఇది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి.
అలాగే స్వామిజీ 17-01-1900న తన అమెరికన్ శిష్యురాలు ఓబెల్‌కు రాసిన లేఖాంశాలు కూడా చిరస్మరణీయాలు. ‘‘నా తల్లి నాకోసం ఎన్నో కష్టాలు అనుభవించింది. ఆమె చివరి రోజులు ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించాలి. ఆదిశంకరులు అదే రీతిలో తన తల్లికి సేవలందించారు’’ అని వ్రాశారు. తల్లి కోరిక మేరకు వివేకానందులు ఆమెను ఢాకాలోని చంద్రనాధ్ ఆలయానికి, అస్సాంలోని కామ్యాఖ్య క్షేత్రానికి, పూరి జగన్నాధ క్షేత్రానికి తీసుకువెళ్ళారు. మాతృప్రేమ ద్వారా లోకోద్ధరణ జరుపవచ్చు అనే సందేశాన్ని తన ఆచరణ ద్వారా లోకానికి ప్రసాదించారు. అందుకే భరతమాత అనుంగు పుత్రుడు స్వామి వివేకానందుడు.
కనుక యువత తప్పక స్వామి వివేకానంద అఖండ స్ఫూర్తిదాయకమైన సాహిత్యాన్ని చదివి, ఆచరించటం ద్వారా, భరతమాత సేవకు కృతనిశ్చయంతో ఉద్యుక్తులౌతారని ఆశిద్దాం.

-పి.పాండురంగరావు