సబ్ ఫీచర్

మాటే మంత్రం.. వింటే వివేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతజాతికి నిత్యస్ఫూర్తిని కలిగిస్తున్న స్వామి వివేకానంద మాటలు నవజీవన పాఠాలు. జీవన సత్యాలను చెప్పిన మంత్రాలు. దేశభవితకు యువత ఎంత కీలకమో, సమర్థులైన వందమంది యువకులతో దేశం రూపురేఖలనే మార్చేస్తానన్న ఆయన మాటల్లో, పలుకుల్లో కనబడిన శక్తి ఇప్పటికీ స్ఫూర్తినిస్తోంది. మార్గదర్శనం చేస్తోంది. నా శిష్యుడు మావిటి హరినాథ్ బహుకరించిన ‘ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద’ పుస్తకాలను చదివిన తరువాత, క్రైస్తవ వనిత విమల స్వామి వివేకానందను గూర్చి బోధించినప్పుడు ఆయన గొప్పదనం మనసులో పదిలమైంది. యువత అంటే ఆయనకు ఇష్టం. యువతరంపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన చెప్పిన మాటలు వారికి శక్తిని, స్ఫూర్తిని రగిలిస్తాయి. ఈ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయక మంత్రాల్లాంటి మాటలను మననం చేసుకుందాం. ‘్భరతమాత వేలాది యువకుల త్యాగాన్ని ఎదురు చూస్తోంది, వలసింది వారి మనోబలం, పశుబలం కాదు. వలసింది శాంతము, నిరాడంబరమూ, అచంచలమూ అయిన కృషి - అంతేకాని పేరుప్రతిష్ఠలకై ఉబలాటం కాదు- ఇది యువత గుర్తుంచుకోవాలి’ అని ఆయన చెప్పారు. ‘యువకులారా దరిద్రులను, దీనులను, అజ్ఞానులను లేవనెత్తి రుూ సానుభూతిని ఈ కార్యదీక్షను, ఈ పోరాటాన్ని స్థిరాస్థిగా మీకు ఒసగుతున్నాను. భగవంతుడే మన నాయకుడు. ముందుకు సాగిపోండి’ అని ఉత్తేజపరిచారు. భారతీయుల దుర్భర దారిద్య్రం, విద్యావిహీనత, స్వామి కళ్లముందు ప్రత్యక్షంగా గోచరిస్తూంటే, ‘‘అన్నమో రామచంద్రా..అని విలపించే ఆర్తులకు మతబోధలు ఎందుకు’’? అని ప్రశ్నించిన వివేకానందుడు విద్యాదానం, శీలనిర్మాణంతో జాతి బలపడుతుందని చెప్పారు. ‘మీ విద్యార్థుల శీలం వజ్రతుల్యం చేయండి, అర్హులైన యువకులను నాకు సమకూర్చగలరా? అలా సమకూరిస్తే ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తాను’ అని ఆయన అన్నారు. ‘‘నా మానసికాభ్యుదయానికి మా తల్లే కారణం’’ అన్నారు వివేకానందుడు. ‘‘ఏ విషయాన్నీ పుస్తకంలో వ్రాశారని నమ్మవద్దు’ అంటారాయన. ‘ఓ భారతీయులారా! పాశ్చాత్యానుకరణలో కాస్త కీడేదో, మేలేదో వివేకంతో, విచక్షణతో, శాస్త్ర ప్రమాణాలతో నిర్ణయించుకోండి, వీరభారత పుత్రా! ధైర్యం వీడకు, నేను భారతీయుణ్ని, భారతీయుడు నా సోదరుడు, నా ప్రాణం’ అన్న ఆయన మాటలు మన మనసులను తాకుతాయి. ‘ఆత్మ స్వాతంత్య్రాన్ని అరికట్టకు, అజ్ఞానం నుంచి బయటకురా’ అని యువతకు చెప్పిన మాట ఇప్పటికీ ఓ హెచ్చరికే. గాత్రంలో ఆయన దిట్ట. హార్మోనియం, ఫిడేలు వాద్యాలను బాగా వాయించేవారట. నిద్రను త్యాగం చేసి చదువుల సరస్వతిని నిరంతరం ఆరాధించే వివేకానందుడు విద్యార్థినీవిద్యార్థులకు ఆదర్శం. యువకులకు ఆయన ఇచ్చిన మరో సందేశం నేటి కాలమాన పరిస్థితుల్లోనూ అనుసరణీయమే. ‘‘నా మాటల్లో మీకు గురి ఉంటే మొదట నువ్వు నీ గది తలుపులు తెరి, మూసుకున్న కళ్లు విప్పి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను పరికించు. నీ ఇరుగుపొరుగులో వందలాదిమంది దీనులు, నిస్సహాయులు పడి ఉన్నారు. నీ శక్తి మేరకు వారిని సంరక్షించు, రోగులకు మందులిచ్చి సేవించు. మనశ్శాంతికి ఇదే మార్గం’’ అన్నారు. వివేకానందుడి జయంతి సందర్భంగా ఆయన మాటలు గుర్తుకుతెచ్చుకుని ఆచరించే ప్రయత్నం చేయడం మనం అర్పించే నివాళి.

-పరిమి శ్యామలారాధాకృష్ణ