సబ్ ఫీచర్

ముగ్గుల్లో వైవిధ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి నెలపట్టడం ఆలస్యం వేకువజామునే నిద్రలేచి, చలిగాలి వణికిస్తున్నా.. కనుమ రోజు వరకు మహిళలు ముంగిట ముత్యాల ముగ్గులతో తీర్చుదిద్దుతారు. ‘తీరైన సంపద ఎవరింటనుండు.. దినదినము ముగ్గున్న లోగిళ్లనుండు’ అన్నట్లుగా పెద్ద పెద్ద రంగవల్లులను వేసి వాటిపై ఆవుపేడతో చేసిన గొబ్బిళ్లు పెట్టి గొబ్బెమ్మలపై పసుపు, కుంకమలు, బంతులు, చేమంతులు పెట్టి అందంగా అలంకరిస్తారు. పూజలు చేస్తారు. కనె్నపిల్లలు మంచి భర్త లభించాలని కోరుకుంటూ గొబ్బి పాటలు పాడతారు. నెలంతా వివిధ రకాల ముగ్గులు వేసినా ప్రత్యేకంగా పండుగు మూడు రోజులూ వేసే ముగ్గుల్లో వైవిధ్యం కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణాల్లోనూ ఇప్పటికీ ఆనవాయితీగా వేస్తున్నవారు ఉన్నారు. భోగి రోజున వేసే ముగ్గును ‘గదుల ముగ్గు’ అని అంటారు. సంక్రాంతి పురుషుడైన సంకురమయ్య ఆ గదులలో సంచరిస్తాడని భావిస్తారు. సంక్రాంతి రోజున గజిబిజి గదుల ముగ్గు వేస్తారు. అలిసిపోయిన సంకురుమయ్య విశ్రాంతి తీసుకుంటాడని భావన. కనుమనాడు పెద్ద రథం ముగ్గు వేసి రథానికి తాడు లాగి సంకరుమయ్య ప్రయాణానికి సిద్ధం చేస్తారు. ముక్కనుమనాడు ఈ రథం తాడుని పక్కంటి రథం తాడుకి కలిపి సంక్రాంతి పురుషుడిని సాగనంపుతారు. అక్కడితో ముగ్గుల పండుగ పూర్తవుతుంది. ఈ నెలరోజులూ ముగ్గులు వేశాక అర్థచంద్రుడిని వేయడం కూడా ఓ ఆనవాయితీ. సంక్రాంతి పండుగ అయిన మరుసటి రోజు నుంచి గుమ్మాల ముందు సంజె ముగ్గులు ప్రారంభమవుతాయి.

-ఎస్.ఇందిరాఅరవింద