సబ్ ఫీచర్

నవ్యకాంతులు వెదజల్లే సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయులు జరుపుకొనే పండుగలలో ముఖ్యమైనది.. పెద్దపండుగగా చెప్పు కునేది ‘సంక్రాంతి’ ఇదే ‘పెద్దల పండుగ’ కూడా...
పెద్దలను స్మరించుకొని, వారికి తర్పణములు, పిండ ప్రదానములు జరిపే రోజు సంక్రాంతి. సం, క్రాంతి- అను రెండు సంస్కృత పదముల కలయికతో ఏర్పడేది సంక్రాంతి. ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే పరివర్తనము. మనిషిలో మంచి పరివర్తనము కలిగించడమే ‘సంక్రాంతి’ పరమార్థము.
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు మకరరాశిలోనికి పరివర్తనం చెందే రోజు సంక్రాంతి. మకర సంక్రమణమే సంక్రాంతి ఇక నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమన్నమాట. సంక్రాంతికి క్రొత్త పంటలు చేతికొచ్చి రైతులు నివసించే పల్లెలు కళకళలాడుతుంటాయి. నిన్నటి దాకా ధనుర్మాసం తిరుప్పావై పూజలు పాటలు గోదాదేవి కల్యాణంతో ముగుస్తాయ. సంక్రాంతి రోజు స్ర్తిలకు నోముల పండుగ, కుటుంబసౌఖ్యం, అన్యోన్య దాంపత్యం ఆశించి స్ర్తిలు చేసే నోములు ప్రత్యేకతను సంతరించుకుంటాయ. బుడుబుక్కలవాళ్లు పాటలు దాసరుల వైష్ణవ సంకీర్తనలు, జంగందేవర శైవనామాలు, గంగిరెద్దుల వాళ్ల ఆట పాటలు, సన్నాయి మేళాలు, విప్రవినోదులు, అర్థనారీశ్వర కథలు, పటం కథలు ఇలాంటి వన్నీ ప్రదర్శించే జానపద కళాకారులను గౌరవించే పండుగ సంక్రాంతి.
మకర సంక్రాంతి రోజు శబరిమలై అయ్యప్ప ఆలయంలో స్వామిని ఆభరణాలతో అలంకరించి, హారతి ఇచ్చే సమయంలోనే, ఆలయానికి ఈశాన్య దిశలో ఉండే పర్వతాలపై మకరజ్యోతి దర్శన మిస్తుంది. స్వామి అయ్యప్పకు దేవతలు, ఋషులు ఇచ్చే హారతియే ఈ మకరజ్యోతి అని భక్తులు భావిస్తారు, విశ్వసిస్తారు. ఈ జ్యోతి దర్శనం ఎన్నోజన్మల పుణ్యఫలంగా భావిస్తారు.
సంక్రాంతి రోజు బొమ్మల కొలువులు, గాలి పటాల ఎగురవేయడాలు, బొంగరాలు తిప్పడాలు ఇలాంటివి పిల్లల ప్రత్యేకతలు.. పిన్నపెద్ద తేడా లేకుండా కొత్త్ధాన్యంతో అరిసెలు, పొంగలి, పులగం మొదలైన పిండివంటలు వండి పదిమందితోకలిసి పంచుకుని తిని సంక్రాంతి రోజు ఆనందిస్తారు.
కనుమపండుగ పశుగణాన్ని పూజించే రోజు. పశువుల కడిగి, ఒళ్ళు నిమిరి, నీరు త్రాగించి, వాటిని ఆనందింపజేసి, వాటియెడ తమ కృతజ్ఞతను ప్రకటించే రోజు ఇది. వాటిని అలంకరించి పశువులను పూజించడమే కనుమ ప్రత్యేకత. ఎడ్లు కట్టిన బండ్లను ఊరు ఊరంతా తిప్పుతారు. జాజు, సున్నం పట్టీల అలంకరణతో ఈ బండ్లు ఎంతో కన్నుల పండువుగా ఊరేగింపులో పాల్గొంటాయ. కోడి, పొట్టేళ్లు, ఎద్దుల ల్లాంటి పశువులకు పందేలు కూడా నిర్వహిస్తుంటారు. ఇలా మూడు రోజులు ముచ్చటగా సంక్రాంతిని జరుపుకుంటారు.

- దాసరి రాణి