సబ్ ఫీచర్

‘దూరవిద్య’లో సెమిస్టర్ అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గడప ముందుకు డిగ్రీ విద్య’ అనే నినాదంతో దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం అధికారుల నిర్ణయాల వల్ల ‘దూరవిద్య’ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెగ్యులర్ డిగ్రీ కాలేజీల్లో రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానం ఇంకా కష్టాలు కన్నీళ్లతోనే గడుస్తున్నది. రెగ్యులర్ డిగ్రీ కళాశాలల్లో మంచి ఫలితాలు లేక డిగ్రీ చదువు మాకొద్దు అని విద్యార్థినీవిద్యార్థులు ఓ పక్క లబోదిబోమంటూండగా ‘సందట్లో సడేమియా’ వలె డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2017-18 నుండి చాయిస్ బేస్‌డ్ క్రెడిట్ ఎడ్యుకేషన్ విధానానికి శ్రీకారం చుట్టడంలో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు.
1982లో హైదరాబాద్‌లో దేశంలోనే తొలి దూరవిద్య (అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ’ విశ్వవిద్యాలయం మొదలైంది. లక్షలాదిమంది కాలేజీకీ, విశ్వవిద్యాలయానికి వెళ్లలేనివారికి ఉన్నత విద్య అవకాశాలు అందించి దేశంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా పేరుపొందింది. ప్రింట్ మెటీరియల్ ఇస్తూ, చక్కని కౌన్సిలింగ్ కాంటాక్ట్ తరగతులను అందించడమేగాక రేడియో, టెలివిజన్, ఆడియో, వీడియో కేసట్ల ద్వారా విద్యబోధన చేస్తున్నారు. ఆదివారాల్లో కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించి రెగ్యులర్ డిగ్రీ, పీజీ చదువుకు సరిసమానంగా విజ్ఞానాన్ని, సర్ట్ఫికెట్లను ఇస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 215 అధ్యయన కేంద్రాలు, 23 ప్రాంతీయ అధ్యయన కేంద్రాలు, 23 ప్రాంతీయ అధ్యయన కేంద్రాల ద్వారా సుశిక్షుతులైన కౌన్సిర్ల ద్వారా క్లాసులు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా సిబిసిఎస్ విధానం ప్రవేశపెట్టారు. ఉద్యోగ నైపుణ్యాలను కల్పించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంస్కరణలు, విద్యారంగంలోని మార్పులు ‘దూరవిద్య’కి అవసరమా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
సిబిసిఎస్ లేనపుడు సంవత్సరానికి 25 కాంటాక్టు క్లాసుల ద్వారా విద్యార్థికి తగిన విద్యా పరిజ్ఞానాన్ని కౌన్సిలర్లు అందించేవారు. ఇంటరాక్షన్ విధానం ద్వారా ప్రతి కౌన్సిలర్ 25 కాంటాక్టు క్లాసులలోనే సిలబస్ పూర్తి చేసేవారు. ఉద్యోగ బాధ్యతలు ఉన్నవారు, పదోన్నతుల కోసమే డిగ్రీ, పీజీ కోర్సులు ‘ఓపెన్’ విశ్వవిద్యాలయాలలో చదివేవారు. క్లాసులకు 40 శాతం మంది మాత్రమే హాజరై వంద మార్కుల పేపర్‌ను రాసి పాసు అయ్యేవారు. కొన్నిసార్లు కాంటాక్టు క్లాసుకి హాజరుకాని దూరవిద్య అభ్యర్థి వార్షిక పరీక్షలు రాసి వంద మార్కుల పేపర్‌కు 60 మార్కులు తెచ్చుకొని, లబ్ది పొందేవారు. ‘ఓపెన్’ విద్యలో ‘హాజరు’కు ప్రాధాన్యం లేనందువల్ల ‘సెల్ఫ్ స్టడీ’ ద్వారా కూడా మంచి ఫలితాలు పొందేవారు. ఇప్పుడున్న సబ్జెక్టులు విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం లేదని ఉద్యోగం వచ్చే చదువు కావాలని, చాయిస్ బేస్‌డ్ క్రెడిట్ సిస్టమ్ (సిబిసిఎస్)ను ప్రవేశపెట్టారు. రెగ్యులర్ డిగ్రీ, పీజీ కాలేజీకైతే ఏమోకాని దూరవిద్యకు ఈ విధానం అవసరమా అన్నది ప్రశ్న. ఈ విధానంలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో మూడేళ్లలో మూడు పరీక్షలు రాస్తే అభ్యర్థి డిగ్రీ పట్ట్భద్రుడు అయ్యేవాడు. ఇప్పుడు మూడేళ్ల చదువును 6 సెమిస్టర్ల ద్వారా పాసుకావాలి. ప్రతి ఆరునెలలకు ఒక సెమిస్టర్ ఉంటుంది. వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం చేసేవారు దూరవిద్య పరీక్షల కోసం ఏటా 5 లేదా 8 రోజులు ‘సెలవు’ పెట్టి వార్షిక పరీక్షలు రాసి పట్టాలు సులభంగా పొందేవారు. దేశంలో అన్ని యూనివర్శిటీలకన్నా అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయానికి విద్యార్థులు క్యూ కట్టేవారు.
సిబిసిఎస్ విధానం అమలు చేస్తున్న విశ్వవిద్యాలయం ఆరు నెలల ముందే పాఠ్య పుస్తక రచయితలను ఎంపిక చేసి కొత్త కోర్సు పాఠ్య పుస్తకాలను ముద్రించవలసి ఉంది. డిక్రీ మొదటి సెమిస్టర్ కాంటాక్టు క్లాసులు ముగిసినప్పటికీ, ఇప్పటికీ మారిన మొదటి సెమిస్టర్ పాఠ్య పుస్తకాలు అన్నీ మార్కెట్‌కు విడుదల కాలేదు. కనీసం ఎప్పుడు ముద్రిస్తారో తెలియదు. మొదటి సెమిస్టర్ పరీక్షలు డిసెంబరు నెలలో పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా పరీక్షల ప్రస్తావన రాలేదు. మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుపకుండా జనవరి 6 నుండి సెకండ్ సెమిస్టర్ క్లాసులు నిర్వహించమని ఆదేశించినట్లు సమాచారం. మొదటి సంవత్సరంలో గతంలో 24 క్లాసులు ఉండగా, మొదటి, రెండవ సెమిస్టర్‌లలో కలిపితే పది క్లాసులు కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లాసుల సంఖ్యను 24 నుండి పదికి తగ్గించడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ కోర్సు పూర్తి కావాలంటే విద్యార్థి 160 కెడ్రిట్ల కోర్సులను చదువుకోవాల్సి ఉంటుంది. మొదటి నాలుగు సెమిస్టర్‌లలో ప్రతి సెమిస్టల్‌కు 25 క్రెడిట్ల చొప్పున చదవవలసి ఉంటుంది. ఐదు, ఆరు సెమిస్టర్‌లలో 30 క్రెడిట్ల చొప్పున చదవవలసి ఉంటుంది. అసలే దూరవిద్య ‘ఆదివారం చదువు’. దీనికి సెమిస్టర్ అవసరమా? అని డిగ్రీ చదివే విద్యార్థుల భావన. మొదటి, నాల్గవ సెమిస్టర్‌లలో ప్రతి ఐచ్ఛిక సబ్జెక్టుకు 5 క్రెడిట్లు, ఇతర భాషా, స్కిల్ కోర్సులకు మూడు, రెండు క్రెడిట్లు ఉంటాయి. విద్యార్థి మొదటి సెమిస్టర్ నుండి నాల్గవ సెమిస్టర్ వరకు ప్రతి సెమిస్టర్‌లో మూడు ఐచ్ఛిక సబ్జెక్టులు 4 ఇతర చిన్న సబ్జెక్టులు చదవాల్సి ఉండటంతో దూరవిద్య అభ్యసించేవారు గందరగోళానికి గురవుతున్నారు. ఐదు, ఆరు సెమిస్టర్లలో పూర్తిగా 6 ఐచ్ఛిక సబ్జెక్టులనే చదువాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. గతంలో డిగ్రీ చదివే విద్యార్థి మొదటి సంవత్సరం తెలుగు, ఆంగ్లం, సాంఘిక శాస్త్రాలను తప్పక పరీక్ష రాసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మొదటి సంవత్సరమే విద్యార్థి ఐచ్ఛికాలు (ఆప్షనల్స్) ఎంపిక చేసుకోమని అంటున్నారు. ఇందులో మూడు రకాలైన కోర్సులు ఉంటాయి. అవి కోర్ సబ్జెక్టులు. ఎలక్టివ్ సబ్జెక్టులు. ఎబిలిటి ఎన్‌హాన్స్‌మెంట్ కంపల్సరీ కోర్సులు. ప్రతి విద్యార్థి డిగ్రీ పూర్తి చేయడానకి 40 రకాల కోర్సులను ఎంచుకోవాలని సూచించడంతో అసలుకే మోసం వచ్చింది. చాలా పాఠ్య పుస్తకాలు ముద్రణ కాలేదు. మొదటి సెమిస్టర్ క్లాసులు పూర్తి అయిన ఎగ్జామ్ తేదీ ఇంకా ఖరారు కాలేదు.
పద్ధతి ప్రకారం ఉన్న కోర్సులను సిబిసిఎస్ కింద సెమిస్టర్లుగా మార్చడం వల్ల క్లాసులోనే 40 రకాల విద్యార్థులు ఉంటున్నారు. 20మంది కన్నా ఎక్కువ విద్యార్థులు ఉంటేనే, కౌన్సిలర్‌ను క్లాసులు చెప్పటానికి అనుమతిస్తారు. ఎక్కువ సబ్జెక్టులను ఎంపిక చేసుకొనే అవకాశం ఇవ్వడంతో ఏ సబ్జెక్టుకు పదిమంది విద్యార్థులు లేరు. దీనితో రెండు రాష్ట్రాల్లో ఉన్న కౌన్సిలర్లు బజారున పడ్డారు. కోర్సుల్లో విద్యార్థులు అడ్మిట్ అయితేనే క్లాసులు ఇస్తామని విశ్వవిద్యాలయం చెబుతోంది.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెగ్యులర్ డిగ్రీ కళాశాలల్లోనే సెమిస్టర్ విధానం ఫలవంతం కాలేదు. రెగ్యులర్ డిగ్రీ అధ్యాపకులకే రెండు ఏళ్లు గడిచినా సిబిసిఎస్ విధానం అంటే తెలియడం లేదు. వారానికి ఒక క్లాసు జరిగే ఓపెన్ చదువుకు ఇది అవసరమా అని విద్యార్థులు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాలు దూరవిద్య విధానంలో ఎన్నో రకాలైన కోర్సులను నిర్వహిస్తున్నప్పటికీ అవి ఇంకా సీబీసీఎస్ పద్ధతి ప్రవేశపెట్టలేదు. పూర్తిగా సన్నద్ధంకాకముందే హడావిడిగా, సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ఓపెన్ విశ్వవిద్యాలయం తన విద్యార్థుల సంఖ్యను తగ్గించుకున్నది. ఉద్యోగం, ఉపాధి రంగాల్లో పనిచేస్తూ చదివేవారు ప్రతి సెమిస్టర్‌కు సెలవులు పెట్టి పరీక్షలు రాయడం కష్టమని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు.

-రావుల రాజేశం