సబ్ ఫీచర్

పిల్లలకు ఏది ఇష్టం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు ఐదేళ్ల వయసు నాటికి వారిలో మెదడు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఐదో ఏట నుంచి వారిలో అసలైన శారీరక వృద్ధి ఆరంభమవుతుంది. ఇందుకోసం వారిలో తగినంత రక్త సరఫరా జరిగేందుకు వీలుగా ఐరన్ సప్లిమెంట్లను ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ తల్లిదండ్రులు ఐరన్ ఉండే పోషక విలువలు ఉన్న ఆహారం ఇవ్వకుండా నోటికి రుచిగా ఉండే శాండ్‌విచ్‌లు, నూడుల్స్, కాండీలు, చాక్లెట్లు ఇస్తున్నారు. వీటి వల్ల పిల్లల్లో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఫలితంగా శారీరక పెరుగుదలకు హాని కలుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాసెస్ చేసిన, వేయించిన ఫుడ్ పెట్టడం వల్ల పేగు సంబంధిత సమస్యలకు సైతం దారితీస్తుంది. సాధారణంగా పిల్లల్లో విటమిన్ డి3 (ఎముకలకు), బి3(నరాలకు), బి12 (కండరాలకు), ఐరన్ (రక్తానికి) చాలా అవసరం. పిల్లలు ఎదిగే క్రమంలో వారికి విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆహారం అందేలా శ్రద్ధ తీసుకోవాలి. కనీస పోషకాలైన కాల్షియం, ప్రొటీన్స్, ఐరన్, విటమిన్స్‌తో కూడిన సమతులాహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది.
ధాన్యాలు: ఆహారంలో ధాన్యాలు తప్పనిసరి. వీటిలో ఉండే పోషకాలు, శక్తి అనేవి పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. తృణ ధాన్యాలతో బ్రెడ్స్, ఓట్స్, బియ్యంతో చేసిన పదార్థాలు ఉంటే మంచిది. పంచదార అధికంగా ఉండేవి, శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్నవి, ఉప్పు లేదా సోడియం, కేక్స్, బిస్కట్లకు పిల్లలను వీలైనంత దూరం ఉంటే మంచిది.
పండ్లు, కూరగాయలు: నీరు, విటమిన్స్, మినరల్స్, పీచు (ఫైబర్) ఉండే పండ్లు, కూరగాయలను రోజులో ఐదు భాగాలుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఫ్యాట్స్, నూనెలు: చిన్న పిల్లలు, టీనేజ్ వయసులో ఉన్నవారికి కొవ్వులు, నూనె పదార్థాలు ఎంతో అవసరం. చిన్నారుల మానసిక వృద్ధికి ఇవి దోహదం చేస్తాయి. కొవ్వు అన్నది మన శరీరంలో ఇంధనం వలే పనిచేస్తుంది. ఫ్యాట్‌లో కరిగే విటమిన్ ఎ,డీ,ఈ,కేలను శరీరం గ్రహించేలా చేయగలదు. కొవ్వుతో కూడిన పదార్థాలు అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, స్థూలకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వీటిని తగినంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నట్స్, అవొకాడో, కార్న్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్‌ను ఇందుకు ఎంచుకుంటే మంచిది.
పాలు, పాల పదార్థాలు: పోషకాలకు నెలవు పాలు, పాల పదార్థాలు. వీటిలో విటమిన్ ఎ,డి,బి1,బి2,బి12 విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. చిన్నారులు, యుక్త వయసులోకి వచ్చిన వారికి పాలు చాలా అవసరం. ఎముకల వృద్ధికి క్యాల్షియం అందుతుంది.
మాంసం,బీన్స్: మాంసం, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, బఠానీలు, గుడ్లు తదితరవన్నీ కూడా పోషకాలకు నెలవు. మాంసం విటమిన్ బి12, ఐరన్ నిల్వలకు కేంద్రం. ఐరన్ అధికంగా ఉండటంతో అనీమియా నిరోధించడానికి దోహదం చేస్తోంది. ఎక్కువ మంది పిల్లల్లో కనిపించేది ఇదే. రక్తహీనత కారణంగా నీరసంగా పాలిపోయినట్లు కనిపిస్తారు. శాకాహారులైతే మాంసానికి ప్రత్యామ్నాయంగా సోయా, బీన్స్, గుడ్లు, పాలు, జున్ను, పెరుగు, పుట్టగొడుగులు, నట్స్, సీడ్స్‌ను వాడుకోవచ్చు.
పాలు ఎంత మోతాదులో తీసుకోవాలి?
రెండు నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు రెండు కప్పుల పాలు (480 ఎంఎల్) ఇవ్వాలి. తొమ్మిదేళ్లు దాటిన వారికి మూడు కప్పులు (720 ఎంఎల్) ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. కొవ్వు తీసిన పాలు, ఒక శాతం ఫ్యాట్ ఉన్న పాలను ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు: చిన్నారులకు అనారోగ్యంగా ఉన్నపుడు కడుపు మాడ్చకూడదు. శక్తితో కూడిన ధాన్యాలు, పాలు, ఉడికించిన కూరగాయలు కొంచెం చొప్పున ఎక్కువ సార్లు అందించాలి. పుష్కలంగా నీరు, ద్రవ పదార్థాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. డీహైడ్రేషన్ రాకుండా అవసరమైతే ఓరల్ రీహైడ్రేషన్ ద్రావకాన్ని తాగించాలి.