సబ్ ఫీచర్

మానవాభ్యుదయానికి మంగళతోరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్ణువు కొడుకు బ్రహ్మ, బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, అతిథి కశ్యపుల కొడుకు సూర్యుడు. సూర్యుణ్ణే ఆదిత్యుడు అంటారు. కశ్యప మహర్షికి అదితి- దితి ఇద్దరు భార్యలు. అదితికి దేవతలు, దితికి దైత్యులు జన్మించారు. అధికారం కోసం ఇరువురి మధ్య వైరం వచ్చింది. దేవతలకు ప్రాణ సంకటం వచ్చింది. ఇది గమనించి అదితి కశ్యపులు సూర్యశక్తిని ఉపాసించారు. సూర్యుడు ప్రత్యక్షమై వారిని వరం కోరుకోమన్నాడు. అదితి దేవతలను కాపాడుమన్నది. సూర్యుడు అభయం ఇచ్చాడు. విశ్వమంతటా వ్యాపించి యున్న నా తేజస్సును వెయ్యి కిరణాలుగా చేర్చి నీ గర్భంలో స్థాపించెదను. పిదప దేవరూపమున జన్మించి నీ సంతానముల కష్టము తొలగించెదను అని చెప్పాడు. సూర్యశక్తి ఆమె గర్భంలో చేరింది. అదితి గర్భం దాల్చినది. తన సంతానానికి మేలు కలగాలని వ్రతాలు చేస్తుంటే భర్త కశ్యపుడు కోపించి, ఉపవాసాలు చేస్తుండడం మంచిది కాదు, గర్భస్థ శిశివును బలహీనుని చేయకుమన్నాడు.
శాంతంగా అదితి సమాధానం యిస్తూ, స్వామీ ఈ గర్భాండం సూర్యశక్తి ప్రసాదం. ఇది వైరులను సంహరిస్తుంది. దీని తేజాన్ని పరాక్రమాన్ని చూడండని అదితి అపానవాయువేగం చేత తన గర్భాండము పరిత్యాగం చేసింది. ఆ తేజంవలన బ్రహ్మండములో నిప్పులు రేగాయి. ముని వేద మంత్రాలతో గర్భాండమును స్తుతించాడు. అండం పగిలి దాని నుండి ఒక సుదర్శన బాలుడు జన్మించాడు. ఈ బాలుడే సూర్య నామముతో దేవతల నాయకుడైనాడు. దేవతలకు విజయం లభించింది. విశ్వనియంత అయినాడు. శివుడు సూర్యునిగాంచి సప్తాశ్వవాహనా నీవు శుభాల నొసగే కాశీపురం వెళ్లమన్నాడు. ఈ జగతిలో ఎన్ని జీవరాసులున్నాయో వాటి చేష్టలన్నియో నీకు తెలుసు. అందుకే నిన్ను లోకచక్షువంటారు. సూర్యుడు కాశీ వెళ్ళాడు. ధర్మమయమైన కాశీనగరంలో ఉండాలనే కోర్కె మనస్సులో కలిగిందిగాన లోలార్క నాముడైనాడు. కాశీలో అనేక రూపాలు దాల్చినాడు. ప్రసద్ధి చెందినాడు. ఇలా సూర్య చరిత్రసూర్యునికి గురించి విశేషాలను చెబుతుంది. త్రిమూర్త్యాత్మకుడు, జీవిత పరమావధికి దారి చూపే మహోదాత్త స్వరూపుడు, సూర్యనారాయణమూర్తి అని కీర్తించారు వాగ్గేయకారులు. మన్వాంతర ప్రారంభంలో దివాకరుడు సప్తమి రోజున రథాన్ని అధిరోహించాడని ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిరోజున వచ్చే పర్వదినాన్ని రథసప్తమిగా, సూర్యజయంతిగా పండుగ జరుపుకుంటాం. సప్తమ్యాంఖలు సూర్వేణ మూర్తిశ్చ కృతవాన్ భువిః అని, సూర్యభగవానుడు తొలిసారిగా భూమిమీద రథసప్తమినాడు సాక్షాత్కరించాడని చెపుతోంది-మత్స్యపురాణం. మాఘశుద్ధ సప్తమీ తిథి రోజున, అరుణోదయాత్పూర్వం ఆకాశంలో గ్రహ నక్షత్ర సన్నివేశం, రథాకారంగా ఉంటుందని దైవజ్ఞులు వివరించారు. ‘‘మాఘే మాసేసి తౌ పక్షే సప్తమీ కోటి భాస్కర కుర్వాత్ స్నానార్ఘ్య దానా భ్యాం ఆయురారోగ్య సంపదః’’ రథ సప్తమినాడు ప్రాతఃకాలమందే మేల్కొని, శిరసున జిల్లేడు ఆకులను ఉంచుకుని స్నానమాచరించి, అర్ఘ్య దానాచరణతో ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి, సప్త జనుల పాపములు నశిస్తాయని చెప్పబడింది.

- రామారావు