సబ్ ఫీచర్

సీతమ్మ భవ్యచరిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా చాలా కష్టాలు పడుతుంటే సీతమ్మ తల్లిలాగా కష్టాలు పడుతున్నారు అంటారు. సీతమ్మ రాముని భార్య. దశరథుని కోడలు. అయోధ్య మహానగారనికి మహారాణి. జనకుని ముద్దుల కూతురు. కాలు కిందపెడితే కంది పోతుందేమో అన్నంత అపురూపంగా గారాబంగా జనకుడు సీతమ్మను పెంచాడు. కోరి పరాక్రమ వంతుడు దశరథుని ప్రాణసమానుడు అయన శ్రీరాముని పిలిచి శివధనుస్సును ఎక్కు పెట్టడం అన్న పరీక్ష పెట్టి మరీ అల్లుడిని చేసుకొన్నాడు. రాముని హృదయమే సీతమ్మ హృదయం. రాముడు సీత వేర్వేరు కాదు వారిద్దరూ ఒకటే. అసలు సీతారాములు అను రూపులు. వారి శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అని లోకులందరిచేత అనిపించుకున్నారు. దేవతలు సైతం సీతారాములు కొనియాడారు ఇక మహర్షులు సీతమ్మను మెచ్చుకున్నారు. నారీలోకానికే శిరోమణివి అని కీర్తించారు. అట్లాంటి సీతమ్మ పడరాని పాట్లు పడింది. సామాన్య పడతివలె కన్నీరు కార్చింది. కష్టాలు పడలేను. ఈ ప్రాణాలు పోతేనన్నా బాగుండు అన్నంతగా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సీత నాసుత- నీ సహధర్మచారిణి2అని జనకుడు సీతను రామునికప్పగించాడు. అప్పటినుంచి ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సీతమ్మ మాట ఒక్కటే అదేంటంటే భర్త వున్నచోటే భార్యకు స్వర్గం, మీరు లేని అయోధ్య నాకు అడవితో సమానం. మీరున్న అడవి నాకు అయోధ్య వంటిది. నా సర్వస్వం మీరు, మీరు లేని కామధేనువైనా కల్పవృక్షమైనా నాకక్కరలేదు. ఇదొక్కటే ఆమె మాట, ఆమె వూపిరి కూడా రాముడే. అటువంటి సీతమ్మను రావణుడు అపహరించాడు. ఎన్నో మాయమాటలు చెప్పాడు. మరెన్నో ప్రలోభాలు పెట్టాడు.
కాని సీతమ్మ ముల్లోకాలను గజగజ లాడించిన రావణుని గడ్డిపరకలాగా చూసింది. చివరకు ఆంజనేయుని ద్వారా రాముని క్షేమ వార్తను వింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాముని కోసం ఎదురుచూసింది. ఆ ఘడియ రానేవచ్చింది.రామ రావణ యుద్ధం జరిగింది. అన్యాయాలు దుర్మార్గాలకు నెలవైన లంకను రాముడు ముట్టడించాడు. అధర్మపథాన నడిచిన రావణుడిని ఠాముడు పరలోకానికి పంపించాడు. అందరూ సంతోషించారు. కాని. రాక్షసులు, వానరుల ముందు రాముని కోరిక మేరకుతన్ను తాను అగ్నికి సమర్పించుకుంది. అగ్ని దేవుడే సీతమ్మను అగ్నిగుండం నుంచి పైకి తీసుకొని వచ్చి సీతమ్మ అతిపవిత్రురాలు అని చెప్పాడు. అందరూ అగ్నిపునీతగా సీతమ్మను కొనియాడారు. వనవాసానంతరం సీతారాములు అయోధ్యాధిపతులయ్యారు. కాని ఒక పామరుని నింద వల్ల తిరిగి సీత రాముని చేత పరిత్యజించ బడింది. ఆ తల్లి అపుడు తన వారసులను తన కడుపున మోస్తోంది. తన కష్టాన్ని తన మనసులోనే దాచుకుని వాల్మీకుల ఆశ్రమంలో కుశలవులను కని వారికి విద్యాబుద్దులు నేర్పించి రామునంతవారిగా తీర్చిదిద్దింది. సీతను వాల్మీకి రామునికి అప్పగించగా, తన పరిశుద్ధతను నిరూపించుకోవడం కోసం తల్లి భూదేవిని ఆహ్వానించింది. ఇక కష్టాలు చాలనుకొని తల్లిఒడిలోనే ఒరిగింది సీతమ్మ. ఆ సీతమ్మ వ్యక్తిత్వం కలియుగంలోను అందరికీ స్ఫూర్తినిస్తుంది. కష్టాలనుంచి కడతేరేందుకు శక్తినీస్తుంది.

- జంగం శ్రీనివాసులు