సబ్ ఫీచర్

అతిథి సేవే ఆదిత్యుని సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నం పరబ్రహ్మాస్వరూపం. మానవులు జీవించాలంటే అత్యవసరమైనవి కూడు, గుడ్డ, గూడు ఈ మూడు ఉంటేనే జీవితం సజావుగా సాగుతుంది. పిపీలికాది బ్రహ్మపర్యంతమూ ఏదో ఒక ఆహారం తినందే బతుకు సాగదు. మనసుకు మంచి ఆలోచనలుంటే మానసికానందం కలుగుతుంది. మంచి ఆహారం తింటే ఆరోగ్యమూ కలుగుతుంది.
సస్యలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, పౌష్యలక్ష్మిగా అన్నపూర్ణగా భావించి పూజించడంలోని అంతరార్థం మిదే.
త్యాగమయ జీవులుగా ఉండాలని భారతీయం చెబుతుంది. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. అన్నదానం తర్వాతే వస్త్ర వాహన, ధనకనక వస్తు దానాలు ఉంటాయి. ఆకలికొన్న వారికి అన్నం పెడితే వారి ఇషపరాల్లో సుఖాలు కోకొల్లలు. ఏదానం ఇచ్చినా పూర్తి సంతృప్తి భావన అంతత్వరగా పొందలేరు. కాని అన్నదానం చేసినప్పుడు అన్నం తిన్నవారూ పెట్టినవారూ ఇద్దరూ ఒకటే సారి సంతృప్త్భివనను పొందుతారు. అన్నం తిని కడుపు నిండి ఆకలిపోయినందుకు ఒకరు సంతోషాన్ని కనుల్లో చూపిస్తే మరొకరి వారికి ఆనందం కలగిందన్న ఆలోచనతో ఆనందాన్ని కనుల్లో భాసింపచేస్తారు. దానివల్లనే దాతగ్రహీతలకు ఆనందం ఒకటే సారి కలుగుతుంది.
పూర్వకాలంలో అతిథి పూజ చేయనిదే అతిథికి అన్నం పెట్టనిదే ఇంటి యజమాని అన్నం తినేవాడు కాదు. శిరిడీ సాయిబాబాగారు కూడా భిక్షాటన చేసి లభ్యమైన ఆహారాన్ని ముందు చీమలు, దోమలు, కుక్కలు, ఈగల్లాంటి వాటికి పెట్టి తర్వాత తన దగ్గర ఉంటున్న భక్తులకు పెట్టి తర్వాత ఆయన భుజించేవారు. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్నదే మన హైందవం చెబుతుంది. రంతిదేవుడు గొప్ప మహారాజు. దానశీలి. తన రాజ్యాన్ని సంపదను అంతా దానం చేయడంలో దూరం చేసుకొన్నాడు. కాని దానశీలత్వాన్ని మాత్రం పోగొట్టుకోలేకపోయాడు. తనకు దొరికిన దానితో తృప్తిపడుతూ ఉన్నంతలో ఎదుటివానికి కాస్త పెట్టివాని ఆకలి తీరిన తర్వాత తన భార్యాబిడ్డలకు పెట్టి ఆ తరువాత ఆయన భుజించడం అనేది దినచర్యగా పెట్టుకొన్నాడు. అట్లాంటి రంతిదేవుని పరీక్షించాలని మహావిష్ణువు అనుకొన్నాడు.
ఒకసారి చాలారోజుల పాటు రంతిదేవునికి ఆహారమేమీ దొరకలేదు. కటిక ఉపవాసం చేయసాగారు. ఒకరోజు అనుకోకుండా ఆహారం దొరికింది. అపుడు అతిథి సేవచేసి మనం భుజిద్దాం అనుకొన్నారు వారు. అతిథికోసం చూస్తున్నపుడు ఒక వృద్ధుడు ఆకలితో కనిపించాడు. ఆ వృద్ధుడి ఆకలి తీరడం కోసం రంతిదేవుడు తన దగ్గర ఉన్న ఆహారాన్నంతా పెట్టేశాడు. ఆతరువాత కేవలం వారికి మంచినీరు మిగిలింది. దాన్ని తాగు దామనుకొనేంతలో మరో అతిథి దాహార్తిగా వచ్చారు. ఆ నీటిని కూడా పూర్తిగా రంతిదేవుడు దానం చేశాడు. ఇలా అన్నింటి నీ దానం చేసినా కూడా సంతోషంగానే ఉన్న రంతిదేవుని దానశీలత్వాన్ని మెచ్చుకోకుండా భగవంతుడు ఉండలేక ప్రత్యక్ష్యం అయ్యాడు. కోరకుండానే రంతిదేవునికి స్వర్గలోకానికి తీసుకొని వెళ్లాడు. రంతిదేవునికి విష్ణుసాయుజ్యం లభించింది. ఇలా దానగుణాన్ని ప్రతివారు కలిగి ఉండాలని ప్రతి వస్తువు అవస్తువులోను పరమాత్మ ఉన్నాడని, పరులకు సేవ చేయడమే పరమాత్మకు సేవచేయడం అవుతుందని హైందవం చెబుతుంది.

- జి కల్యాణి