సబ్ ఫీచర్

బాల్యం నుంచే కావాలి ఈ బోధామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారులకు తల్లిదండ్రులే తొలిగురువులు. వారిలో చిన్నతనం నుంచి దేశభక్తి భావం కలిగించాలి. మన భారతదేశ చరిత్ర దేశనాయకుల చరిత్ర విశేషాలను పిల్లలకు తెలియ చేయాలి. పిల్లల్లో దేశభక్తి గురించి చక్కగా వివరించి తెలియచేస్తే వారికి దేశభక్తి పట్ల స్ఫూర్తి కలుగుతుంది. మనదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయులు అల్లూరి సీతారామరాజు, నేతాజీ, మహాత్మాగాంధి వంటి నేతలెందరో ఉన్నారు. వారందరి జీవిత చరిత్రల గురించి చెప్పాలి. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను వారిలో ప్రోది చేయాలి. వందేమాతరం వంటి దేశభక్తి గీతాలు వారిచే పాడించాలి. జాతీయ సమైక్యతకు సందేశంగల మన దేశఖ్యాతిని గూర్చి పిల్లల్లో అవగాహనను పెంచాలి. నేటి బాలలే రేపటి పౌరులు కనుక పిల్లలను భావి భారత నేతలుగా తీర్చిదిద్దాలి. బంగారు భవితవ్యం వైపు వారి దృష్టిని మరల్చాలి. దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన కవి గురించి వారి ఆలోచనావిధానాన్ని గురించి వారికి వివరించాలి. నీతి నిజాయితీ,క్రమశిక్షణ, ఐక్యత, అంకితభావం ఇవన్నీ వారికి తెలిస్తే వారిలో దేశభక్తి అంకురిస్తుంది. ఆ అంకురమే మొక్కగా ఎదిగి మహావృక్షమై శాఖోపశాఖలై దేశభద్రతకు గట్టి పునాది అవుతుంది. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు ఎవరైనా సరే పిల్లలకు దేశభక్తిని పెంపొందించే కథలను వారికి చెప్పాలి.

ఎల్. ప్రపుల్లచంద్ర