సబ్ ఫీచర్

సామర్థ్యమో, సామరస్యమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీత కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి అన్నట్టుగానే త్రేతాయుగమైనా, ద్వాపరమైనా కలియుగమైనా సరే స్ర్తిల కష్టాలు లెక్కలేనన్ని. ఆనాడు రాముడు ఆదర్శపురుషోత్తముడుగాను, చారిత్రిక వీరుడుగాను కీర్తించబడినా సీత విషయంలో మాత్రం అన్యాయమే చేశాడు. నీవే తోడు నీడ అని కూడా వెళ్లిన సీతకు అనుకోని కష్టాలు. ఒకసారి విరాధుడు ఎత్తుకెళ్లితే రామలక్ష్మణులు రక్షిస్తారు. ఆఖరికి స్ర్తికి స్ర్తియే శత్రువన్నట్టు శూర్పణఖ సీతను వదిలేసి నన్ను వివాహం చేసుకో అంటూ రాముని దగ్గరకు వస్తుంది. పైగా సీతను చూచి మింగేస్తానని కూడా అంటుంది.
అపుడు రాముడు నా దగ్గరే నా సతీమణి ఉందికాని మా తమ్ముడికి దగ్గర భార్యలేదు కదా. మరి పెళ్లిచేసుకొంటాడేమో అడుగు అని శూర్పణఖకు చెబుతాడు. చూశారా! మగబుద్ధి! అక్కడేమో పాపం ఊర్మిళ లక్ష్మణుడు వచ్చేదాకా నిద్రపోతానంటుంది. ఇక్కడ ఊర్మిళ లేదు కదా శూర్పణఖ వచ్చింది చూడు అంటున్నాడు రాముడు. ఇది ఏమి బాగుంది చెప్పండి.
రావణుడు అపహరించిన సీతమ్మకు కష్టాలు కన్నీళ్లుగా మారాయి. అశోకవనంలో కూర్చున్న సీత రావణుని ప్రలోభాలు వినలేకపోయింది. రావణుని తృణంలాగా చూసినా వాడు వదిలిపెట్టక తన రాక్షసకృత్యాలు చేస్తూనే పోయాడు. చివరకు ఆంజనేయుడు సీతమ్మ ఉనికిని కనుగొన్నాడు. ఆ తల్లిని ఊరడించాడు. రాముడు వస్తాడని నమ్మబలికాడు. చివరకు రాముడు రానేవచ్చాడు. రావణునిపై గెలిచాడు. సీతమ్మ ఎంతో సంతోషించింది. తన భర్తే వచ్చి రావణుని ఓడించి నన్ను తీసుకొని పోవాలని కోరుకుంది అట్లానే జరిగింది.
కాని రాముని దగ్గరకు విభీషణుడు సీతమ్మను తీసుకొని వస్తే వానరులు, రాక్షసులు చూస్తూండగా రాముడు ఇన్నాళ్లు ఈ రాక్షసుని చెరలో ఉన్నావు కదా మరి ఇప్పుడు నీ మనసు ఎట్లా వుందో నీకిష్టమొచ్చిన చోట నీవు వెళ్లవచ్చు అంటాడు.
ఇది ఏమన్నా బాగుందా? సీత నీవు లేక నేను లేను అన్నట్లు చెట్టు పుట్టా పట్టుకు ఏడ్చాడు రాముడు. లక్ష్మణునితో చెప్పి చెప్పి విచారాన్ని వ్యక్తం చేశాడు. అటువంటి రాముడు సీతమ్మ ఎదురైతే ఈ మాట అనడం ఏమన్నా బాగుందా? పైగా నాకు తెలుసు సీత మనసు అని తర్వాత చెబుతాడు అనుకోండి. కాని నలుగురి ఎదుట అనవలసిన మాట కాకుండా వేరే అన్నాడు కదా. అపుడు సీతమ్మ అగ్నిప్రవేశం చేసింది. తాను పునీతగా నిరూపించుకుంది.
కాని నేడు కూడా మహిళలను మగరాయుళ్లు మగళ్లుగా మారి అనుమానిస్తున్నారు. వారి అనుమానం తీరడానికి రామునిలాగా ఎదురుగా అడగడం లేదు. వారి శాడిజాన్ని చూపిస్తున్నారు. ఒకరు కాలుస్తారు. మరొకరు నిందారోపణలు చేస్తున్నారు. మరొకరు నలుగురిలో అవమానం పాలు చేస్తారు. ఇంకొందరు పైకే పంపేస్తున్నారు.
మరి ఇప్పుడు మనం సీతమ్మలాగా అగ్ని ప్రవేశం చేసి పునీతులుగా నిరూపించుకోవాలి అనుకొంటున్నారా?
కాదు కాదు సుమా. కాని, మనమేమిటో మనం నిరూపించుకోవాలి. అనుమాన జీవుల అనుమానాల్ని మన హేతువాదంతోనో, మన ప్రతిభతోనో, మన సంస్కారంతోనో, మన తెలివి తేటలతోనో వారికి బుద్ధి చెప్పాలి. వారిలో మృగ్యం అయిపోతున్న మానవత్వాన్ని తట్టి లేపాలి. అపుడే నేటి స్ర్తి అబల కాదు సబల అని నిరూపించుకొంటుంది. స్ర్తి శక్తేమిటో ఈ కలియుగానికి ఈ మృగాల కన్నా హీనంగా సంచరించే మగవారికి తెలుస్తుంది.

- నిర్మల