సబ్ ఫీచర్

విశిష్టతే వీరత్వానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వీరవనితలు’ అంటే అవసర సమయాలలో సాహోపేత నిర్ణయాలు తీసుకొని తమ కుటుంబాలను ప్రగతి మార్గంలో నడిపించే స్ర్తిలు అని అర్థం చెప్పవచ్చు.
ప్రతీ ‘స్ర్తి’ తన కుటుంబంలోని పురుషులకు తల్లిగానో చెల్లిగానో, భార్యగానో ఉండి వారికి అన్నివిధాలా తోడ్పడుతూ వారు సాధ్యమైనంత హెచ్చుగా సుఖపడగలిగేట్లు, వృత్తిలో అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగగలిగేట్లు చేస్తుంది.
సోదరి స్థాయిలో కన్నా అమ్మ స్థాయిలోనూ, దానికన్నా అమ్మమ్మ - మామ్మ స్థాయిలోనూ అనుభవాలు హెచ్చుగా ఉంటాయి కదా!
అందువల్ల మన అమ్మమ్మల, మామ్మలలోని ఘనతలేవో కనుగొందాం.
నిజంగా మా నాయనమ్మ ఒక విశిష్టవ్యక్తి, ఒక వీర వనితయే.
చూడడానికి సామాన్య స్ర్తిలాగానే ఉంటుంది. చీర, ముఖాన చిరునవ్వు మాత్రమే కానవస్తాయి. కాని జీవితంలో ఆమె ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నదో, ఎన్ని అవస్థలు పడిందో ఎన్నటికీ ఎవ్వరికీ తెలియనీయదు. ఆమె జీవిత అనుభవాలు ఆమెకు ఎంతో మనోబలాన్ని చేకూర్చాయి. ఎట్టి భయంకర పరిస్థితులు ఎదురైనా బెంబేలు పడకుండా ధైర్యంతో ఎదుర్కొనే మనస్థైర్యాన్ని ప్రదర్శించగల్గడమే మనం సాధిచవలసిన ఘనత అని ఆమె జీవితం మనకు నేర్పగల్గుతుంది.
‘మాకు ఆదర్శవంతులైన వీరపురుషులు లేక వీరవనితల జీవితాలలోని విశేషాలు వివరించండి’ అని ఒక వ్యాస రచనా కార్యక్రమాన్ని ఏర్పటుచేస్తే - చాలామంది క్రీడలలో, కళలలో, సినిమాలలో తమ ప్రతిభను ప్రదర్శించి అవార్డులు పొందిన వారందరి గురించి పేర్కొనడం జరిగింది. కొద్దిమంది మాత్రం తమ జీవితంలో అభివృద్ధి సాధనకు తోడ్పడినవారి గురించి తెలియజేశారు.
ఒకామె మాత్రం ఉన్నత ప్రమాణాలు సాధించడానికి దారిచూపే తన ఉపాధ్యాయుణ్ణి గురించి వివరిస్తూ- ఆయన తరుచుగా తనలోని లోపాలను ఎత్తిచూపడం తనకు బాధ కలిగించినా విజయ సాధనకు గట్టి కృషి చేయడానికి దానివల్ల తనకు ప్రోత్సాహం లభించిందనీ, అలా విమర్శించే వారివల్లనే పట్టుదలగా పనిచేయడం అలవాటు అవుతుందని అర్థమైందని తెలియజేసింది.
ప్రస్తుతకాలంలో పత్రికల ద్వారా బహుళ ప్రజారం పొందినవారే ‘వీరులు’గా గుర్తింపునకు వస్తున్నారు తప్ప- అత్యంత ప్రతిభావంతులైనా ప్రచారానికి సుముఖంగా లేనివారు ప్రజల గుర్తింపునకు దూరంగానే ఉండిపోవాల్సి వస్తోంది.
విద్యార్థులకై నిర్వహించిన ఒక వ్యాస రచనా కార్యక్రమంలో ‘మీకు వీరులుగా భావిస్తున్న వారు ఎవరో తెలుపండి’ అని కోరగా అత్యధిక భాగం క్రీడలలో, కళల్లో, సినిమాల్లో తమ ప్రతిభను ప్రదర్శించి పేరుపొందిన వారు పేర్కొనగా, కొద్దిమంది మాత్రం తమ ప్రగతికి తోడ్పడిన కుటుంబ పెద్దల గురించి వివరించారు. ఒక విద్యార్థిని అందరి కంటే భిన్నంగా తడవ తడవకూ తనలోని లోపాలను ఎత్తిచూపి ఉత్తమ ప్రమాణాలవైపు తనను నడిపించిన తన టీచర్‌నే మహోన్నత వ్యక్తిగా పేర్కొన్నది.
నిజానికి ఇట్టి మహోన్నత వ్యక్తులు మనం మామూలుగా అతి సామాన్య వ్యక్తులుగా భావించే వారిలో కూడా కానవస్తారు. మనను తీవ్రంగా విమర్శించినవారిలో కూడా ఇట్టివారు ఉంటారు.
ఉదాహరణకు- మనలోని నీచత్వాన్ని, లోపాలను సరిదిద్దడానికై మనల్ని తీవ్రంగా ఎదుర్కొన్న మన కుటుంబ సభ్యులు, ఉన్నత ప్రమాణాలను నిలబెట్టడానికై ఇతరులను లెక్కచేయకుండా ధైర్యంగా నిలబడే విద్యార్థులు, మిత్రులు.
వీరిని మనం మహోన్నత వ్యక్తులుగా, వీరులుగా, ధీరులుగానే భావించాలి.
ఇలా నిజాయితీగా, నిష్కర్షంగా వ్యవహరించే వ్యక్తులవల్ల ఎలా మేలు జరుగుతుందో వివరించే ఒక సంఘటన గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఒక విద్యార్థిని ఒక చిన్న పట్టణంలోని కాలేజీలో నాటకాలలో తన ప్రతిభను ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకుంది. దానితో తాను కూడా పెద్ద సినిమా నటి, తార కాగలనని ఆశ కలిగింది. ఆ అత్యాశతో ఆమె పట్టణాన్ని వదలి నగరానికి వెళ్లి అక్కడ తన ప్రతిభ కనబరచాలని ఆశించింది. కాని నగరానికి వెళ్లిన తర్వాత ఆమెకు తెలియవచ్చిన సత్యం- తాను ఇపుడు ఒక మహా సముద్రంలో ఈదులాడ ప్రయత్నించే చిన్న చేప మాత్రమే అని, తనకు ప్రతిభ ఉన్న మాట నిజమే కాని, తాను సముద్రంలాంటి ఈ నగరంలో గుర్తింపు పొందడానికి ఎంతోగానో శ్రమించి పనిచేయడం, అనేకమందితో కలుసుకుంటూ వారిలోని ప్రతిభలను కూడా తాను స్వంతం చేసుకోవడం అవసరం అనీ, అంతేకాక తాను నటనయే వృత్తిగా జీవించగల ఉన్నత నటిని కానని కూడా ఆమె తెలుసుకున్నది. అయితే తాను ఇపుడు మనస్తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేసి, నటనలో నాట్యంలో లోపాలను సరిదిద్దే అధ్యయన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలా సరైన వృత్తులను చేపట్టడంలో తోడ్పడగల వ్యక్తులే వీరపురుషులుగా భావింపబడతారు.
మనం ఇతరులకు ఏ విధంగానైనా సహాయపడడంలోనే మన ఔన్నత్యం కానవస్తుంది. అట్టి పరిస్థితులలో మనం కూడా అట్టి సమయం పొందినవారి వీర పురుషులుగా కానవస్తాము. మన వద్దకు వచ్చిన వారిని మనం ఆనందపరచగలిగితే మనమూ వీరపురుషులమే అవుతాము. నిజానికి జీవితంలో మనకు అంతకన్నా మించి కావలసినది ఏముంటుంది?

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి