సబ్ ఫీచర్

కాలం మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరి నోటంట విన్నా ఇదే మాట- ‘కాలం మారింది’! నిజమే మనకీ అనిపిస్తుంది కాలం మారిందని. ముఖ్యంగా ఆడవాళ్ల జీవితాలలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకి, పాత కాలంలో ‘ఆడపిల్లకి చదువెందుకు? ఉద్యోగం చెయ్యాలా? ఊళ్లేలాలా? ఆడది గడప దాటకూడదు!’ లాంటి మాటలు అక్షరాలా ఆచరణలో వుండేవి.
పైగా ఆడవాళ్ళకి ఏ స్వేచ్ఛా వుండకూదు అనే నమ్మకం కూడా. కేవలం ఇంటిపనికి పనికొచ్చే ఒక యంత్రం స్ర్తి జీవితం. ఆమె ఏ కోర్కెనీ పైకి చెప్పకూడదు. విద్యా విషయాలే కాదు, వివాహంలోనూ ఆమెకి స్వేచ్ఛ వుండేది కాదు. కన్యాశుల్కం లాంటి విషయాల్లో బలైపోయిన పూర్ణమ్మలు ఎందరో? భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా భరించాలి. ఇంటి గుట్టు రచ్చకెక్కకూడదు. ఆమె నడకకీ, నడతకీ అన్నీ ఆంక్షలే. విధిలేని పరిస్థితిలో ఆత్మహత్యలు మాత్రమే శరణ్యం. పిల్లల తల్లయితే పిల్లలకోసం, ఆ ప్రయత్నం కూడా విరమించుకునేది. జీవం వున్న శిలా ప్రతిమలా జీవితం గడిపేది. ఒకవేళ ఎదురు తిరిగితే ‘గయ్యాళి’, ‘తెగించింది’ లాంటి పేర్లు వుండనే వున్నాయి. మొత్తానికి బాధను దిగమింగి బడకడం ఒక్కటే ఆమెకు ‘మహాసాధ్వి’, ‘త్యాగమయి’ లాంటి బిరుదులు తెచ్చిపెట్టేవి.
అవును! కాలం మారింది!
ఎంత మారిందంటే ‘అతివలు నేర్వగ లేని విద్యగలదే అవనిలోన’ అన్నంతగా కాలం మారింది. టీచరు, నర్సుల స్థాయినుంచి, డాక్టరేట్లు, డాక్టర్లు, లాయర్లు, ఐఎఎస్, ఐపిఎస్‌లే కాక, రాజ్యాలేలే నేతలవరకూ ఎదిగారు. మగవాళ్ళకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా వాళ్లని మించిన స్థాయిలో విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రాణిస్తున్నారు. అన్ని వర్గాలవారూ ఆడపిల్లల చదువు ప్రాముఖ్యతని గ్రహించి చదువుతున్నారు. ఉద్యోగాలలోనే కాదు, వ్యాపార రంగంలో, బ్యాంకింగ్ వ్యవహారాల్లో తమకు తామే సాటి అనిపించుకుంటున్నారు.
అవును! కాలం మారింది!
తను కోరుకున్న వ్యక్తిని తాను వివాహం చేసుకోవడానికి, ఇంట్లో వాళ్లని ఒప్పించి మెప్పించే స్థితికి ఎదిగింది. ఏ వృత్తిలో వున్నా పిల్లల బాధ్యతా ఇంటిని చక్కదిద్దునే కర్తవ్యం, తన ఒక్కదానిపైనే పడినా, ఉమ్మడి కుటుంబాలు పోయాక ఒంటరి కాపురాలలో కొందరు కన్యాశుల్కం, వరకట్నంగా మారాక అత్తింట్లో ఆరళ్లూ, మొగుళ్ల సాధింపులూ వేధింపులతో మరికొందరు భరించవలసివస్తోంది! చదువుకున్నా సంపాదిస్తున్నా ఈ క్షోభ భరిస్తూనే వుంది ఆడది
అవును! కాలం మారింది!
‘ప్రేమ ప్రేమ’ అని పెళ్లిచేసుకున్నవాళ్ల సంసారాల్లో ప్రేమ కొన్నాళ్లకి వెన్నలా కరిగిపోయి, నెయ్యి కూడా మిగలడంలేదు. నీళ్లలా ఆవిరైపోతోంది.మనస్పర్థలూ పెరిగిపోతున్నాయి. నిరాశా, నిట్టూర్పులూ మేఘాల్లా ముసురుకుంటున్నాయి. దానికి తగ్గట్టు పిల్లల చదువులూ, వారి పోషణా భారమై పోతోంది. బయట వాతావరణం, ఇంట్లో పెద్దవాళ్ల పరిరక్షణా లేక పిల్లల్లో మొండితనం, పెడసరితనం ప్రబలిపోతోంది! అమ్మా నాన్నల పర్యవేక్షణ కూడా అంతంతమాత్రమే అవడం, టీవీలు, సెల్‌ఫోన్లు, ఐపాడ్‌లో సంభాషణలూ, వారికి దగ్గరై మనుషులకు మానవత్వానికీ దూరమైపోతున్నారు, నా అన్న వారు లేక!
అవును! కాలం మారింది!
మహిళల జీవితాలు మెరుగుపడుతున్నాయా? భ్రష్టుపడుతున్నాయా? సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో నైట్ సర్వీసులో, భర్త ఒక చోట, భార్య ఒక చోటా ట్రాన్సఫర్లూ- ఇలా భార్యాభర్తలు విడి విడిగా వుండడంవల్ల ఏర్పడే పరిస్థితులలో ఎనె్నన్ని కష్టాలో, అనుకొని సంఘటలను ఎదురవుతున్నాయ. అవి అనేక రకాలుగా సంసారాలలో సంతోషాన్ని హరించడమే కాక, అఘాయిత్యాలకు దారితీస్తున్నాయి. ఈ వ్యవహారాలలో స్ర్తి పరిస్థితి షరా మామూలే.. విడాకులు పుచ్చుకోవాలా? ఓర్పు వహించి నోరు మూసుకోవాలా? ఏది చేసినా నిందపడేది ఆడవాళ్లపైనే ఎక్కువ. మగవాడికీ టెన్షన్ పెరిగిపోయింది. ఒక వొరలో రెండు కత్తులు ఇమడవు కదా?? సంఘర్షణ తప్పదు. ఒక తప్పును సమర్థించుకోవడానికి అనేక తప్పులు- పాత కాలంలా కాదు- ఇంకా ఎక్కువే!
అవును! కాలం మారింది!
‘సోషల్ స్పిగ్మా’ పోయింది అయినా మనశ్శాంతి ఏది? మార్గమేది? అసలు పెళ్ళే వద్దు అనుకుని కలిసి వుండడమా?
అప్పడూ ప్రశాంతత ఏదీ? ఉంటుందా? అందులోనూ సమస్యలే ఆడవాళ్ళకే ఎక్కువ కదా? ఈ కాలంలో డబ్ములకి కొదువలేదు. స్వంతంగా సంపాదించుకునే స్థాయిని పొందారు చాలామంది కానీ మానవ సంబంధాలు, కుటుంబంలో సంతోషాలూ మాసిపోతున్నాయి.
అవును! కాలం మారింది!
తెల్లారి లేస్తే ఇవే మాటలు! ఇవే వార్తలు అక్రమాలూ, అఘాయిత్యాలూ, హత్యలూ, ఆత్మహత్యలూ ... వింటూంటే చిరాకుపుడుతోంది!
అవును! కాలం మారింది!
ఇదేనా మనం కోరుకుంది? మనం ఇంకా మారాల్సిన అవసరం ఉంది. పురుషులనూ మనుష్యులు మారాల్సిన బాధ్యత మనపైనే ఉంది అనుకొందామా. ఎవరో ఒకరు పూనుకోవాలి కదా. సంస్కరణలు చేయాలి. మనిషి మనసు మారితే మానవత్వం చిగురిస్తే ఈ పరిస్థితులు మారుతాయ.

-శారదా అశోకవర్థన్