సబ్ ఫీచర్

ఆత్మజ్ఞానసాధనలోనూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మజ్ఞానాన్ని పొందడానికి స్ర్తిపురుష వివక్షలేదు. వయో విద్యార్హతలు లేవు. భౌతిక విషయాలపట్ల వైరాగ్యం చూపగలిగినవారికి వెంటనే శివసాక్షాత్కారం లభిస్తుందని జ్ఞానులు చెప్తారు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన లలనామణి లల్లేశ్వరీ దేవి. ఈమె కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో క్రీ.శ. 1355 సం.లో పండ్రెథాన్ గ్రామంలో లల్లేశ్వరి జన్మించారు. . చిన్న వయసునుండీ మనస్సులో భక్తి భావాన్ని పెంపొందించు కున్నారు. ఈమెను కొందరు శివమహాయోగిని అంటే మరికొందరు సూఫీ తాత్వికురాలు అన్నారు. ఎవరు ఏమనుకొన్నా తన దారిన తాను ఆత్మజ్ఞానావిష్కరణకే ఆమె తన జీవితాన్ని వెచ్చించారు. అంతేకాక లల్లేశ్వరి . తన ఆర్తినీ, ఆలోచనలను, మానసిక స్థితినీ మామూలు మాటల రూపంలో పెట్టింది. ఆమె పలికిన ప్రతి మాటా అక్షర సత్యమై సూక్తియై చెక్కు చెదరకుండా నిలిచిపోయింది. ఆమె వాక్కులు కాశ్మీర భాషలో శారదాలిపిలో కాశ్మీరు దేశంలో సామాన్య జనం సర్వత్ర పాడుకునే సాహిత్యమై వ్యాప్తిని పొందాయి. లల్లేశ్వరి దేవికి ఆనాటి సంప్రదాయాల ప్రకారం చిన్ననాడే పెళ్లయంది. ఆమె అత్తవారింటికి వెళ్లింది. కాని ఆమె మనసు ఎప్పుడు భగవంతునిపైనే నిలిచి ఉండేది. ఒకనాడు ఆమె అత్తగారు ఆమెకు కంచంలో నున్నటిరాయని పెట్టి దానిమీద అన్నం మెతుకులు కప్పి ఇచ్చిందట. లల్లేశ్వరి వౌనంగా అన్నం తిని ఆ రాయని కూడా కంచంతో పాటు కడిగిపెట్టి మిన్నకుండి పోయందట. లల్లేశ్వరి అంతటి ఓర్పుసహనాలను అత్తారింటనే నేర్చుకుంది. దానితో మరింత ఆధ్యాత్మికంగా ఎదిగింది. లల్లేశ్వరిని ఎన్నివిధాలుగా బాధపెట్టినా మారుపలికేది కాదు. ఊరుకొండువారిని మరింత బాధపెట్టేవారు అల్పజ్ఞానులేకదా. అటువంటి వారే లల్వేశ్వరి అత్తమామ, భర్తలు. ఒకరోజు బహిరంగ ప్రదేశంలో సాధు వేషంలో ఉన్నవారు వచ్చి ఉపన్యసిస్తుంటే అక్కడే లల్లేశ్వరి కూడా తిరుగుతుండడం వారి మామగారు చూసి మాకు ఎంత అవమానం ఆడవాళ్లు నలుగురి ఎదుట తిరగకూడదు కదా అన్నారట.
లల్లేశ్వరి చిరునవ్వుతో ‘మామగారు మీరు బాగా చూడండి అక్కడ గొర్రెలే కాని మనుష్యులెవరూ లేరుకదా’అందట. అపుడు ఆయన అటువైపు చూస్తే అక్కడ అన్నీ గొర్రెలు ఒకదాన్ని మరొకటి తోసుకొంటూ కనిపించాయట. ఇక అప్పటినుంచి వారి మామ ఆమెకు ఎదురుచెప్పకుండా ఉండిపోయారట.
లల్లేశ్వరి ఆధ్యాత్మికజ్ఞానాన్ని సముపార్జించడంలో దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. తన 26ఏట సర్వ సంగ పరిత్యాగం చేసేసి శివపూజ చేయడంలోనే లీనమైంది. భర్త అత్తమామలు వచ్చి ఇంటికి రమ్మని పిలిస్తే శివపూజకు మించినది ఏదీలేదు. నేను ఈ లోకంలో వచ్చాను. శివపూజ చేయడానికి మాత్రమే. అందుకే శివపూజమాత్రమే చేస్తానని చెప్పి తిరిగి శివపూజలోనిమగ్నమైందట. అట్లాంటి లల్లేశ్వరీని మనం బాధపెట్టామని వారు పశ్చాత్తాప పడి తమను క్షమించమని అడిగారట. క్షమించడానికైనా , కోపం తెచ్చుకోవడానికైనా అంతా శివుడే కాని మనమందరం నిమిత్తమాత్రులం. మీరు మీకు లభించిన ఈ మానవ జన్మను ధన్యం చేసుకోండి అని హితవు చెప్పి వారిని పంపించి వేసిందట.
ఇట్లా స్ర్తిలు కూడా ఎంతోమంది యోగినులు, ఆధ్యాత్మిక వేత్తలుగా, ఆత్మజ్ఞానాన్ని పొందిన వారుగా ఉన్నారు.

- సుశీల