సబ్ ఫీచర్

తరగతి గధి వ్యవస్థలకు వెనె్నముక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి తరం గత తరం భుజాలపై నిల్చొని ఆనాటి తరగతి గది రూపురేఖలను దిద్దుతుంటుంది. దానితో ఎంతోమంది భాగస్వాములు వారి ఫలితమే ఆనాటి సమాజంలో వచ్చిన మార్పులు. ప్రతితరం కొత్త జ్ఞానాన్ని సృష్టిస్తుంది. గత తరం జ్ఞాన వృక్షానికి నీళ్లుపోస్తూ తమ ఆలోచనలను దానిలో పూరిస్తూ ఉంటుంది. కొత్త సమాజానే్న సృష్టించటం కాదు. ఉన్న సమాజాన్ని మెరుగు పరచటం. దీనినే క్రియేటీవ్ థింకింగ్ (కాల్పనిక శక్తి) అంటారు. ఎంతమంది భాగస్వాములున్నా ఆనాడున్నటువంటి పాలకవర్గం ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. తరగతి గది నిర్మాణంలో ప్రభుత్వ పాలసీ ఉంటుంది. ఆ పాలసీలను దృష్టియందు పెట్టుకుని ఇతర భాగస్వాములను కలుపుకొని తన బాధ్యతను నిర్వహించటం జరుగుతుంది. తరగతి గది సామాజిక సాంస్కృతిక ఆర్థిక మార్పునకు నాంది. ఆ మార్పునకు కావల్సినటువంటి మానవ సంపదను తయారు చేయటమే దాని లక్ష్యం. తరగతి గది ప్రతి కాలపు సామాజిక మార్పునకు తొలి అడుగులు వేస్తుంది.
ప్రపంచ చరిత్రలోనే మూడు శతాబ్దాలు కొత్త భావాలను, కొత్త ఆవిష్కరణలను, కొత్త సంస్కృతులను నిర్మించింది. దీని ప్రభావం తరగతి గదిపై పడటం సహజం. తరగతి లక్ష్యం కమాండ్ అండ్ కంట్రోల్ (ఆదేశించు మరియు నియంత్రించు). అప్పటి పిల్లలకు విధేయతను నేర్పటమే తరగతి లక్ష్యం. కానీ గడిచిన మూడు శతాబ్దాల పరిణామాల వలన తరగతి గది నేచర్‌లో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 21వ శతాబ్దం కమాండ్‌కు బదులుగా ప్రశ్నించటం వచ్చింది. ప్రశే్న ఆవిష్కరణలకు కారణభూతమైంది. అదే ప్రపంచ దేశాలన్నింటిని దగ్గరకు తెచ్చి సన్నిహితం చేసింది. దానివలన తరగతి గదుల్లో పెనుమార్పులు చోటుచేసుకుని కమాండ్‌కు బదులుగా కో-ఆపరేషన్ వచ్చింది. విద్యార్థులు ఒకరితో ఒకరు చర్చించుకోవటం వలన జ్ఞానరంగంలో నుంచి కొత్త మెరుగులు ఉత్పత్తి అయ్యాయి. అదే క్రమంగా పెరిగి గ్లోబల్ రీసెర్చ్ వర్క్ పెరిగింది. అదే మానవ సౌభ్రాతృత్వానికి దారి తీసింది. తరగతి గది మానవ కళ్యాణ మే లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల మానవ అవసరాలు తీర్చటమే తన ప్రణాళికగా మారిపోయింది. ఈనాడు తరగతి గది సాంస్కృతిక లక్ష్యం గల దానికి సామాజిక కోణాన్ని కలిగించింది. ఈనాడు తరగతి గది విశ్వమానవునిగా మారింది. మానవాభివృద్ధికి విద్య ఆర్థిక వ్యవస్థకు వెనె్నముకగా మారింది.
లెర్నింగ్‌ను పరీక్షించాలి
తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు ప్రవేశించగానే విద్యార్థులను అంచనా వేస్తారు. విద్యార్థి మెదడులో ఉన్న జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకునే పనిచేస్తాడు. రోగిని డాక్టర్ నీ పేరేమిటని అడుగుతాడు. అంటే రోగి పేరు చెబితే స్పృహలో ఉన్నాడని అర్థం. చెప్పలేక పోతే స్పృహలో లేడని అర్థం చేసుకుంటాడు. ఇది అన్నింటికన్నా సులభమైనది. ఉపాధ్యాయుడు కూడా పరీక్షలో తను చెప్పిన విషయాన్ని లేదా పుస్తకంలో విషయాన్ని విద్యార్థి చదివాడా లేదా అని రికార్డు చేయటం చేస్తాడు. ఇది జ్ఞానం కాదు. కొలమానాల కన్నా దాని ఉపయోగం ప్రధానం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు కొలమానాలు చెప్తాడు. పరీక్షల్లో జ్ఞానాన్ని అడగాలి కానీ సమాచారాన్ని కాదు. పరీక్షలో జ్ఞానాన్ని లేనుకుంటారు. తరగతి గదిలో చెప్పిన విషయాన్ని సమాచారాన్ని విద్యార్థి వేరే విషయానికి మార్చగలుగుతాడా లేదా అని చూస్తారు. విద్యార్థి తన ఆలోచనతో తన రీజనింగ్‌లో సమాచారాన్ని జ్ఞానంగా మార్చుతాడు. ఉపాధ్యాయుడు చెప్పిన విషయాన్ని యథాతథంగానే తీసుకుని సమాజంలో ఉండే సాంప్రదాయాలతో విద్యార్థి తన ఆలోచనలతో రెక్టిఫైడ్ చేసుకుంటాడు. సమాచారం సమాజం యొక్క అనుభవంతో అది జ్ఞానంగా మారుతుంది. తరగతి గదిలో విద్యార్థి దానిని న్యాయనిబంధన చేయటం, దానిపై విశ్వాసం కలిగించటం, ఉన్నతమైన ఆలోచనగా మారుతుంది. గ్రంథంలో ఉన్నది మాత్రమే పరీక్షల్లో అడగాలని అనటం జ్ఞానసముపార్జనకు సరైన కొలమానం కాదు. తరగతి గది మూఢ విశ్వాసాల ప్రచారం కోసం కాదు. సమాచారాన్ని జ్ఞానంగా మార్చేటటువంటి ఆలయం తరగతి గది ఉపాధ్యాయుడు తరగతి గదిలో అంత చేసేది సమాచారం మాత్రమే. విద్యార్థి దాన్ని జ్ఞానంగా మార్చుతాడు. 21వ శతాబ్దంలో ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని పరిశీలించాలి కానీ సమాచారాన్ని కాదు.

- చుక్కా రామయ్య