సబ్ ఫీచర్

ప్రార్థన అంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత దేశంలో ఎన్నో మతాలు, మరెన్నో కులాలున్నాయి. ఒక్కోక్కరు ఒక్కో దేవుని రూపాన్ని ప్రార్థిస్తుంటారు. ఈ ప్రార్థనలో చాలారకాలున్నాయి. చాలామంది వారి కోర్కెలు తీర్చమని దేవుని స్తుతిస్తుంటారు. విద్యార్థులు నాకు పరీక్షలో ఉత్తీర్ణత రావాలనో ప్రథమ శ్రేణి రావాలనో మొక్కుతారు. ఈతి బాధలు దూరం చేయమని సంసారులు ప్రార్థిస్తుంటారు. డబ్బులు కట్టకట్టలుగా రావాలని పిసినారులు ప్రార్థిస్తుంటారు. ఇలా ఎవరికి వారు తాము బాగుండేలా చేయమని ప్రార్థిస్తుంటారు. మరికొందరు తమకు ఆనందాన్ని ఇవ్వమనో లేకపోతే మోక్షాన్ని ఇవ్వమనో ప్రార్థిస్తారు. ఇవన్నీ చూస్తే అవసరాలు తీరేందుకు మాత్రమే దేవుని ప్రార్థించాలేమో అన్న శంక కలుగుతుంది. అట్లా అనుకొంటే అవసరం అనేదానికి అంతం అనేది ఉండదు. అన్నం కూడా లేని దరిద్రులు ఒక్కరోజు అన్నం తినేట్లుచేయమని ప్రార్థిస్తే ఆరోజుటికి అన్నం దొరికిందనుకోండి. వాడు ప్రతి రోజు ఇలాగే ఉండేలా చేయమని పక్కరోజుకోరుకుంటాడు. అది వస్తే నేను ఉండడానికి ఇల్లు కావాలి అంటాడు. మరోరోజు ఆ ఇంట్లో అందమైన వస్తువులు, మరోరోజు ఇంట్లో తనవారు, ఆ తరువాత తనవారు అనుకొన్నవారికోసం ఇలా ప్రతిరోజు ఒక్కోకోరిక పెరుగుతూ పోతుంది. ఎన్నితీర్చినా మరోకటి వస్తూనే ఉంటుంది. దేవుని ప్రార్థన అంతా కోరికలు తీర్చడమే అవుతుంది. పెద్దలు ఇది కూడా మంచి పద్ధతినే అంటారు. ఎందుకంటే రోజు రోజు ఇలా కోరుతూ కోరుతూ చివరకు ఒకనాడు అన్నింటికీ మూలం భగవంతుడని వీరు కేవలం ప్రార్థనలోనే తెలుసుకొంటారు. తాము నిమిత్తమాత్రులమని కూడా వారికి తెలుస్తుంది. ఇక అపుడు భగవంతుని శరణాగతి కోరుతారు. అందుకే సాయిబాబా మొట్టమొదట నా దగ్గరకు కోరికతో వచ్చినా వారిని నేను ఉద్ధరిస్తాను అంటారు.
ముముక్షువులు కూడ తమకు మోక్షం కావాలనే కోరికను కోరుతారు. కాని అసలే కోరిక కోరకుండా ఉండడమే అసలైన ప్రార్థన అని బుద్ధ భగవానుడు చెప్తాడు. ప్రార్థన అనేది కేవలం తనకే కాక నలుగురూ బాగుండాలనే ఉద్దేశంతో చేయమని బుద్ధుడు. అంతేకాదు ప్రార్థన, పూజ, ధ్యానం ఇలా వీటిలో ఒకదాని తరువాత ఒక్కటి చేస్తూ పోతే ఆ మార్గాలు మానవుని పురోభివృద్ధికి కారణాలుగా మారుతాయి. అపుడే మనిషి తనకోసం కాక పరులకోసం ప్రార్థన చేస్తాడు. సర్వేజనాసుఖినోభవన్తు అన్నదానిలో అర్థం అపుడు తెలుస్తుంది. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి అనుకోవడం ఉత్తముల లక్షణం.

-జంగం శ్రీనివాసులు