సబ్ ఫీచర్

సర్వసమర్థురాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన కాలంనుంచి భారతదేశ వ్యవస్థలో స్ర్తిలది గౌరవప్రదమైన స్థానమే! భారతదేశంలో దేవతలు (దేవులు) అందరూ స్ర్తిమూర్తులే! భారతదేశాన్ని కూడా స్ర్తిగానే ఎంచి ‘్భరతమాత’గా ఆరాధించి, గౌరవించారు! నాటి ఋషులు, మునులు, తాపసులు దేవీ ఉపాసకులు! పురుషుల పేరు కన్నా ముందు స్ర్తి పేరేవచ్చేది / వస్తోంది.. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, రాధాకృష్ణులు వగైరాలుగా.. ఎప్పటి సంగతో ఎందుకు... ఇపుడు కూడా స్ర్తిలు తమ పేరు చివర భర్త పేరు వ్రాసుకుంటున్నారు. ఆహ్వాన పత్రికల మీద ‘శ్రీమతి అండ్ శ్రీ’ అని వుండడం గమనార్హం! నాటి నుండి నేటి వరకూ పూజలందుకుంటున్న దేవతలు అందరూ స్ర్తిలే.. డబ్బు కావాలంటే లక్ష్మీదేవి, చదువు కావాలంటే సరస్వతీదేవి, శౌర్య పరాక్రమాలకు పార్వతీ దేవిని, లింగభేదం లేకుండా ఆరాధిస్తున్నారు.
పతివ్రతామతల్లులుగా ఆరాధించబడుతున్న అనసూయ, సుమతి, అహల్య, సావిత్రి, ద్రౌపదాదులు స్ర్తిలు! ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి వీరనారులు స్ర్తిలే! గార్గి, మైత్రేయి, ఉభయ భారతి వంటి విదుషీమణులు స్ర్తిలే! వారి కీర్తి ప్రతిష్ఠల కారణంగా, వారు నేటికీ ఆరాధ్యులై ఉదాహరణలుగా నిలిచి గౌరవించబడుతున్నారు. స్ర్తి శక్తి దైవీశక్తి. ఈ శక్తే రాక్షస ప్రవృత్తిని నశింపజేసి సత్వ గుణ సంపన్నం చేస్తోంది!
శతాబ్దాల తరబడి ధాస్యం, మూఢ నమ్మకాలు అనే పరదాల మాటున అణచివెయ్యబడింది స్ర్తి. దానికి కారణం ఆనాటి పరిస్థితులు.. తరుష్కుల దండయాత్రలప్పుడు, వారి దురాగతాలకు బలయ్యారు స్ర్తిలు. వారి రక్షణ కొరకు ఏర్పరచబడిన కట్టుబాట్లు రాను రాను దురాచారాలుగా మారి, వారి పాలిట శాపాలై వారి పురోగతికి అడ్డంకులయ్యాయి. అణచివేతకు దోహదపడ్డాయి. ఈ పరిస్థితులకు కొంతవరకు మన ధర్మవేత్తలు కూడా బాధ్యులే! కొందరు స్ర్తిని ‘నరకద్వారం’ అన్నారు; కామిని - కంచనాలు స్వర్గప్రాప్తికి అడ్డుగోడలన్నారు కొందరు; స్ర్తి ‘మాయ’ పురుషుల జీవితాల్ని నాశనం చేస్తుందన్నారు. పురుషులు అపవిత్రులు కావడానికి, వికారాలకు లోనవడానికి ‘ఆడదే’ కారణమని స్ర్తిలపట్ల హీనమైన భావాలు రేకెత్తించారు.
స్ర్తి మాయ కాదు.. కామక్రోధాది అరిషడ్వర్గాలు మాయ.. అవే మానవులను పతితులుగా చేస్తాయి. అది గ్రహించలేక, గ్రహించినా జీర్ణించుకోలేక స్ర్తిని విలాస వస్తువుగా, ఆటబొమ్మగా, పురుషుల అవసరాలు తీర్చేందుకే పుట్టించబడినట్లు భావించడంతోనే ఎంత ఎదుగుతున్నా స్ర్తిని గౌరవించలేకపోతున్నారు.. తన పుట్టుకకు కారణం స్ర్తియే అని గ్రహించినా, ఆమె పట్ల మాతృభావం చూపలేకపోవడం దౌల్భల్యం! దౌర్భాగ్యం!!
కాలగమనంలో స్ర్తిల దురవస్థను బాగుపరచాలని,
వారిని పరదాల మాటునుంచి బయటకు తెచ్చి తిరిగి పూర్వ వైభవం కలిగించాలని.. పూజనీయులు, చిరస్మరణీయులు, సంఘ సంస్కర్తలు అయిన కొందరు మహానుభావులు ఈ కార్యక్రమానికై నడుం బిగించి నిలబడ్డారు. ఎన్నో కష్ఠనిష్ఠూరాలకోర్చి, స్ర్తి సహగమనం, బాల్య వివాహాలు, కన్యాశుల్కం లాంటి దురాచారాలను రూపుమాపి స్ర్తి విద్యను ప్రోత్సహించారు. కళ్ళు తెరచి తనను తాను తెలుసుకున్న స్ర్తి ధైర్యంతో ముందడుగు వేసింది. ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్..’ అన్నట్లు అన్ని రంగాలలో.. చదువు సంధ్యలలో, ఆట పాటలలో, సంగీత సాహిత్యాల్లో... ఇది అది అననేల - అన్నిటా దూసుకుపోతోంది, పరుగులు పెడుతోంది పురుషులతో సమానంగా.. ఒక్కోచోట వారికన్నా మిన్నగా రాణిస్తోంది నేడు మహిళ!
సర్వశక్తివంతుడైన పరమాత్మ, జ్ఞానకలశాన్ని స్ర్తికి ఇచ్చాడట! స్ర్తిలో అంతులేని సృజనాత్మకత, దృఢమైన శక్తి, ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని, ఎదుర్కొని నిలబడగలిగిన ఆత్మస్థయర్యం, సహనం, కష్ట సహిష్ణుత, సహృదయత, క్షమ దాగి వున్నాయి. అందుకే అంటారు ‘శిశువుల పాలన- పోషణ’ కోసం దేవుడు తనకు మారుగా స్ర్తిని సృష్టించాడు భూమి మీద అని. దానికి ఉదాహరణ...తల్లిగా సేవలందించే స్ర్తి. వనిత నిద్రిస్తే లోకమంతా చీకటేట!
అన్ని రంగాలలో దూసుకుపోతున్న స్ర్తి ఇటు ‘ఉయ్యాలలూపుతోంది, అటు ఊళ్ళూ ఏలుతోంది సమర్థవంతంగా! ఆమెలో దాగి యున్న శక్తియుక్తులు తన సంసారంతో పాటు సమాజాన్ని, దేశాన్ని కూడా తీర్చిదిద్దడానికి వినియోగింపబడాలి. నైతికంగానే కాక, ఆధ్యాత్మికంగా కూడా మహిళ కొంత ఎదగాలి. ఆమె శక్తి సామర్థ్యాలను జాగృతం చేసి, వికసింపజెయ్యాలి (దీనికి ఆమెను కన్నవారు, కట్టుకున్నవారి తోడ్పాటు ఎంతో అవసరం). జాగృతం చెయ్యడమంటే హక్కులు- పోరాటాలకు సిద్ధపడటంకాదు. హక్కులతో పాటు బాధ్యతలు కూడా వుంటాయని గుర్తించాలి. ఆ బాధ్యతలను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించగలిగినపుడు హక్కులు వాటంతట అవే వస్తాయి. ఇంకొక విషయం.. మహిళ తనలో దాగివున్న కళలను ప్రలోభాలకు లోనై, ఒక విలాస వస్తువుగా, వ్యాపార వస్తువుగా మారకుండా, తన ఉనికిని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. సమాజ నిర్మాణం స్ర్తి చేతిలో వుంది. ఆమె గౌరవాన్ని కాపాడడం పురుషుల చేతిలో ఉంది!
‘భారతనారి’ సర్వసమర్థురాలు ‘నాడూ - నేడూ’! పెద్దమనసుతో ఆమెను గౌరవించగలిగిననాడు.. ఆమెకు ఏ దినోత్సవాలు (ఏడాదికోసారి) జరపవలసిన అగత్యం వుండదు!

-రేవతి