సబ్ ఫీచర్

అమ్మాయిల్లోనే అద్భుత శక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రపంచమంతా నేడు బాలికల వైపు ఆసక్తిగా చూస్తోంది.. అసాధ్యాలను సుసాధ్యం చేసే అద్భుత శక్తి అమ్మాయిల్లోనే ఉంది.. విశ్వవ్యాప్తంగా చట్టసభల్లో, న్యాయస్థానాల్లో, కార్పొరేట్ సంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో మీ భాగస్వామ్యం పెరగాలి.. ఇవన్నీ నెరవేరాలంటే అక్షరాస్యతలో బాలికలు అగ్రభాగాన నిలవాలి..’- అంటూ గతంలో అమెరికా చేపట్టిన ప్రచార ఉద్యమానికి దేశదేశాల్లో అనూహ్య మద్దతు లభించింది. బాలికల్లో అక్షరాస్యతా శాతం పెంచేందుకు వివిధ దేశాల్లో ప్రచారం చేస్తున్న అమెరికా మహిళలు తాజాగా లండన్‌లో కొన్ని పాఠశాలలను సందర్శించి ఎంతో భావోద్వేగంతో ప్రసంగించారు. బాలికల విద్య కోసం తాము ప్రచారోద్యమాన్ని చేపట్టామని వారు గుర్తుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా 62 మిలియన్ల మంది కౌమార బాలికలు చదువుకు నోచుకోవడం లేదని, అక్షరాలు నేర్చుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటే తప్ప వారు ఏదీ సాధించలేరని వారు వాపోతున్నారు. పేద బాలికలంతా బడిబాట పట్టినపుడే ఏ దైశమైనా అభివృద్ధి సాధిస్తుంది. బాలికల విద్య అన్నది ప్రచారం కోసం కాదని, దాన్ని ‘తీవ్రమైన ఆర్థిక అంశం’గా పరిగణించాలని సూచిస్తున్నారు. పేదరికం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది బాలికలు పనులకు వెళుతున్నారని, సమస్యల నుంచి గట్టెక్కి గెలుపుతీరాన్ని చేరాలంటే వారంతా చదువులో రాణించాలన్నారు. చిన్నపుడు ఏ మాత్రం తీరిక దొరికినా ఏదో ఒక పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో విజయం సాధించాలంటే అది మంచి విద్య వల్లే సాధ్యమని తల్లిదండ్రులు చెప్పాలి. సమస్యలు ఎదురైనపుడు నిరాశతో కుంగిపోరాదు. చదువు ద్వారానే దేన్నయినా సాధించవచ్చు అని గుర్తించాలి. మతానికో, పేదరికానికో భయపడి బాలికలు బడికి దూరం కావాల్సిన అవసరం లేదు. కుటుంబ నేపథ్యం ఎలాంటిదైనా చదువుకోవడం బాలికల కనీస హక్కు అని గుర్తు చేస్తుకోవాలి. చాలా దేశాల్లో చదువుకోవాలనుకునే బాలికలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బాల్య వివాహాలు, యుక్తవయసు రాకుండానే గర్భధారణలు, లైంగిక వేధింపులు, లింగ వివక్ష వంటివి బాలికల పాలిట శాపంగా మారుతున్నాయ. పేదవర్గాల్లో అమ్మాయిల గురించి కుటుంబ పెద్దలు ఆలోచించక పోవడం దారుణం. ఎలాంటి సమస్యలనైనా బాలికలు భరించాల్సిన పనిలేదు. బాలికల వి ద్య కోసం ఇతర దేశాల్లో సైతం భారీగా నిధులను ఖర్చు చేస్తున్న బ్రిటన్ పాలకులను అభినందించాలి. పేద దేశాల్లో బాలికల విద్యకు అన్ని దేశాలూ బ్రిటన్ మాదిరి స్పందించాలన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ, బాలికల ప్రగతి వంటి విషయాల్లో అమెరికా, బ్రిటన్ భాగస్వాములు కావడం ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకమన్నారు. బాలికల విద్య అన్నది ప్రపంచపు సమస్య.. ప్రపంచం కదిలితేనే ఆ సమస్యకు పరిష్కారం సాధ్యం. అమ్మాయిలు అందమైన వారే కాదు, శక్తిమంతులు కూడా. బాధ పడడం కాదు.. అందులోంచి బయటపడాలి.. ఆలోచించాలి.. అక్షరదీక్షతో ముందుకు సాగాలి.. కలల్ని నిజం చేసుకోవాలి.

-ఉషశ్రీ తాల్క