సబ్ ఫీచర్

ఆలోచన మార్చుకుంటే అడుగు ముందుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలవంతపెడితే అమృతం కూడా చేదుగా ఉంటుంది. కష్టంగా ఏదైనా చేయమంటే బాధేస్తుంది.
అదే ఇష్టమైతే ఎంత కష్టమైనా సులభంగా చేసే పనిని మెళుకువతో నేర్పుగా చేసేస్తారు.
ఏతరానికైనా చదువే ముఖ్యాధారం భవిష్యత్తుకు. కాని ఈ మధ్య మా పిల్లవాడు ఇది చదవాలి లేకుంటే మా అమ్మాయ ఇది చదవాలి ఇది చదివితేనే ఫలాన ఉద్యోగం వస్తుంది. అపుడే వాళ్లు ఆనందంగా గడుపగలుగుతారు అనే తల్లిదండ్రులు ఎక్కువై పిల్లలు పుట్టీ పుట్టకముందునుంచే వారి చదువుల కోసం కానె్వంటు వెతుకులాట మొదలుపెడుతున్నారు. కాని కొత్తగా తల్లిదండ్రులయ్యేవారిలో ఈ ధోరణిలో మార్పు వస్తోంది. బహుశా వారు పడిన మానసిక ఇబ్బందులు వారి పిల్లలు పడకూడదనే ధ్యాసే వారిని ఇలా ఆలోచింపచేస్తోంది ఏమో.
బలవంతపెడితే అమృతం కూడా చేదుగా ఉంటుంది. కష్టంగా ఏదైనా చేయమంటే బాధేస్తుంది. అదే ఇష్టమైతే ఎంత కష్టమైనా సులభంగా చేసే పనిలో మెళుకువతో నేర్పుగా చేసేస్తారు. అందుకే రాబోయే తరం గురించి కొత్త తల్లిదండ్రుల ఆలోచన చూద్దామా..
వీరిలో మా పిల్లలు అది చదువుతే గొప్పవాడు. ఇది చదివితేనే గొప్పవాడు అని ఆలోచన మారింది. ఏది చదివినా ఉన్నత భావాలతో జీవించాలి. ఈ దారిలో నేటి తరం పరుగెడుతోంది.
ఇంటర్ అవగానే డిగ్రీల వైపు పరుగులు తగ్గించి టెక్నికల్ వైపు ఆటల వైపు దృష్టి సారిస్తున్నారు. వినోదాలను పంచే సినీ ఇండ్రస్టీట్ అంటే నేటి తల్లిదండ్రులు ఒక్కసారి వద్దని చెప్పేవారు. కాని ఇపుడు ఆ సినిమా ప్రొడ్యూసర్‌గా ఎదగాలనిఅనుకొనేవారు, ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి సక్సస్ పొందుతున్నవారు కనబడుతున్నారు. వారి దోవలో ఇంకొద్ది మంది నడిస్తే అక్కడా మంచి వినోదాత్మక ఆలోచనాత్మక సినిమాలు రావచ్చు.
మరికొందరు ఆటలపై మక్కువ చూపుతున్నారు. క్రికెట్ కోచింగ్ తీసుకొంటున్నారు. మరికొందరు సంగీతం వైపు మక్కువ చూపుతూ వివిధ వాయద్యాలను వాయంచడమో లేక గొంతెత్తి పాడడమో చేస్తున్నారు. ఈ సంగీత ప్రపంచంలోనూ మాస్టర్ డిగ్రీలు పొందేవారున్నారు. సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగే అవకాశాలున్నాయ. ఈ తరం పిల్లలు వారికి నచ్చిన రంగంలో కృషిచేస్తూ తమకు నచ్చిన రంగంలో ఎదగడానికి పునాదివేస్తున్నారు.
మాకు తెలిసిన ఒక అబ్బాయ శశి ఎమ్‌సిఎ చదివాడు, అయితే గ్రాఫిక్స్ అంటే ఇష్టము, కంప్యూటర్ బిజినెస్ చేస్తూ గ్రాఫిక్స్‌ను, పిక్చర్స్‌లో వర్క్ చేస్తున్నాడు. భార్య ఇంజనీర్ చదివి భర్తకు చేదోడుగా ఆఫీసు వర్క్ చూసుకుంటుంది. మార్కెటింగ్ అంతా శశి చూసుకుంటాడు.
కొందరు ఒక పనిలో చేరి అది శారీరానికి లేక వారి ఆరోగ్యానికి సరిపడకపోతే వారు వారి ఆలోచనలు మార్చుకుంటూ మరో ఉద్యోగానే్వషణలో ముందుకు పోతున్నారు. ఈ మధ్య ఒక బిటెక్ చదివి ఇంజనీర్ చేసిన వ్యక్తి కంపెనీలో వర్క్ చేసేవాడు. అయితే నైట్ డ్యూటీవల్లఉద్యోగం చెయ్యలేక పోయాడు. బాగా ఆలోచించాడు.
తనకు కంపెనీ ఉద్యోగాలు కుదరవు. అందుకని ఎమ్.టెక్ చదివి లెక్చరర్‌గా వెళ్ళాలనుకున్నాడు. అదే విషయం తండ్రితో అంటే సరే నీ యిష్టం అన్నాడు. అలా తన కెరీర్‌ను మార్చుకుని ఇప్పుడు లెక్చరర్‌గా చేస్తూ నచ్చిన ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాడు.ఇలా ఎంతో మంది తమకు నచ్చిన కెరీర్‌లో సక్స్‌క్స్ కోసం తాపత్రయ పడుతున్నారు. ఒకే మూసలో ఉండాలని కాని అందరికన్నా తామే గొప్పవారిగా ఉండాలన్న ఆలోఛనలు మారుతున్నాయ. ఇవి మంచి మార్పు. దీన్ని అందరూ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎవరికి వారు మొదటి ర్యాంక్ రావాలనుకొంటే మిగతా వారు ఎక్కడ ఉంటారు. ఫస్ట్ రాలేదని ఆత్మహత్యలకు పోక డిప్రెషన్‌కు లోను కాక ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా చేసుకొంటూ ముందుకు పోవడమనేది హర్షించదగిన వియం.
దేనికైనా పట్టువిడుపు ఉండాలి.
మనిషి జీవితానికి చదువే పరమావధి కాదు. సక్సెస్ ఫుల్‌గా జీవితాన్ని మలచుకోవడానికి అవకాశం కావాలి. ‘అమ్మానాన్నల్ని ఎదిరించి జీవితం లేదు, పిల్లల్ని బెదిరించి జీవితం లేదు. ఒకళ్ళకొకళ్ళు అవగాహన కల్గి జీవితాన్ని అర్ధం చేసుకోవాలి. ఈ చదువుకోకపోతే ఇంకొక చదువు ఈ ఏడాది కాకపోతే ఇంకో ఏడాది, ఈ వృత్తి కాకపోతే ఇంకో వృత్తి, ఇలా విశాల హృదయంతో ఆలోచించి జీవితానికి బంగారు భవితగా మల్చుకోవాలి. వృత్తితోపాటు ఆనందానికి, కీర్తికి మరో ప్రవృత్తి పరంగా ఉంది. దీన్ని ఎంపిక చేసుకుని జీవితాన్ని సుగమనం చేసుకోవాలి. అందరు ఇంజనీర్స్ చదివినా వివిధ రంగాల్లో సెటిల్ అవుతున్నారు.కొందరు డైరెక్టర్స్ గాను, యాక్టర్స్ గాను, బిజినెస్‌లోను సెటిల్ అవుతారు. ఏది చేసినా న్యాయమైన మార్గంలో జీవించడమే మానవజీవిత ధ్యేయము, మనిషి ఎదుగుదల ముఖ్యము. నేటి విద్యార్థుల్ని వచ్చిన మార్గం వైపు సుగమనం చెయ్యనివ్వండి బెస్ట్ ఆఫ్ లక్!!!

-వాణీ ప్రభాకరి సెల్: 8523024168