సబ్ ఫీచర్

ఇది సహజమే అయనా.. జాగ్రత్త అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల్లో మూత్ర నాళ ఇనె్ఫక్షన్లు ఎక్కువ. వీటి బాఠిన పడితే మంట, నొప్పి, తరచూ మూత్రానికి వెళ్ళాల్సి రావడం వంటివి తరచూ వేధిస్తుంటాయి. ఈ సమస్యను ఒకరితో చెప్పుకోలేరు. ఆసుపత్రికి వెళ్ళడానికి భయపడతారు. తమలో తాము బాధను అనుభవిస్తూ ఉంటారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపిస్తే తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాలి. లేదా ఈ మూత్ర నాళ ఇనె్ఫక్షన్లు పెరుగుతూ ఇతర అవయవాలకు కూడా చేరే ప్రమాదముంది. మూత్ర నాళ ఇనె్ఫక్షన్లు యువతుల్లో, మధ్యవయస్సువారిలో ఎక్కువగా వస్తుంటాయి. మహిళల్లో వయసుతో పాటు మూత్ర కోశ వ్యవస్థ గోడలు బలహీనం అవుతాయి. దీంతో ఇనె్ఫక్షన్ల ముప్పూ పెరుగుతుంది.
సాధారణంగా ఈస్ట్రోజన్ హార్మోను సూక్ష్మక్రిములను చంపే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే మూత్రకోశ వ్యవస్థ గోడలు మందంగా, ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. అయితే నెలసరి నిలిచిపోయిన తర్వాత శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి తగ్గుతూ వస్తుంది. దీంతో సూక్ష్మక్రిములను నిర్మూలించే సామర్థ్యమూ తగ్గుతుంది. మూత్రకోశ గోడలూ బలహీనమవుతాయి. అలాగే యోనిలో మంచి బాక్టీరియా తగ్గి, చెడు బాక్టీరియా పెరుగుతుంది. మర్మాంగ ప్రాంతాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఎవరైనా చెబితే అందరూ ఛిఛీ అంటారు. కానీ సగానికి సగం జబ్బులు మర్మాంగాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లే వస్తాయని ఎంతమందికి తెలుసు?
అలాగే లోదుస్తులను ఆరునెలలకోసారి పడేసి కొత్తవాటిని ఉపయోగించాలి. లేదంటే బాక్టీరియా పెరిగిపోతుంది.. ఇలాంటి చిన్న చిన్న కారణాలే మూత్ర కోశ ఇనె్ఫక్షన్లను తెచ్చిపెడతాయి. అయితే తరచుగా మూత్ర కోశ ఇనె్ఫక్షన్ల బారినపడేవారు కొన్ని జాగ్ర త్తలతో వీటి ముప్పును తగ్గించుకోవచ్చు. లేదా వీటి బారిన పడకుండా చూసుకోవచ్చు.
* ఈ ఇనె్ఫక్షన్ల బారిన పడకూడదు అనుకునేవాళ్ళు తప్పనిసరిగా ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా మంచినీళ్ళను ఎక్కువగా తాగుతుండాలి. దీనివల్ల బాక్టీరియా శరీరంలోంచి మూత్ర ం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
* వారానికి ఒకసారైనా కొబ్బరినీళ్ళను తాగాలి. ఇది కడుపును శుభ్రం చేస్తుంది. అలాగే బార్లీ నీళ్ళను కూడా తాగడం వల్ల మూత్ర కోశము, మూత్ర నాళాలు శుభ్రపడతాయి.
* మూత్ర కోశ ఇనె్ఫక్షన్లకు కారణమయ్యే వాటిలో ఇకొలి ప్రధానమైంది. ఇది మలం నుంచి మూత్ర కోశంలోకి వ్యాపిస్తుంది. అందుకే మహిళలు మలవిసర్జన అనంతరం ముందు నుంచి వెనుకకు కడుక్కోవడం మంచిది. తల్లులు తమ పిల్లలకు చిన్నవయస్సు నుంచే ఇది నేర్పించడం చాలా మంచిది.
* మూత్ర ఇనె్ఫక్షన్ల బారిన పడిన స్ర్తీలకు డాక్టర్లు లాక్టోబాసిల్లస్ మాత్రలను ఇస్తారు. ఇది యోనిలోని మంచి, చెడు బాక్టీరియాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూస్తాయి. ఇవి తరచుగా మూత్ర ఇనె్ఫక్షన్ల బారినపడే స్ర్తీలకు బాగా ఉపయోగపడతాయి.
* మూత్రం ఆపుకోలేని సమస్య ఉన్నవారు కూడా మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. ఎందుకంటే వీరు మూత్రం ఎక్కడ లీకవుతుందోనని భయపడుతూ నీళ్లు అంతగా తాగరు. ఇది శరీరంలో ఇనె్ఫక్షన్ పెరగడానికి దారితీస్తుంది.
* అలాగే సంభోగాననంతరం తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయడం వల్ల మూత్ర కోశంలోకి బాక్టీరియా చేరే అవకాశం తగ్గుతుంది.
ఇలాంటి చిన్న చిన్న జాగ్ర త్తలవల్ల బాక్టీరియా మూత్ర కోశంలోకి, నాళాల్లోకి చేరకుండా ఉంటుంది. ఫలితంగా ఇనె్ఫక్షన్లు దరి చేరకుండా ఉంటాయి.

- సరస్వతి