సబ్ ఫీచర్

ఓ మహిళా నీ పయనమెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మా అమ్మాయి నగరంలో ఎం.బి.ఏ. చదువుతోంది.’’
‘‘మా అమ్మాయి ఫలాన ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది.’’
‘‘మా అమ్మాయి ఫలాన రంగంలో ఉన్నత స్థాయిలో ఉందని’’ వారి వారి కన్నవాళ్ళు ఆనందంగా చెప్పుకున్నంత సేపు పట్టలేదు.
‘‘మీ అమ్మాయి హాస్టలు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని’’
‘‘మీ అమ్మాయి హాస్టలు పై అంతస్థునుండి క్రిందికి దూకి ఆత్మహత్య చేసుకుందని
‘‘మీ అమ్మాయి స్నేహితుడి చేతిలో హత్యగావింపబడింది’’అని తెలియడానికి ఆ కన్నవాళ్ళకి పై ఉదాహరణలను గమనిస్తుంటే ఓ ప్రక్క అమ్మాయిలు బాగా చదువుకుని అన్ని రంగాలలో ముందంజలో ఉండగా మరో కోణంలో ఇలా ఆత్మహత్యలకో హత్యలకో గురికావటం మనం అభివృద్ధి దిశగా వెళ్తున్నామా? వెనక్కి వెళ్తున్నామా అనక మానదు.
వారి జీవితాలు పైకి వెలుగులు చిమ్ముతున్నా వారి వ్యక్తిగత జీవితాల్లో మాత్రం చీకట్లు ఆవరించుకుని ఉంటాయి.
బయట నిత్యం జరిగే ప్రమాదాలతో కొందరి జీవితాలతో పోల్చవచ్చును. క్రమశిక్షణతో నియమ నిబంధనలను పాటిస్తూ సవ్యంగా సాగిపోయే వాహనాలు ప్రమాదాలకు గురికావు. అదే అదుపుతప్పి గాడితప్పి నడిచే వాహనాలకు ప్రమాదాలు తప్పవు.
ఒక్కోసారి నెమ్మదిగా సవ్యంగా వెళ్తున్న వాహనాలకు ఎదురుగా అదుపుతప్పి వచ్చిన వాహనాలు కూడా ప్రమాదాలకు గురిచేస్తుంటాయి.
ఇదే విషయం కొందరికి జీవితాలకు వర్తిస్తుంది.
తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను వాళ్ళు సద్వినియోగం చేసుకోక దుర్వినియోగం చేసుకోవడంలో ఇలాంటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు.
స్నేహాల పేరిట - ఆధునికత పేరిట విచ్చలవిడితనం ఎంతమాత్రం పనికిరాదు.
మరికొందరు బుద్ధిగా కుదురుగాఉన్నా వారిమానాన వారిని ఉండనివ్వరు కొందరు పోకిరీలు.
వారిపై కూడా దాడులు చెయ్యటం ప్రేమించడం లేదని- తనకు లొంగలేదని ప్రాణాలను సైతం తీయటం మన వార్తల్లో చూస్తుంటాము.
ఇంకా వెలుగులోకి రాని సంఘటనలెన్నో.
కుటుంబ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతుందనే భయంతో ఇలాంటివి బయటికి చెప్పుకోరు.
మహిళలు ఎంత సాధికారిత సాధించినా ఆమె జీవితంలో చీకటి కోణం ఉంటూనే ఉంటుంది.
ఎవరికో ఏ కొద్దిమందికో తప్పితే చాలామంది ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్ళకు సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగతమైన ఎన్నో సమస్యలు ఉండనే ఉంటాయి.
అంటే ఆమెకు తెలియకుండా భర్త రెండో వివాహం చేసుకోవడం- లేదా సహ జీవనం చెయ్యడం లేదా తన సంపాదన అంతా వ్యసనాలకు- వ్యాపారాల పేరిట తగిలెయ్యడం లాంటివి.
కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి వాటిని సహిస్తూ భరిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నవాళ్ళూ ఉన్నారు.
ఉద్యోగాల పేరిట- తమ వృత్తుల పరంగా బయట తిరిగే మహిళల జీవితాలు ఒక్కోసారి ప్రమాద భరితంగా మారుతుంటాయి.
ఎక్కువ శాతం మంది యిలాంటి కోవకి చెందినవాళ్ళే పలు యిక్కట్లను ఎదుర్కొంటూ ఉంటారు.
ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుంటూ బ్రతికే పనిమనుషులు సైతం వీటికి అతీతులు కారు.
వయస్సులో ఉన్న తమ పెళ్ళాలు పనికి వెళ్ళినప్పుడు అక్కడ యజమానులయిన మగవాళ్ళ చేత ఏ అఘాయిత్యానికి గురువుతారోననే శంకించి వాళ్ళు ఆ యింట్లో పనిచేస్తున్నంత సేపు కాపలాగా ఆ యింటి ముందు తచ్చాడుతుండడం లేదా యింటికి వచ్చాక తప్పత్రాగి వారిని చావగొట్టడం చేస్తుంటారు.
చివరగా- నేను చెప్పదల్చుకున్నది. నా ఉద్దేశ్యం ప్రకారం మహిళలు అన్ని రంగాలలో ఉన్నతంగా ఎదిగి ఉండవచ్చు- విమానాలను రైళ్ళను, ఆటోలను నడిపించి ఉండవచ్చు. అంతరిక్షంలో ప్రయాణించి ఉండవచ్చు.
కాని అదే క్రమంలో బాలికలనుంచి ప్రౌఢలు- వృద్ధ మహిళలవరకు ఎన్నో దురాగతాలకు గురవుతున్నారు. బయట ఎన్నో సత్కారాలను గౌరవాలను పొందినవారు సైతం తమ వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు.
మరెంతో మంది ప్రాణత్యాగాలకు సిద్ధపడ్తున్నారు. వారి ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తున్నారు. ఉద్యమాలను నడిపించే వారిని సైతం హేళనగా మాట్లాడుతున్నారు.
ఇంకా ఇలాంటి వాటిని అధిగమించి- సవాళ్ళను స్వీకరించి ముందుకు సాగాలంటే ఇంకా చాలా కాలం పట్టవచ్చు.

- షహనాజ్, అనంతపురం