సబ్ ఫీచర్

సోజో సొగసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తదనం.. ఎటుచూసినా వైవిధ్యమే.. ఇదే నేటి యువత జపం! అందుకే దుస్తులకే పరిమితమైన కలనేతలు నేడు నగల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఫలితంగా పుట్టుకొచ్చినవే సరికొత్త సోజో సొగసులు. మీనాకారీ, థెవా, విక్టోరియన్ డిజైనుల కలబోత.. సోజో! సోజో అనేది గ్రీకుపదం. దీనికి అర్థం పరిపూర్ణత్వం. బంగారానికి రంగుల్ని అద్దుతూ వజ్రాలు, కెంపులూ, పచ్చలూ, నీలాలు.. వంటివాటిని జోడిస్తూ విక్టోరియన్ శైలిలో అందమైన నగలుగా మలచడమే ఈ సోజో ఆభరణాల ప్రత్యేకత. సాధారణంగా ఆభరణాల్లో బంగారం, రాళ్ళ మెరుపులూ కనిపించడం సహజం. కానీ ఇప్పటి యువత ఏవైనా కొత్తదనం ఉంటే తప్ప వాటి జోలికి వెళ్లరు. దాంతో పసిడి డిజైనర్లు కొత్తందాల వేటలో పడుతుంటారు. అందుకే కళాత్మకమైన మీనాకారీ, థెవా పనితనానికి విక్టోరియన్ తరహా డిజైన్లను జోడించి అద్భుతమైన సోజో అందాల్ని సృష్టిస్తున్నారు కొంతమంది డిజైనర్లు. మీనాకారి పనితనం చాలా కష్టమైనది.. సంప్రదాయమైనది.. అద్భుత కళ. పర్షియన్ కళాకారుల కళైన మీనాకారి మంగోలుల ద్వారా మన దేశానికి వచ్చింది. బంగారు రేకులపై నీలం, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్ని అద్దుతూ పువ్వులూ, ఆకులూ, పక్షులూ, జంతువులూ.. ఇలా రకరకాల డిజైన్లు కనిపించేలా తయారుచేయడమే మీనాకారీ కళ గొప్పతనం. ఇలాంటిదే థెవా కళ కూడా. 23 కారెట్ల పలుచని బంగారురేకుని సూదిలాంటి సన్నని పరికరంతో జంతువులూ, పక్షులూ, కొమ్మలు, పూలూ.. వంటి అందమైన ఆకారాల్లో చెక్కి లక్క సాయంతో రంగుల గాజులపై అతికించే అరుదైన కళే థెవా. సుమారు నాలుగు వందల ఏళ్ళ క్రితం కనుగొన్న ఈ కళకు మీనాకారి పనితనాన్ని విక్టోరియన్ తరహా డిజైన్లనూ జోడించి సోజో నగల్ని తయారుచేస్తున్నారు నేటి నగల డిజైనర్లు. ఈ నగలు చూడటానికి ఓ అద్భుత కళాఖండాలుగా ఉంటాయి. అందుకే సోజో నగల సోకులు చూశాక.. వాటిని అలంకరించుకోవాలన్న తపన అమ్మాయిల్లో పెరిగిపోతోంది. ఇలాంటి కళాత్మకమైన ఆభరణాలు చూశాక కోరికలను అదుపులో ఉంచడం కష్టమే మరి!
*