సబ్ ఫీచర్

సృజనాత్మకతను పెంచే ఎంగేజ్‌మెంట్ క్లాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది నాలుగుగోడల మధ్యన సంభాషణేనా? నాలుగు గోడలను పెకలించి సమాజంతో సంధానం చేయటమా? అనే సవాలును ఎదుర్కొంటున్నది జ్ఞానం. జ్ఞానం కోసమే అని కొందరనేవారు. కానీ నేడు జ్ఞానం సమాజం కోసమనే భావన ప్రపంచమంతటా విస్తరించింది. అదే కోణంలో చర్చించబడుతున్నది. చదువు పూర్తయిన తర్వాత ఆ చదువు వాడకం గురించి ఆలోచించటం వెనుకటి పద్ధతి. కానీ ఈనాడు తరగతి గదిలో నేర్చుకున్న విషయాన్ని నైపుణ్యాన్ని విద్యార్థి ప్రేరణ పొందగానే దాన్ని కుటుంబంలోకి తీసుకెళతాడు. ఉదాహరణకు ఒకనాడు సైన్స్ క్లాస్‌లో నీటి పరిశుభ్రతను పరిశీలించడానికి ఒక ద్రావకం వాడుతారని చెప్పారనుకుందాం. ఒక టెస్ట్‌ట్యూబ్‌లో నీరు తీసుకుని ద్రావకాన్ని కలుపగానే దానిలో వున్న పురుగులు బైటకువస్తాయి. విద్యార్థి అది చూసి హడలిపోతాడు. క్లాసు పూర్తయిన తర్వాత ఆ ద్రావకాన్ని టీచర్ దగ్గరనుంచి సంపాదించుకుంటాడు. దాన్ని తీసుకువెళ్లి తన ఇంటిలో నీళ్లలో కలుపుతాడు. ఇంటిల్లిపాదిని పిలిచి తమాషా చూడండి అని చూపుతాడు. నిత్యం తాము తాగే నీటిని మగ్గులోపోసి రెండు ద్రావకం చుక్కలు వేస్తాడు. ఆ నీటిలో పురుగులన్నీ బైటకువస్తాయి. పిల్లవాడు ఎగురుతాడు. తల్లి మాత్రం ఆ పురుగుల నీళ్లుచూసి తల్లడిల్లుతుంది. ఈ పురుగుల నీళ్లా మనం తాగేది అంటుంది. భర్త రాగానే ఈ పురుగుల నీళ్లను చూపుతుంది. మనం త్రాగే మున్సిపల్ నీళ్లల్లో ఎన్ని పురుగులో చూడమని చూపుతుంది. తన కొడుకు చేసిన ప్రయోగాన్ని భర్తకు చూపుతుంది. ఈ విషయం చుట్టుపక్కలవారికి నలుగురి నోళ్లలో పడుతుంది. ఆ నలుగురు నలభై మంది నాలుగువందల మందిగా మారి పెద్ద వూరేగింపు నిర్వహిస్తారు. ‘‘ఈ కలుషిత నీళ్లు మాకొద్దు’’అనే నినాదం హోరెత్తుతుంది. చివరకు అది శాంతిభద్రతల సమస్యగా మారుతుంది. ఇదే సమస్య ఎస్.పి. దగ్గరకు వెళుతుంది. ఎవరు దీనికి కారకులని ఆ అధికారి ఆరా తీస్తాడు. అసలు ఈ పాఠం చెప్పిన పంతుల్ని పట్టుకురండి అని అధికారి అంటాడు.
ఈ సంఘటననే చదువు సమాజానికి జోడించటానికి బలమైన ఉదాహరణగా చెప్పవచ్చును. పిల్లలు చదువుద్వారా నేర్చుకునే నైపుణ్యాన్ని సమాజమనే ప్రయోగంలో పరీక్షకు గురవుతుంది. ఇది ప్రతి తరగతిలో జరుగుతుంది. ఈ విధంగా ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని పిల్లలకందిస్తే, పిల్లలు దాన్ని సమాజానికందిస్తారు. అప్పుడు సమాజానికి తరగతి గది వ్యక్తిత్వం అర్థమవుతుంది. ఈనాడు ప్రతి దేశంలో ‘‘ఎంగేజ్‌మెంట్’’ క్లాసులు మొదలుపెట్టారు. ఒక చాప్టర్ పూర్తికాగానే నేర్చుకున్న నైపుణ్యాన్ని సమాజానికి ఎలా అందించాలో, సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో ఎంగేజ్‌మెంట్ క్లాస్ ద్వారా చెబుతారు. ప్రతి స్థాయిలో తరగతి గది సమాజానికి జవాబుదారీగా నిలుస్తుంది. ఇది చాలా కీలకమైంది. ఈనాటి విద్యార్థి గతం మాదిరిగా జీవితంలో స్థిరపడేంతవరకు తన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పరీక్షించకుండా ఉండలేడు. సమాజాన్ని అడుగడుగునా పరీక్షిస్తాడు. తన ప్రయోగశాలను సమాజ ఆకురాయిపై రుద్దుతాడు. తరగతి గదిలో చెప్పినటువంటి ఆర్థికశాస్త్రానికి సంబంధించిన డిమాండ్, సప్లయ్ థియరీని చదివితే ధరల పెరుగుదలవైపు విద్యార్థి తన దృష్టిని మరల్చుతాడు. ఈ ఆలోచనలు రాజుకోవటానికి ఎంగేజ్‌మెంట్ క్లాసులు దోహదపడతాయి. ఇది చదువుకు కొత్త భాష్యం.
నిజంగా ఇటువంటి విద్య విద్యార్థికి, సమాజానికి ఎంతో మేలు చేస్తుం ది. చదువుకున్న దాన్ని వాస్తవిక జీవితంలో అనువర్తింపజేయడానికి ఎంగేజ్‌మెంట్ క్లాసులు ఎంతో ఉపయోగపడుతున్నాయ. అన్నిస్థాయల్లోని విద్యార్ధుల్లో జిజ్ఞాసను, వాస్తవిక దృక్పథాన్ని పెంపొందింపజేయడానికి దోహదం చేస్తున్నాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

- చుక్కా రామయ్య