సబ్ ఫీచర్

అన్నింటికీ కారణుడు ఈశ్వరుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మానవ జీవితం అపురూపం, అమూల్యం. అం దులోను జీవకోటి యంతటిలో మానవ జన్మ మహత్తరమైంది. ఈవిషయాన్ని అందరూ గ్రహించాలి. కాని ఒక్కోక్కరు ఒక్కోలా వారికి ఎదురయన పరిస్థితులను బట్టి తామే అన్నింటికీ కారణంగా అనుకొంటూ ఉంటారు. అదే భ్రమలో బతికేస్తుంటారు. ఇంకా ఏదైనా నేను కాక మరెవరైనా చేశారా దేవుడు ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయ అంటారు. ఒకవేళ వారు సుఖాల్లో తేలిపోతూ ఉంటే మేము కష్ట పడ్డాం కనుక మాకీ ఫలితాలు వచ్చాయ కాని కష్టం లేకుండా ఏదైనా ఫలితం వచ్చిందా ఇందులో దేవుడెక్కడ ఉన్నాడు అంటారు.
కాని ఇందులోని సూక్ష్మం తెలుసుకొనే వారు తక్కువ. ఎందుకంటే హిరణ్యకశ్యపుడు కూడా తానే మహావిష్ణువు కన్నా అధికం అనుకొన్నాడు. తానే బ్రహ్మకన్నా తెలివి గలవాడిని అనుకొన్నాడు. అందుకే మితిమించిన వరాలను కోరాడు. పొందాడు. కాని పోయే కాలం రాగానే హరి ఎక్కడ ఎక్కడా అంటూనే ఆయన చేతిలోనే కోరుకున్నట్టుగా నే పోవలసి వచ్చింది. మరి అపుడుకూడా పోకుండా ఉండగలిగాడా లేదు కదా. మరి అక్కడ భగవంతుడు ఉన్నట్టే కదా.
గజేంద్రుడు కూడా తన శక్తి నంతా ఒడ్డి చివరి నిముషం దాకా మొసలితో పెనుగలాడాడు. ఆఖరికి భగవంతుడా రక్షించు అన్నాడు. ఆయన రక్షణ అందక పోయేసరికి అందరూ ఉన్నాడు ఉన్నాడు అంటారే ఉన్నాడు అని చెప్పేవాడు ఉన్నాడా లేడా ఉంటే గింటే రాకపోయాడా అని మళ్లీ సందేహ పడ్డాడు.
కాని అన్యఆలోచనలు లేక ఠావుల్ తప్ప మూర్ఛవచ్చే ... ఇతః పరం బెరుగు కావవె ఈశ్వరా కరుణించవా అని అడిగిన వెంటనే మొసలి బారి నుంచి విడవడ్డాడు.
అది కథ అయనా మనం కూడా నిత్యజీవితంలో అనూహ్యసంఘటనలెన్నో చూస్తుంటాం. మనం అనుకొన్నది కాక మరొకటి జరుగుతుంది. మనకూ దానివల్ల లాభం కూడా వస్తుంది. అపుడు అనుకొంటాం. దైవ మాయ. లేకుంటే ఇదిదేకాని బలే జరిగిపోయంది అని జీవితంలో ఎప్పుడో ఒకపుడు ప్రతివారు అనుకొంటారు. కాని కష్టం ఏదీ లేకపోతే అపుడు భగవంతుని అనే్వషణ చేస్తుంటాము. రంధ్రానే్వషణ కు కూడా పూనుకొంటాం. అందుకే బాగా తెలిసినవారు, పండితులు ఇవేవీ లేకుండా ముందుగా నామస్మరణ చేయండి. మెల్లమెల్లగా అన్నీ అర్థం అవుతాయ.
తాను ఎవరోతనకు తెలుస్తుంది. భగవంతుడిని తెలుసుకొంటారు. అన్నీ సజావుగా సాగుతాయ అని అంటారు.అపుడే కూపస్తమండూకాల్లాగా ఆలోచించకుండా విషయాన్ని గ్రహించే దిశలోనే మార్పు తెచ్చుకుంటారు.
మహావిష్ణువు గురించి తెలుసుకొంటే మహావిష్ణు మాయగురించి కూడా తెలుస్తుంది. ధర్మం ఆచరిస్తూ ఉంటే అధర్మం చేయడం వల్ల ఎవరు నష్ట పోతారో తెలుస్తుంది. అధర్మం చేయడం ఎంత మంచిది కాదో కూడా తెలుస్తుంది. ఈ ధర్మాధర్మాల సూక్ష్మం తెలుసుకొనడం చేతకాదనుకొంటే అంటే ఒకరికి మంచి అని పించిది మరొకరికి చెడు అనిపిస్తుంది. పెద్ద చేప చిన్న చేపను మింగినట్టు అంతా ధర్మమే కనిపిస్తుంది. కాని అధర్మం కూడా అందులో మిళితమై ఉండిపోతుంది అప్పుడప్పుడు. అందుకే ప్రతి పనినీ భగవంతునికి అర్పించి చేస్తే మంచిచెడులను భగవంతుడు చూసుకుంటాడని పెద్దలు అంటారు. అంటే పని చేసేటపుడు తాను కేవలం నిమిత్తమాత్రుడని అనుకొంటే అధర్మభయం అంటదు అని అంటారు.

- ఆర్. పురంధర్