సబ్ ఫీచర్

తత్వజ్ఞుడు శుకమహర్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుకుడు వేదవ్యాసుని కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గ్రహమునందు ఆవుపాలు పితికినంత సమయం మాత్రమే గడుపుచుండెడివాడు. కానీ పరీక్షిత్తు మహారాజు అంత్యకాలంనందు అతని దగ్గర ఏడు దినాలు గడిపి అతనికి శ్రీమద్భాగవతం మొదలగు పురాణములు వినిపించాడు.
వ్యాస మహర్షి శివుని గురించి తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షం కాగా సుపుత్రుని ప్రసాదించమని ప్రార్థించగా నీకు సుపుత్రుడు జన్మించగలడని పరమేశ్వరుడు పలికి అదృశ్యడయ్యాడు. ఒకనాడు వ్యాసుడు అరణి మధించుచుండగా ఘృతాచి కన్పించింది. ఆమెను చూడగానే వ్యాసునికి కామవశుడైనాడు. ఘృతాచి తన్నుచూసి శపించునేమోనని చిలుక రూపం దాల్చి పొంచియున్నది. అంత వ్యాస మహర్షి వీర్యంస్కలనం వల్ల శుకుడు జన్మించాడు. పార్వతీ సహితుడై పరమశివుడు వచ్చి ఈ బాలునకు ఉపనయనం చేశాడు. దేవేంద్రుడు కమండలం ఇచ్చాడు. దేవతలు దివ్యవస్త్రం ఇచ్చారు. తండ్రి అనుమతి తీసుకొని శుకుడు బృహస్పతిని గురువు చేసుకొని ధర్మశాస్త్రం, రాజనీతి నేర్చుకొన్నాడు. విద్య పూరె్తైన పిమ్మట శుకుడు తన తండ్రియగు వ్యాసుని ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు. వచ్చిన శుకుని కౌగిలించుకొని గౌరవించాడు. ముని బాలకులతో శుకుడు ఆటపాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడు. అది గ్రహించి తండ్రి కుమారుని దగ్గరకు పిలిచి.. నాయనా! నీవు జనకుని వద్దకు వెళ్లి మోక్షమార్గం తెలిసికొని రమ్మని పంపాడు.
శుకుడు తిన్నగా మిథిలానగరం చేరి తన రాకను జనకునకు తెలియజేయండని ద్వారపాలకులను లోపలికి పంపాడు. వార్త తెలియగానే సపరివారంగా ఎదురేగి జనక రాజు శుకుని లోనికి ఆహ్వానించాడు. కాంచన సింహాసనం చూపాడు. కుసుమాలచే అతని పూజించాడు. శుకుని రాకకు కారణం అడుగగా, శుకుడు జనక మహారాజు మా తండ్రిగారి ఆదేశానుసారం మీ వద్ద మోక్షమార్గం తెలిసికొనగోరి వచ్చానని వౌనం వహించాడు. జనకుడు శుకునకు అనేక విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు పరమ శాంతుడై జనకుని వద్ద సెలవు తీసుకొని తిన్నగా తండ్రిగారి వద్దకు వచ్చాడు. శుకుడు వ్యాసుని వద్దనే వుండి కాలక్షేపం చేస్తున్నాడు.
శుకునకు వ్యాస మహర్షి సృష్టిరహస్యములను తెలిపాడు. ఎన్నో పరమ రహస్య విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు అవధూతయై తండ్రి ఆజ్ఞ గొని ఎచటను ఉండక భూభాగం అంత సంచరించసాగాడు. ఆ సంచారంలో అతడు పరీక్షన్నరేంద్రుని వద్దకు రాగా ఆ రాజు శుకుని పూజించి ఏడు దినంలలో ముక్తి లభించినట్లు చేయమని అర్థించాడు. అంత శుకుడు తండ్రిగారిచే వ్రాయబడిన భాగవత కథను ఏడు రోజులు విన్పించి ఈ రాజును మోక్షమార్గుని చేశాడు. భాగవతాశ్రవణంలో పరీక్షిత్తు ముక్తినొందాడు. శుకుడు సంచారం పూర్తిచేసుకొని తిరిగి తండ్రిగారి ఆశ్రమానికి చేరి ఆయనవద్దనే సుమంత మొదలైన వ్యాస శిష్యులతో గూడి వేదాధ్యయనం చేశాడు.
ఇట్లుండ ఒకనాడు నారద మహర్షి వ్యాసాశ్రమంనకు రాగా శుక మహర్షి ఆ నారద మహర్షికి సుఖాసనం చూపి మహర్షి! ఈ లోకాన పుట్టినవానికి హితమేదియో తెలియజేయమని అడిగాడు. నారదుడు వివరించి చెప్పగా శుకుడు యోగి అయినాడు. శుకుని చూచి అప్సరసలు సిగ్గు విడిచి నగ్నంగా ఉండిపోయేవారు. అందుకు శుకుని యోగి ధర్మమే కారణం. కాని వ్యాస మహర్షిని చూచి వారు వలువలు దరించేవారు. శుకుడు అసక్తత గలవాడనియూ తాను సక్తతగలవాడని వ్యాసుడు కుమారుని గొప్పదనమునకు ఆనందించేవాడు. పుత్రుడి మహోన్నతకు సంతోషపడేవాడు. శుకుని పోలిన తత్వజ్ఞుడు యోగీశ్వరుడు మూడు లోకాలలోన లేడు. ఇది త్రికాల సత్యం. పరమ శివుని వరంతో జన్మించిన శుకుడు పరమ యోగీశ్వరుడు. శుకుని రూప సౌందర్యానికి ముగ్ధురాలై రంభ తనను అనుభవించి తృప్తిపర్చమంది. శుకుడు తుచ్ఛ సుఖములాశించనని ఆమెను నిరాకరించాడు. ఈ విషయం శుకరంభా సంవాద రూపమున లోకమందు ప్రసిద్ధి చెందింది.

-కురువ శ్రీనివాసులు