సబ్ ఫీచర్

హిందూ సమాజంపైనే ఎందుకు దాడి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సమాజంలో సంప్రదాయక నీతి, సౌశీల్యం, నిజాయితీ, అనుబంధాలు వగైరా ఉత్తమమైన, సహజమైన సాంఘిక లక్షణాలు అడుగంటిపోవడానికి కొన్ని తమాషా కోర్టు తీర్పులు- తెలిసో తెలియకో దోహదం చేస్తున్నాయి. శని సింగణాపూర్ దేవాలయంలోకి స్ర్తిలను అనుమతించకపోతే ఆరు నెలలజైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని డిహెచ్ వాఘేలా, ఎంహెచ్ సోసక్‌లతో కూడిన బొంబాయి హైకోర్టు ధర్మాసనం గత మార్చి 30న తీర్పు ఇచ్చింది. ‘పురుషులు లోనికి వెళ్లినప్పుడు స్ర్తిలు ఎందుకు వెళ్లలేరు? మహిళల హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వం విధి’ అని ఆ కోర్టు వ్యాఖ్యానించింది. ‘శబరిమలై ఆలయంలోకి స్ర్తిలను ఎందుకు అనుమతించకూడదు?’ సుప్రీంకోర్టు ఉవాచ. అయితే ‘అవిచ్ఛిన్నంగా సాగుతున్న దేవాలయాల ఆచార సంప్రదాయాల జోలికి కోర్టులు వెళ్లకూడదు. ఈ తీర్పులు అక్కడ పనిచెయ్యవు’ అని ఈ మధ్యనే తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును బొంబాయి హైకోర్టు ఎందుకు పెడచెవిన పెట్టిందో తెలియదు! సుప్రీంకోర్టు విషయం కూడా తెలీదు. పైవిధంగా శాసించే ముందు గౌరవనీయులైన బొంబాయి హైకోర్టు వారు, స్ర్తిలను అనుమతించకపోవడం అనే నియమం శనిసింగణాపూర్‌లోను, శబరిమలైలోను ఎందుకు ఎప్పటినుంచి ఎవరివల్ల ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో పరిశీలించి ఉండాల్సింది! ఆ నియమం ప్రాచీనతను గౌరవించి అనేక ఇబ్బందులనుంచి స్ర్తిలకు రక్షణ కోసమేమోనని గుర్తించి ఉండవలసింది! అంతేకాదు, ఈ నియమంవల్ల ఎంతమంది స్ర్తిలు ఇబ్బంది పడ్డారో కూడా ఏదో ఒక లెక్క ప్రకారం అయినా అనుశీలించి ఉంటే బాగుండేది. అసలు ఈ ప్రాచీన నియమానికి వ్యతిరేకంగా కోర్టులకు ఎక్కిన వ్యక్తులు గత కొనే్నళ్లుగా ఎన్ని దేవాలయాల్లోకి వెడుతూ వచ్చారో, ఎన్నిచోట్ల వాళ్లు ఇలాంటి నిషేధాన్ని ఎదుర్కొని ఆవేదన పడ్డారో కూడా నివేదించాలని కోర్టు, అడిగి ఉండాల్సింది! వీరు ఎలాంటి సమాజం రావడం కోసం పాటుపడుతున్నారో వివరించమని అడగాల్సింది.
ఎందుకంటే శాంతి సమాజం కోసమే అయితే అందుకోసం వేల వేల ఏళ్ల కాల పరీక్షకు నిలిచిన-శాంతిః శాంతిః శాంతిః అంటూ అడుగడుక్కీ ఘోషిస్తున్న-్ధర్మ గ్రంథాలున్నాయి. వాటిని శిరోధార్యాలుగా ప్రజలు ఇప్పటికీ గ్రహిస్తున్నారు! వాటికన్నా ఘనంగా శాంతిని వీళ్లు మన మధ్యకు దింపగలరా?...అట్లా కాక ‘సమసమాజం’ కోసం అని వీళ్లు చెప్పేట్టయితే గత 70 ఏళ్లుగా వీళ్లు చెప్తూ వచ్చిన ‘సమసమాజం’ కనుచూపు మేరలో ఎక్కడైనా మోసులెత్తిందా? విభజనలు, ఉప విభజనలు-వీటితో అతలాకుతలం అయిపోవడమే గదా మనం చూస్తున్నది! మిగతా సమాజం మాట ఎలా ఉన్నా హిందువులు మాత్రం హిందూ ధర్మానికి దూరంగా తోసివెయ్యబడుతున్నారు. ఇదేనా వీరు కోరుతున్న సమసమాజం?ఉదాహరణకు సగోత్ర వివాహాలు ధర్మం ప్రకారం నిషిద్ధం. ఆ వివాహాలు చేసుకున్నవారు పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఈ ‘సమసమాజవాదు’లైన ఎన్‌జివోలు రంగంలోకి దిగి పోయారు. ఆ పెద్దల మీద ఇప్పుడు వ్యాజ్యాలు నడుస్తున్నాయి!...ఇంకా ‘వయసులో ఉన్న ఆడ, మగపిల్లలు కలిసి తిరిగితే నష్టమేమిటి?’ అన్నాడొక సుప్రీంకోర్టు మాజీ జస్టిస్! ‘స్వలింగ సంపర్కుల పెళ్లిని ఎందుకు ఆమోదించకూడదు?’ అన్నాడొక అస్సామీ జడ్జి!...అంటే హిందువులకు ఇకనుంచీ ధర్మమనేది వేరే లేదనీ, కోర్టు తీర్పులు,. చట్టాలే వారికి ధర్మ శాస్తమ్రనీ, అంచేత తమ ధర్మ జీవిత విధానాన్ని వదిలేసుకోవడమో, తల్లకిందులు చేసుకోవడమో చేసి-ఈ ఎన్‌జివోలు, స్ర్తీవాదులు కోర్టులచేత ఏమి చెప్పించగలిగితే అదే హిందువుల జీవన విధానమనీ సూచించడమే ఈ సమసమాజ కార్యక్రమం సారాంశమా? మసీదుల్లోకి మహిళలన్ని అనుమతించరు. కాగా తలాఖ్‌ను, బురఖాను వ్యతిరేకిస్తూ ‘మతం సంకెళ్లనుంచి తమకు విముక్తి కావాలి’ అంటూ బొంబాయిలోని కొంతమంది ముస్లిం లాయర్ స్ర్తిలే ఏడాది కిందట ఒక ఉద్యమం లేవదీసారు ఆ వెంటనే దియోబంద్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ‘ముస్లిం సంప్రదాయంలో వివాహాలు ముస్లిం ముల్లాల ఇష్టం. ఏ కోర్టుకూ కల్పించుకునే అధికారం లేదు!’ అని. ఎందుకంటే హిందూ సమాజం మాత్రమే పూర్తిగా ధర్మంనుంచి విడిపోవడం వీళ్ల లక్ష్యం! అల్లకల్లోలమయి, అత్యున్నత మానవత్వం మంటగలిసి హిందువులు సంప్రదాయాలనుంచి దిగజారి..దిగజారి...జంతు జీవన స్థాయికి పడిపోవడమే వీళ్లు కోరుకునేది! అందుకే వీళ్లు రాజకీయ నాయకుల్నీ, కోర్టుల్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉసి గొల్పుతున్నారు.

-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు