సబ్ ఫీచర్

ప్రేమను కోరే చిన్నారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల పెంపకం ఓ కళ. తల్లిదండ్రుల పెంపక విధానాలను బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగునా అన్న నానుడిని అనుసరించి పిల్లలను చిన్నప్పటి నుంచే సక్ర మంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రు లపైనే ఉంటుంది. అలాగని పిల్లలను ప్రతి చిన్న విషయానికీ కోప్పడకూడదు, శిక్షించకూడదు. పిల్లలను మంచి మాటలతో, ప్రేమ, ఆప్యాయతతో వారి మనస్సుల్లో మార్పు తీసుకునిరావాలి. పిల్లల వయస్సును అనుసరించి వారి శారీరక, మానసిక అవసరాలు, ప్రవర్తన, అభిరుచులూ మారుతూ ఉంటాయి. వాటిని పెద్దలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతోనే అసలు సమస్యలు మొదలవుతాయి. అందుకే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచీ వారి పెంపక విధానాలపై దృష్టి పెడితే పిల్లల భావి జీవితం ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుంది. ఇందుకు తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటించాలి. దీంతో పిల్లల పెంపకం చాలా సులువవుతుంది. ఇదేవిషయాన్ని చాలామంది పరిశోధకులు, చిన్న పిల్లల నిపుణులు కూడా చెబుతున్నారు.
* తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో ఆడుతూ పాడుతూ గడపాలి. అప్పుడు పిల్లలు కూడా అంతే చలాకీగా ఉండి సమాజ మెప్పును పొందుతారు. ఎన్నో విజయాలను సాధిస్తారు.
* తల్లిదండ్రులు దయ, కరుణ గల స్వభావులైతే పిల్లలు కూడా అటువంటి వ్యక్తిత్వానే్న అలవరుచుకుంటారు. తల్లిదండ్రులకు ఈ గుణం ఉండటం చాలా అవసరం. ఎందుకంటే పిల్లల పెంపకంలో ప్రతి సమస్యను దయ, కరుణతోనే చూడగలగాలి. అప్పుడే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు.
* అమ్మానాన్నలు ఇంట్లో ఎప్పుడూ ప్రతికూల ప్రవర్తనను చూపకూడదు. ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. వారు దాన్ని బడిలో స్నేహితులపైన చూపుతారు. అంతేకాకుండా వారు గొడవలు పడటం తప్పుకాదు, ఇంట్లో అమ్మానాన్నలు కూడా ఇదే చేస్తున్నారు కదా అనుకుంటారు.
* చిన్నప్పటి నుండీ పిల్లల పట్ల స్నేహంగా ఉండే అమ్మానాన్నలకు, కౌమారదశలోకి వచ్చిన పిల్లల నుండి వచ్చే సమస్యలు రావని చెబుతున్నారు పరిశోధకులు. అప్పుడే వారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. వారు ఎటువంటి ఒత్తిడికి లోనుకారు.
* కౌమారంలోకి వచ్చిన పిల్లలు చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. తమ కార్యకలాపాల్లో అమ్మానాన్నల జోక్యం ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుండి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అందరూ కూర్చునిప్రేమగా, శాంతంగా మాట్లాడే అలవాటు ఉంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర బాహాటంగా, నిష్కపటంగా ఉంటారు. అమ్మానాన్నలకు కూడా పిల్లల పట్ల నమ్మకం ఉంటుంది.
* ఆందోళన, ఒత్తిడి సమస్యతో సతమతమయ్యే అమ్మానాన్నలకు పిల్లల పెంపకం ఎప్పుడూ సమస్యనే.. అలాంటివారికి పిల్లలు ఏ విషయం చెప్పినా దాన్ని పెద్ద సమస్యగా తీసుకుని పిల్లలను కసురుతూనే ఉంటారు. పిల్లలు కూడా అదే అలవాటై బయటి ప్రపంచంలో కూడా అలాగే ఉంటారు. ఫలితంగా సమాజంలో రాణించలేరు.
* వైవాహిక జీవితం సరిగా లేని తల్లిదండ్రుల పిల్లలు ఎప్పుడూ ఒత్తిడితో బతుకుతుంటారు. వారికి కంటినిండా నిద్ర ఉండదు. అలసట, చికాకు, విసుగు ఉంటాయి. చదువులో ఏకాగ్రత కుదరదు. ఆటపాటల్లో రాణించలేరు. ఫలితంగా వారిపై వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు.
* పిల్లలు చేతికందివచ్చాక వారు తమ కాళ్ళపై తాము నిలబడాలనుకోవడం అత్యాశ కాదు. కాని వారికి అమ్మానాన్నల సహాయ సహకారాలు చాలా అవసరం. ముఖ్యంగా తల్లి అలాంటి సహాయాన్ని వారికి అందిస్తే వారు కచ్చితంగా ఉన్నత స్థితిని సాధిస్తారు.
* తమ పిల్లలు అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉండాలని అమ్మానాన్నలు అనుకోవడం పిల్లలకు ఓ రకమైన హింసే.. ప్రతి ఒక్కరిలో ఏదో ఓ లోపం ఉంటుంది. తల్లిదండ్రులు మంచినంతా వదిలేసి పిల్లల్లో ఉన్న ఆ చిన్నలోపాన్ని ఎత్తిచూపుతుంటే వారు ఆత్మన్యూనతతో బాధపడుతూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అందుకే వారి మంచితనాన్ని పొగుడుతూ.. కాస్త శ్రద్ధ తీసుకుంటే వారు ఆ లోపాన్ని అధిగమిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* పిల్లలను చక్కగా పెంచాలి, సమాజంలో మనకు, మన పిల్లలకు మంచి పేరు రావాలని పిల్లలపై ఒత్తిడి తేవడం మంచి పద్ధతి కాదు. కఠినంగా ప్రవర్తించే తల్లిదండ్రుల పిల్లల కంటే, మృదు స్వభావం కలిగిన వారి పిల్లలకు చింతా, వ్యాకులత వంటి సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు.
అద్భుతమైన, ఆరోగ్యకరమైన నవ సమాజాన్ని నిర్మించాలంటే దయ, కరుణతోపాటు సానుకూల ప్రవర్తన గల యువత తప్పనిసరి. అలాంటి యువతకు మూలం తల్లిదండ్రుల పెంపకం. కాబట్టిప్రతీ అమ్మానాన్నలు వారి పెంపక విధానంలోని లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. అప్పుడే వారు పిల్లల భావి జీవితానికి బంగారు బాటలు వేయగలరు.
*