సబ్ ఫీచర్

నిద్రతో ఒత్తిడి మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలంతో పాటు పోటీపడే నేటి ప్రపంచంలో మనిషికి ఒత్తిడి ఎదురవడం చాలా మామూలు విషయమే! సమయానికి ఇచ్చిన ప్రాజెక్టు పూర్తిచేయాలనో, భాగస్వామి గురించో, ఆర్థిక విషయాలో, పిల్లల గురించో ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి జీవితంలో ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. వాటి తాలూకు ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. ఆ ఆలోచనలే ఒత్తిడికీ, కుంగుబాటుకు అసలైన కారణం. మరి ఆ ఆలోచనలనుంచి బయటపడాలంటే ఈ చిట్కాలను పాటించండి అని చెబుతున్నారు మానసిక నిపుణులు.
* ముందుగా ప్రతి ఒక్కరూ అన్ని సమస్యలకూ పరిష్కారాలు ఉంటాయి అనే విషయాన్ని కచ్చితంగా నమ్మాలి. సమస్య ఉత్పన్నం కాకమునుపే దానికి పరిష్కారం తయారుచేయబడి ఉంటుందనేది అందరికీ తెలిసిన సత్యమే! ఈ విషయాన్ని సమస్య ఎదురైనప్పుడు వల్లె వేసుకుంటే పరిష్కారం దిశగా ఆలోచనలు సాగుతాయట.
* సమస్య చిన్నదైనా, పెద్దదైనా ఒకచోటే కూర్చుని ఆలోచించేకంటే పచ్చని ప్రదేశాల్లో, చల్లగాలికి నడుస్తూ లేదా పచార్లు చేయడం వల్ల చక్కని ఆలోచనలు వస్తాయట.
* డైరీ రాయడం వల్ల, ఓ తెల్ల కాగితాన్ని తీసుకుని నచ్చింది రాసినా కూడా సమస్యకు పరిష్కార మార్గం తోస్తుందట.
* నిద్ర పోవడం వల్ల కూడా మెరుగైన ఆలోచనలు వస్తాయట. సమస్య ఉంటే నిద్ర ఎలా పడుతుంది అని ప్రశ్నిస్తున్నారు కదూ.. నిద్ర పట్టదు. కానీ ప్రయత్నించాలి. గదంతా చీకటిగా ఉంచి మంద్రస్థాయిలో సంగీతం వింటే మంచి కునుకు పడుతుంది. ఆ కునుకులోనే సమస్యలకు పరిష్కారాలూ దొరుకుతాయి. ఎందుకంటే నిద్ర లేమి ప్రతికూల ఆలోచనలకి కారణమవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే ఏ మాత్రం ఒత్తిడిగా అనిపించినా సరే.. ముందు కాసేపు కునుకు తీస్తే సరి!
*