సబ్ ఫీచర్

మానసికానందానిచ్చే డూడుల్ ఆర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి కొత్త కొత్త ఆలోచన్లు రేకిత్తించడానికి కళలు ఉపయోగపడుతాయని అంటారు. మానసిక వైద్యులు సైతం కళల ద్వారా మనిషిలో ఉన్న మానసిక వైకల్యాన్ని దూరం చేయవచ్చుఅంటారు. కొంతమంది వైద్యులు రోగి చేతికి కాగితం పెన్సిల్ ఇచ్చి మీకు తోచిన బొమ్మను వేయండి అంటారు. ఇలా వాళ్లు వేసిన బొమ్మల ద్వారా వాళ్లల్లో ఉన్న లోపాలను గుర్తించవచ్చు అనేది మానసిక వైద్యుల ఆలోచన. ముఖ్యంగా పిల్లల్లో బొమ్మలు వేయడం అనే కళ పై ఆసక్తిని కలిగిస్తే వారు మంచి మేధావులుగా రాణిస్తారు.
అటువంటి బొమ్మలు చిత్రీకరణలో డూడుల్ ఆర్ట్ ను ఈమధ్య పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ డూడల్ ఆర్ట్ నిజానికి 17,18 శతాబ్దాల కాలంలోనే ఉందని అంటారు. ఏదీ తోచక పోయినప్పుడు ఇలాంటి బొమ్మలు వేసేవారని కొందరు అంటారు.
పెన్సిల్ పట్టుకొన్న చేతిని పైకి లేపకుండా అద్భుతమైన కళాఖండాన్ని తీర్చిదిద్దడానే్న డూడుల్ ఆర్ట్‌గా చెప్పుకోవచ్చు. విదేశాల్లో డూడుల్ ఆర్ట్ కోసం కొన్ని గోడలను కూడా కేటాయించారట. ఆ గోడల మీద డూడుల్ ఆర్ట్స్ ను ప్రదర్శించేవారికి ఈ గోడలు పెద్ద బహుమానాలు అవుతాయి.కొంతమది కళాకారులు కూడా ఈ డూడుల్‌ఆర్ట్‌ను ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేసే విద్యార్థులు చదువు మధ్యలో రిలాక్సింగ్ కోసం ఈ డూడుల్ ఆర్ట్ వేయడానికి ఆసక్తిని చూపుతారు. ఏది ఏమైనా డూడుల్ ఆర్ట్ అటు మానసిక ఆనందానికి, ఒత్తిడిని తగ్గించుకొనేందుకు సహాయపడుతుంది. కనుక పిల్లలు పెద్దలు ఈ డూడుల్ ఆర్ట్ మీద దృష్టి పెడదాం. అనేక అద్భుత కళాఖండాలను నిర్మించుకుందాం.

-చరణశ్రీ