సబ్ ఫీచర్

ట్రెండీ.. ట్రెండీ.. మెహందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు పెళ్లిళ్ళలో మెహందీ
వేడుక తప్పనిసరి! వచ్చిన బంధువుల నుంచీ
పెళ్లికూతురు వరకు అందరినీ రకరకాల మెహందీ
డిజైన్లలో అలంకరిస్తుంటారు మెహందీ డిజైనర్లు. మునుపు
గోరింటాకు డిజైన్లు మణికట్టు వరకే ఉండేవి. కానీ మెహందీ డిజైనర్లు వాటిని ట్రెండ్ పేరుతో మోచేతుల వరకూ తరువాత మోచేతులు దాటి స్లీవ్స్‌దాకా వెళ్లిపోయారు. కాళ్లకైతే మొదట పాదాలు.. అలా అలా ఇప్పుడు మోకాలి వరకూ గోరింటాకు డిజైన్లు వెళ్లిపోయాయి. ఇక ఈ ట్రెండ్‌ను
కొనసాగించలేం.. కొత్తగా ఆలోచించాలనుకున్నారో.. ఏమో.. ఇప్పుడు గోరింటాకు డిజైన్లను అరికాళ్ళలో కూడా వేస్తున్నారు డిజైనర్లు.
నిజమండీ.. నేటి నయా ట్రెండ్ ఇదే.. నేడు పెళ్ళికూతుర్లు,
అమ్మాయిల అరికాళ్ళలోనూ గోరింటాకు అందాలను
పూయించేస్తున్నారు గోరింటాకు
కళాకారిణులు.